Illu Illalu Pillalu Serial Today Episode :బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. వేరు కాపురం పెట్టిన సాగర్‌కి బుద్ధి వచ్చేలా చేయడానికి నర్మద వంట ఏం చేయకుండా.. రామరాజు వాళ్ల దగ్గరకు వెళ్లి తినడం.. వేదవతిని సాగర్ బాధ పెట్టడం తదితర ఆసక్తికర సీన్స్‌తో సీరియల్ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది.. ఈ రోజు(మే 28న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వేరు కాపురం పెట్టాం ఆ విషయం గుర్తుందా..

రామరాజు వాళ్లంతా తింటూ ఉంటే నర్మద ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో సాగర్ వస్తే ఒట్టి చేతులతో వచ్చావ్ తినడానికి ఫుడ్ తీసుకురాలేదు అని అంటుంది. నువ్వు తినేసి వచ్చేస్తే సరిపోతుందా.. పెళ్లాం తిందో లేదో పట్టించుకోవా అని అడుగుతుంది. నేనేం బయట తినలేదు.. నువ్వేం వండలేదా అని అని సాగర్ అడుగుతాడు. ఏంటి వండేది మనం వేరు కాపురం పెట్టాం ఆ విషయం నీకు గుర్తుందా అని నర్మద భర్తని ప్రశ్నిస్తుంది. ఏం సరుకులు తెచ్చావ్ అని వండటానికి ఆఫీస్ నుంచి వచ్చింది కదా ఏమైనా తిందా లేదా అని పట్టించుకోవా.. ఇంట్లో పరిస్థితులు నీకు తెలీదు.. ఇదేనా కాపురం పెట్టే విధానం అని అడుగుతుంది.

నర్మద ఉగ్రరూపం..

ఎందుకు ఇంత కోపం నర్మద ఆన్‌ లైన్‌లో ఆర్డర్ పెడతా అని సాగర్ అంటే నాకేం వద్దు నువ్వే తిను అని నర్మద చిరాకుగా లోపలికి వెళ్లిపోతుంది. వేదవతి వాళ్లు బాధ పడతారు. ఇంతలో నర్మద మళ్లీ కోపంగా వచ్చి రామరాజు వాళ్ల దగ్గరకు వచ్చి వల్లీతో బాగా మెక్కు అని అంటుంది. తర్వాత వేదవతితో వేదవతి గారు ప్లేట్ ఇవ్వండి భోజనం పెట్టండి అని వడ్డించుకుంటుంది. మాట్లాడితే 25 ఏళ్ల సంసారం.. ఐదు గురు పిల్లలు అంటారు.. భోజనం మాత్రం వడ్డించడం రాదా.. కూరలు ఎదురింటి వాళ్లని ఆడుక్కోవాలా అని నర్మద అంటుంది.

వాళ్లకి మనకి పడదు వదినా..

ఎదురింటి వాళ్లకి మనకి పడదు వదినా.. వాళ్లు అసలే రాక్షసులు. అందులో ఒక పిల్ల రాక్షసి రోజు మన ఇంట్లోనే ఉంటుంది కదా.. అని ధీరజ్ అంటాడు. నర్మద స్పీడ్‌గా తినేస్తూ వంటలు సూపర్ అత్తయ్యా అందుకే మామయ్య మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తున్నారు. భర్తని కొంగున కట్టేసుకుందని అందరూ అనేది ఇందుకే అని నర్మద అంటుంది. వేదవతి మనసులో ఉండవే గుండె దడగా ఉంది అని అనుకుంటుంది. నర్మద తింటుంటే ధీరజ్, ప్రేమలు ఈ కూర బాగుంది ఆ కూర బాగుంది అని అంటారు. నర్మద స్పీడ్‌గా తింటూ ఉంటే ఎక్కిళ్లు వస్తాయి.. దాంతో నర్మద అత్తగారు మీకు అసలు కోడలు మీద ప్రేమ ఉందా.. ఎంత వేరు పడితే మాత్రం కోడల్ని పట్టించుకోరా అని అంటుంది. దాంతో వేదవతి నర్మదకు నీరు తాగిస్తుంది.

నేను ఇలాగే ఉంటాను..

నర్మద ఫుల్‌గా తినేసి అత్తకి థ్యాంక్స్‌ చెప్పి.. మామయ్య మీకు మీ కొడుకు గొడవలు ఉంటే ఉండొచ్చు కానీ నేను ఇలాగే ఉంటాను. వాటితో నాకు సంబంధం లేదు.. నాకు కుటుంబంలో అందరూ కావాలి దయచేసి అర్థం చేసుకోండి అని నర్మద అంటుంది. వద్దు అనుకొని తెంచుకొని వెళ్లిపోయింది నీ మొగుడే కానీ మేం కాదమ్మా అని రామరాజు అంటాడు.

నర్మద ఏంటి నువ్వు చేసింది..

సాగర్ నర్మదని ఆపి ఏంటి నువ్వు చేసింది అని అడుగుతాడు. వంట అదిరిపోయింది కావాలి అంటే నువ్వు తిను అని నర్మద అంటుంది. వాళ్ల వంట తినాలి అంటే నాకు సిగ్గు లేదు అనుకున్నావా అని సాగర్ అంటాడు. ఇన్ని రోజులు సిగ్గు లేకుండా ఉన్నావా అని నర్మద అడుగుతుంది.

వేరు కాపురాలబ్బాయ్ ఆ పని చేయరా..

సాగర్‌ని ధీరజ్‌ పిలిచి వేరు కాపురాలబ్బాయ్ నీకు ఆకలి వేస్తే వచ్చేయ్ అమ్మ చేతి వంట సూపర్‌గా ఉంది.. వచ్చి నాన్న కాళ్ల మీద పడు అందరూ సంతోషంగా ఉంటాం అని అంటాడు.

ఏంటమ్మా ఈ డ్రామాలు..

సాగర్ ఆకలికి అలమటిస్తూ బయట కూర్చొని ఉంటే వేదవతి అన్న తీసుకొని వెళ్లి తినమని అంటుంది. ఏంటమ్మా ఈ డ్రామాలు నీ భర్త తిడతాడు నువ్వు ఇలా చేస్తావ్ అని సాగర్ అంటే.. ఏంట్రా కన్న తల్లి ప్రేమ నీకు నాటకంగా కనిపిస్తుందా.. కొడుకు కడుపు నింపడం కోసం ఈ అమ్మ ఆవేదన నీకు అబద్ధంలా కనిపిస్తుందా.. అమ్మ కన్నీటిలోని పాలలోనూ అబద్ధం ఉండదురా అని అంటుంది.

ఇదే ప్రేమ ఇందాక ఏమైంది..

అమ్మ నేను అన్నం తినలేదు అని నీకు అప్పుడే తెలుసు కదా.. మరి అప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి వెళ్లిపోయింది. నువ్వు నీ భర్తకి భయపడుతూ నా మీద ఇలా చాటుగా చూపించే ప్రేమ నాకు అవసరం లేదు.. నువ్వు మీ ఆయన వైపే ఉండు.. అనిఅంటాడు. మాటలతో చంపకురా అన్నం తినరా అని వేదవతి ఏడిస్తే మీకో దండం ఈ దొంగ ప్రేమలతో చంపేయకండీ.. నేను మిమల్ని వదిలేశాను.. నా బతుకు నన్ను బతకనివ్వండి అని వేదవతితో దారుణంగా ప్రవర్తించి వెళ్లిపోమని అంటాడు. నువ్వు మీ ఆయన నన్ను చంపే వరకు ప్రశాంతంగా ఉండేలా లేరు అని సాగర్ అనడంతో వేదవతి ఏడుస్తూ వెళ్లిపోతుంది.

కన్నతల్లితో ఇలాగే మాట్లాడుతావా..

నర్మద సాగర్‌తో ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్,.., కన్న తల్లితో అలాగేనా మాట్లాడేది.. అని అడుగుతుంది. వాళ్లే అనుకుంటే నువ్వు నా ప్రాణానికి తయారయ్యావ్ అని చిరాకుగా సాగర్ వెళ్లిపోతాడు.

నీ కడుపు నిండిందా..

కన్న కొడుకు కడుపు నింపుదాం అని వెళ్లావ్ వాడు మాటలతో నీ మనసు గాయం చేసేశాడు ఇప్పుడు నీకు సరిపోయిందా అని రామరాజు అంటే వేదవతి చాలా ఏడుస్తుంది. నా ప్రేమ నాటకం అని వాడు అనగానే నా ప్రాణం పోయింది అండీ అని గట్టిగా ఏడుస్తుంది. ప్రస్తుతం వాడు భ్రమలో ఉన్నాడు కొన్ని రోజులు వాడిని అలాగే వదిలేస్తే దారిలోకి వస్తాడు అని రామరాజు అంటాడు.

భార్యాభర్తలు మధ్యలో బట్టలు..

ప్రేమ బట్టలు ఉతుకుతూ ఉంటే సాయం చేస్తా అని ధీరజ్ వెళ్తాడు. ఇంతలో ఇద్దరూ ఒకర్ని ఒకరు మీద పడిపోవడంతో అమాయకుడిని ఇలా డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదు.. పోనిలే అని సాయం చేస్తా అంటే మనసు వేరే వైపు మళ్లేలా చేస్తున్నావ్ అని ధీరజ్ అంటాడు. వెనక వైపు తిరుగుతూ బట్టలు పిండుతూ మళ్లీ ప్రేమ దగ్గరకు ముద్దు పెట్టుకోవడానికి వెళ్లి ఈ పసి మనసుకు ఏదేదో చేస్తున్నావ్ అని ధీరజ్ అంటాడు. సచ్చినోడా నువ్వు సాయం చేయడానికి వచ్చావా.. రొమాన్స్ చేయడానికి వచ్చావా అని ప్రేమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

వేరు కాపురం పెట్టిన సాగర్ వంట గదిని కూడా వేరు చేస్తాడా.. భార్య కోరిక మీద ఇంట్లో వాళ్లతో కలిసిపోతాడు.. భర్తని మామని కలపడానికి నర్మద ఏం చేయనుంది.. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.