Illu Illalu Pillalu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(మే 26న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్వక్‌కి షాక్ ఇచ్చిన అమూల్య..

అమూల్యని ఏడిపించడం వల్ల ఇక కాలేజ్‌కి రాదు అని విశ్వక్ తన ఫ్రెండ్స్‌తో అంటే అమూల్య కాలేజ్‌కి ఎంట్రీ ఇచ్చి విశ్వక్‌కి షాక్ ఇస్తుంది. పెళ్లి ఫస్ట్‌నైట్ అన్నా కూడా ధైర్యంగా కాలేజ్‌కి వచ్చింది అంటే ఇక అది ఎక్కడో దూకి చచ్చేలా టార్చర్ చేయండి అని అంటాడు. విశ్వక్ ఫ్రెండ్స్ వెళ్లి రూం ఎక్కడ బుక్ చేయమని అంటావ్ అని ఏడిపిస్తారు. ఇంతలో ధీరజ్ వచ్చి నేను మీకు బుక్ చేస్తానురా ఐసీయూలో అని అంటాడు. మేం నీ కోసం శ్మశానంలో బుక్ చేస్తారా అని విశ్వక్ ఫ్రెండ్స్ అంటారు.

ALSO READ: చక్రిని వదిలించుకోవడానికి ప్రతాప్‌ వేసిన ఎత్తులేంటి..? మహా ఇంట్లో చక్రికి ఎలాంటి అవమానం జరిగింది..?

మై డియర్ ఆడ లేడీస్ కమాన్..

ధీరజ్ వాళ్లతో మిమల్ని నేను కొట్టడం ఎందుకురా.. మీ కోసం మా ఆడ లేడీస్ ఉన్నారు అని కమాన్ మై డియర్ ఆడ లేడీస్ అని అంటాడు. దాంతో నర్మద, వేదవతి, ప్రేమలు కళ్లద్దాలు పెట్టుకొని కర్ర పట్టుకొని గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. గరిటకు తక్కువ స్పూన్‌కి ఎక్కువ వీళ్లు మమల్ని కొడతారా అని వాళ్లు అంటారు. అవునా అయితే ఇప్పుడు చూడు అని ధీరజ్ పక్కకి వెళ్తాడు. ముగ్గురు కలిసి విశ్వక్ ఫ్రెండ్స‌‌ని చితక్కొట్టేస్తారు.

విశ్వక్ తాట తీసిన ధీరజ్..

విశ్వక్ పారిపోతూ ఉంటే ధీరజ్ వెంట పడి పట్టుకుంటాడు. వాళ్లకి నాకు ఏం సంబంధం లేదురా ఇక్కడ ప్రకృతి బాగుంటే వచ్చా అని విశ్వక్ అంటే ధీరజ్ విశ్వక్‌ని కొట్టేస్తాడు. దాంతో విశ్వక్ పారిపోతాడు. మరోవైపు రౌడీలు కర్రలు పట్టుకొని వస్తే వేదవతి భయపడుతుంది. నర్మద, ప్రేమ చితక్కొట్టేస్తారు. ధీరజ్ ఎక్కువ చేసిన వాడిని అమూల్య దగ్గరకు తీసుకొచ్చి వీడు ఇంకా ఎక్కువ చేశాడు.. ఇంకోసారి నీతో పెట్టుకోవాలంటే భయపడేలా చేయ్ అని అనడంతో అమూల్య వాడి చెంపలు వాయించేస్తుంది. నా చిన్న కొడుకు బంగారం.. ఇంటి సమస్యలే కాదు ఆడపిల్ల సమస్యలు కూడా తీరుస్తున్నాడు అని వేదవతి మురిసిపోతుంది.

నా మేనల్లుడి జోలికి వస్తాడా..

విశ్వక్ దెబ్బలతో ఇంటికి వస్తే ఇప్పుడే జైలు నుంచి వచ్చావ్ మళ్లీ ఈ గొడవలు ఏంట్రా అని రేవతి అంటుంది. నేను ఏదో నాఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ ఉంటే ధీరజ్ వచ్చి ముసుగు వేసుకొని ఇంట్లో కూర్చొమని అంటే ఇలా బయటకు వచ్చావేంట్రా అని ధీరజ్ కొట్టాడని విశ్వక్ అంటాడు. నా మేనల్లుడినే కొడతాడా అని భద్రావతి అంటుంది. ఇద్దరూ నా మనవల్లేరా.. వీడు ఏ తప్పు చేయకుండా ధీరజ్ కొట్టడు అని బామ్మ అంటుంది. పనోడి కొడుకుని ఎప్పటికీ మనలో కలపకు.. వాడు ఎప్పటికీ నీ మనవడు కాదు అని భద్రావతి అంటుంది.

తండ్రి కంటే ఎక్కువ కొడుకు రెచ్చిపోతున్నాడు..

సేనాపతి భద్రావతితో అక్కా వాడు తండ్రి కంటే ఎక్కువ రెచ్చిపోతున్నాడు.. వాడి ఉడుకు రక్తం తగ్గి మన దగ్గర మోకాల మీద నిలబడాలి అని అంటాడు. వాడి కారు గురించి కనుక్కోమని చెప్పా కదా అక్కడి నుంచి నరుక్కొద్దాం అని భద్రావతి అంటుంది.

అది నేనే.. ఇది నేనే..

శ్రీవల్లి సుకన్యతో కలిసి ఇంటికి మధ్య గీసిన గీత దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఆ గీత గీసింది నేనే.. నర్మద నా జోలికి రాకుండా బయటకు పంపింది నేనే అని గెంతులేస్తుంది. ఇంతలో నర్మద, ప్రేమ వస్తారు. ఇద్దరూ సీరియస్‌గా చూసి అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఏనా అని అడుగుతారు. అదేంటి చెల్లాయ్‌లు అంత మాట అన్నారు అని వల్లీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రెగ్నెంట్స్ ఎలా ఉంటారో నీకు తెలీదా అని నర్మద అంటుంది. అయ్యో దొరికిపోయానా అని వల్లీ టెన్షన్ పడుతుంది. డాక్టరమ్మ ఇలా చేయమంది బిడ్డకు మంచిది అని సుకన్య అంటుంది.

పద డాక్టర్ దగ్గరకు వెళ్దాం..

డాక్టర్ అంటే గుర్తొచ్చింది.. నీకు డాక్టర్‌కి చూపించాలి.. మందులు తీసుకోవాలి వెళ్దాం పద అని నర్మద, ప్రేమలు అంటే సుకన్య నిన్నే వెళ్లాం బిడ్డ బాగుంది అని చెప్పారు.. మందులు కూడా ఇచ్చారు అని సుకన్య అంటుంది. ప్రేమ వాటిని తీసుకొని చూసి ఇన్ని మందులు ఉన్నాయి ఏంటి.. ఇవి మింగడానికా.. అమ్మడానికా అని ప్రేమ అంటుంది. ఏదో తేడా కొడుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్దాం పద అని ఇద్దరూ వల్లీ చేతులు లాక్కెళ్తారు.

రామరాజుని చూసి నాటకం..

రామరాజు ఇంట్లోకి రావడం చూసిన వల్లీ కళ్లు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. ఏమైందని రామరాజు కంగారుగా వెళ్తే కడుపుతో ఉందని చూడకుండా ఇద్దరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతున్నారు అని సుకన్య చెప్తుంది. కడుపుతో ఉన్న వాళ్లకి ఇన్ని మందులు రాయరు మామయ్య.. కడుపుతో ఉన్న అక్కని జాగ్రత్తగా చూసుకోవాలని మా తపని అని ఇద్దరూ అంటారు. మా కోడల్ని మేం చూసుకుంటాం అమ్మా.. గీత అవతల ఉన్న నువ్వు ఇవతలకు రావొద్దు అని రామరాజు చెప్తాడు. మరోవైపు ధీరజ్ కోసం ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

నర్మద, ప్రేమలపై వల్లీ ఎత్తులు, కారు విషయంలో ధీరజ్‌ని భద్రావతి, సేనా టార్గెట్ చేయడం ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.