Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబర్ 10న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుపతి మామకి పెళ్లి..

తిరుపతికి ధీరజ్ గుడిలో పెళ్లి చేస్తా అంటే సేనాపతి తిరుపతిని గుడికి తీసుకెళ్తాడు. ధీరజ్‌కి ప్రేమ విషయం చెప్తుంది. మరి వాళ్ల పెళ్లికి మనం సాయం చేద్దాం అనుకున్నాం కదా.. త్వరగా రెడీ అయి రా అని ధీరజ్ ప్రేమకి చెప్తాడు. ప్రేమ సరే అని వెళ్తుంది. ఇక చందు లెక్కలు తండ్రికి చూపిస్తుంటే నేను మిల్లుకి వస్తానని రామరాజు అంటాడు. ఇంతలో ధీరజ్ వచ్చి అమ్మ ఎక్కడుంది అని అడుగుతాడు. మీ అమ్మ లేదు అని మీ కామాక్షి అత్త వాళ్ల ఇంటికి వెళ్లిందని నర్మద చెప్తుంది. ఏమైంది ఎందుకు అంత కంగారుగా ఉన్నావ్ అని రామరాజు అడిగితే తిరుపతి మామకి గుడిలో నిశ్చితార్థం అని ధీరజ్ అంటాడు. ఆ మాట విన్న వల్లీ షాక్ అయిపోతుంది. వారం తిరిగే సరికి భద్రావతి తమ్ముడికి పెళ్లి చేస్తా అంది కదా.. భద్రావతి కోపంగా చేసిన మంచి పనే చేస్తుంది.. అని రామరాజు అంటాడు.

భాగ్యం అలాగే చేస్తుంది..

నర్మద ధీరజ్ దగ్గరకు వెళ్లి ఆ భాగ్యం కుట్రలు కుతంత్రాలు చేయడంలో పండిపోయింది.. సుక్కు ప్రేమ దోమ అంటూ తిరుపతి బాబాయ్ వెంట పడుతుందని నువ్వే చెప్పావ్.. డబ్బున్న వాళ్ల విషయంలో ప్లాన్ చేసి భాగ్యం పెళ్లి చేస్తుంది. అలాగే కదా వల్లీని ఈ ఇంటికి పంపింది.. ఇప్పుడు తిరుపతి బాబాయ్‌కి సుక్కుని అంటగడితే బాబాయ్ జీవితం నాశనం అయిపోతుంది అని నర్మద అంటే మా మీద నిందలు వేస్తావేంటి అని వల్లీ అంటే సుక్కూని తిరుపతి బాబాయ్ మీదకి ఉసిగొలిపింది మీరే కదా అని నర్మద అంటుంది. తిరుపతి బాబాయ్ ప్రేమించకపోతే చచ్చిపోతా అని సుకన్యని బెదిరించాడు.. మాలాంటి మంచి వాళ్లకే ఇలాంటి నిందలు అని వల్లీ అంటుంది. ధీరజ్ సుక్కుతో కాకుండా వేరే వాళ్లతో తిరుపతి బాబాయ్ పెళ్లి అవుతున్నందుకు సంతోషపడదాం అని నర్మద అంటుంది.

తిరుపతికి నిశ్చితార్థం..

వల్లీ తన తల్లికి ఫోన్ చేసి కాసేపట్లో గుడిలో తిరుపతి నిశ్చితార్థం అని చెప్పడంతో సుకన్య, భాగ్యం షాక్ అయిపోతారు. మన ప్లాన్స్‌ అన్నీ ఎగిరి తన్నేసినట్లేనా అని భాగ్యం అంటే అన్నీ జరుగుతాయి నేను చెప్పినట్లు చేయ్ అని ధీరజ్‌కి ఫోన్ చేసి నేను చెప్పినట్లు చెప్పు అని వల్లీ అంటుంది.

చచ్చిపోతా ధీరజ్..

సుకన్య ధీరజ్‌కి ఫోన్ చేసి నేను చచ్చిపోతా.. తిరుపతిని నిశ్చితార్థం అయితే నేను తట్టుకోలేను.. మీ మామయ్య నువ్వు మాకు అండగా ఉంటావని చెప్పాడు.. నువ్వేం చేయలేవా అని సుకన్య అంటే రెండు కుటుంబాల గురించి ఆలోచిస్తున్నా అని ధీరజ్ అంటే సరే అయితే నేను పోతా నా చావు చూసి మీ మామ చనిపోతాడు. మా చావులకు నువ్వే కారణం అవుతావు అని సుకన్య అంటుంది. సుకన్య సూసైడ్ చేసుకుంటున్నట్ల భాగ్యం సుక్కు ఆగు సుక్కు ఆగు అంత పని చేయకు అని అరుస్తుంది. ఈ రోజే మీ పెళ్లి చేస్తా అని ధీరజ్ మాటిస్తాడు. తన ప్లాన్ సక్సెస్ అయింది అని వల్లీ సంబర పడిపోతుంది. ధీరజ్ రకరకాల ఆలోచనలతో నలిగిపోతాడు. రెండు కుటుంబాల మధ్య గొడవకు కారణం అవుతాను అయినా తప్పదు అని ధీరజ్ ఇద్దరికీ పెళ్లి చేయాలి అనుకుంటాడు.

వదిన చంపేస్తుంది..

ప్రేమ చక్కగా లంగావోణి కట్టుకొని కళ్లద్దాలు పెట్టుకొని రెడీ అయి స్టైల్‌గా నడుస్తూ వస్తుంది. ధీరజ్ చూసి ఎవరు ఈ అందగత్తె అనుకొని దగ్గరకు వెళ్తాడు. ప్రేమ ఎవరో అనుకొని చుట్టూ చక్కర్లు కొడతాడు. తర్వాత ప్రేమని చూసి నువ్వా అని ధీరజ్ అంటే ఏంట్రా వేరే అమ్మాయి అనుకొని సైట్ కొడుతున్నావా అని తిడుతుంది. సరే సరే ఇప్పుడు మన కొట్లాట ఆపి తిరుపతి బాబాయ్ సుకన్యలకు పెళ్లి చేయాలి పద అని ధీరజ్ అంటాడు., ఇద్దరూ వెళ్తుంటే నర్మద చూసి ఆపుతుంది. అక్కకి నిజం చెప్దామా అని ప్రేమ అంటే ఏంటి చెప్పేది.. ఇందాకే తిరుపతి బాబాయ్‌ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది.. ఇప్పుడు విషయం తెలిస్తే వదిన చంపేస్తుంది.. నాన్నకి చెప్పేస్తుంది అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమతో ఇక్కడ కారు ఎక్కకు వీధి చివరకు రా మళ్లీ వదినకు డౌట్ వస్తుందని అంటాడు. నర్మద ముందు ఇద్దరూ గొడవ పడి ఎవరి దారిన వాళ్లు వెళ్తారు. లంగావోణి కళ్లజోడు ఏదో డౌట్ కొడుతుంది. వీళ్లని ఫాలో అవ్వాలి అని నర్మద అనుకుంటుంది. ప్రేమ వీధి చివర ధీరజ్ కారు ఎక్కడం నర్మద చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.