Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్‌లో పెద్ద సంచలనం! ఆస్తి వివాదంతో రామరాజు కుటుంబం చీలిక స్థాయికి చేరుకుంది. వల్లీ ఇంటి మధ్యలో గీత గీయడం, వేదవతి కన్నీళ్లు, సాగర్- నర్మద వేకు కాపురం ప్రతిపాదన- పూర్తి ఎపిసోడ్ వివరాలు ఇక్కడ చదవండి.

ఆస్తిలో వాటా ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తాం అని నర్మద తండ్రి ప్రసాద్‌రావు అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏం చేసుకుంటావో చేసుకో నీ బెదిరింపులకు ఈ రామరాజు భయపడడు అని రామరాజు అంటాడు. లాయర్ రామరాజుతో మీరు ఆస్తులు పంచకపోతే కోర్టుల చుట్టూ తిరగాలి.. నలుగురిలో నవ్వులు పాలు అవుతారు అని లాయర్ అంటాడు. ఈ పెద్ద మనిషి మాటలతో వినడు.. కోర్టు నోటీస్ పంపిద్దాం పదండి మామయ్య అని సాగర్ అంటాడు.

ALSO READ: Nindu Manasulu Serial Today May 21st: నిండు మనసులు: తండ్రిని గుర్తు చేసుకొని ఏడ్చేసిన సిద్ధూ! బెడ్ మీద సిద్ధూ ప్రేరణని కొట్టడానికి కారణమేంటి?

వేదవతి కోపంగా నీకు బుద్ధుందారా.. కని పెంచిన పాపానికి ఇలా మమల్ని ఏడిపిస్తూ మీ నాన్నకే ఎదురు తిరుగుతావా.. మీ నాన్న సంపాదించినది మొత్తం మీకేరా.. కానీ ఇప్పుడు మీరు మీ వాటా పంచుకొని వెళ్లిపోతే ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది.. దాని బాధ్యత ఎవరు చూసుకుంటారు.. అమూల్య పెళ్లి అయ్యే వరకు అందరూ నోరు మూసుకొని ఉండండి.. దాని పెళ్లి అయిన మరుక్షణం మీరు అడగాల్సిన పని లేదు నేనే దగ్గరుండి మీ వాటాలు మీకు ఇప్పించేస్తాను.. అప్పటి వరకు ఎవరైనా ఆస్తి పంపకాలు గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు.. ఏమయ్యా ప్రసాద్‌రావు గారు విన్నారు కదా.. మా చిన్నమ్మాయి పెళ్లి తర్వాత నేనే పంచేస్తా.. అని అంటుంది. నర్మద తండ్రి దగ్గరకు వెళ్లి ఆస్తి పంచమని చెప్పడం కాదు.. ఇంటికి వచ్చి గొడవ చేశారు అని నేనే కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది.

ప్రసాద్‌రావు సాగర్‌తో నువ్వు ఇళ్లు దాటితే చిల్లిగవ్వ కూడా ఇవ్వరు.. ఆస్తి నీకు పంచి ఇచ్చిన తర్వాతే ఈ గుమ్మం దాటు అని అంటాడు. అప్పటి వరకు నేను ఈ ఇంట్లో ఉండలేను మామయ్య. ప్రతీ ఓనం ఈయనతో మాటలు పడటం నా వల్ల కాదు అని అంటాడు. అయితే ఇదే ఇంట్లో నువ్వు నర్మద వేరు కాపురంగా ఉండండి అని వల్లీ అంటుంది. వేదవతి వల్లీతో నీకు బుద్ధి ఉందా.. వేరు కాపురం పెట్టమని అంటావా అని తిడుతుంది. ఒకే ఇంట్లో ఉంటూ తండ్రీ కొడుకుల్ని వేరు చేస్తావా అని నర్మద అడుగుతుంది. సాగర్ మరిది గారు ఇదే ఊరిలో వేరే ఎక్కడైనా ఇల్లు తీసుకొని అక్కడ ఉంటే రామరాజు గారి రెండో కొడుకు వేరే కాపురం పెట్టాడు అని అందరూ నానా మాటలు అంటారు. అదే ఈ ఇంట్లో అడ్డంగా ఒక గీత గీసి వాళ్ల మామాన వాళ్లని ఉండమని వాళ్లని ఉండమని అంటే ఇంటి గుట్టు బయటకి వెళ్లదు కదా అని అంటుంది. ఏదో ఒకటి చేయండి అని రామరాజు అనేస్తాడు.

ALSO READ: Illu Illalu Pillalu Serial Today may 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆస్తి కోసం తండ్రి మీద చేయి చేసుకున్న సాగర్! చిల్లిగవ్వ కూడా ఇవ్వనని తేల్చేసిన రామరాజు! ఇంటి గుట్టు కోర్టుకి వెళ్తుందా!

వల్లీ ఇంటి మధ్యలో గీత గీస్తుంది. వేదవతి, నర్మద చాలా ఏడుస్తారు. భర్త భుజం మీద వాలి వేదవతి ఏడుస్తుంది. వేదవతి బాధ చూసి అందరూ ఏడుస్తారు. రామరాజు కుటుంబం ముక్కలైపోయినందుకు భద్రావతి, సేనాపతి, విశ్వక్ టపాసులు కాల్చుతారు. రామరాజు ఫ్యామిలీ బయటకు వెళ్తే మనం ముఖాలలో సంతోషం వాళ్లకి కనిపించాలిరా.. చిన్ని కొడుకు కారు కొన్నాడని టపాసులా వెలిగాడు.. ఇప్పుడేంటిరా మాడిపోయిన మతాబులా మాడిపోయింది. ఏరా రామరాజు నట్టింట్లో గీత గీశారంట.. ఇళ్లు రెండు ముక్కలైంది అంట కదా అని నవ్వుతారు. మా విషయాలు మీకు ఎందుకు అని చందు అంటే మీ కుటుంబం మీద పగతో మేం ఉన్నాంరా.. మీ ఇళ్లు రెండు ముక్కలు అయితే పండగ చేసుకోకుండా ఎలా ఉంటాం అని అంటుంది. అక్కా ఈ రామరాజుకి శత్రువులు ఎక్కడో లేరక్కా.. ఏ కొడుకుల్ని చూసుకొని ఎగురుతున్నాడో వాళ్లే గుండెల్లో పొడుస్తున్నారు.. అని సేనాపతి అంటాడు. ఏరా పనోడా ఇల్లు ఇల్లాలు పిల్లలు అని ఎగిరి పడ్డావ్ కదా.. నా కొడుకులే నా ధైర్యం అన్నావ్ కదా.. ఇప్పుడు నీ కొడుకు నీ ఇల్లు, నీ గుండె ముక్కులు చేశాడు కదా.. ఇప్పుడేముందిరా.. నీ మిగతా కొడుకులు నీ గుండెల మీద తన్నకపోతే అలా అడుగు అని అంటుంది. రేయ్ రామరాజు నీ పుట్టిన అనాథ చావు అనాథగా కాదు,.. నీ వెనక నీ వంశం ఉంటుంది అన్నావ్ కదా,, నీ పిల్లలు నిన్ను దిక్కులేనివాళ్లని చేయకపోతే చూడు... నీ బతుకే కాదు నీ చావు కూడా అనాథలా ఉండకపోతే చూడరా అని అంటాడు.

రామరాజు ఏం మాట్లాడకుండా తల దించుకొని ఉంటాడు. ధీరజ్ వాళ్ల మీదకు వెళ్తుంటే వేదవతి వెళ్లి ఆపి.. ఒకప్పుడు ఇలాంటి అన్న అక్క లేరని పొంగిపోయాను.. కానీ ఇప్పుడు ఇలాంటి నీచులు నాకు అక్క, అన్నయ్య అయినందుకు అసహ్యంగా ఉందని అంటుంది. వాడు తీసుకెళ్లింది వస్తువు కాదు.. నాలో సగం అయిన నా చెల్లిని తీసుకెళ్లాడు.. అక్కడితో ఆగాడా.. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా మేనకోడలిని వాడి కొడుకు లేపుకెళ్లిపోయాడు అని అంటుంది. అత్త ఇంకోసారి అలా అంటే ఊరుకోను,, అసలు ఏం జరిగిందో మీకు తెలుసా,, కొంచెం కోపం పక్కన పెట్టి ఆలోచించు అత్త,, మంచి వాళ్లు ఉన్నారు ఇక్కడ.. నిజానిజాలు తెలిస్తే ఏమైపోతారో.. అనిఅంటుంది. వీడు నా చెల్లినితీసుకెళ్లి నా తండ్రి చావుకి కారణం అయ్యాడు.. రేయ్ రామరాజు బొమ్మల కొలువు లాంటి నీ ఇల్లు చెదిరిపోతుంది. ఆ బాధ తట్టుకోవడానికి రెడీగా ఉండు అని అంటుంది. రామరాజు బాధగా సాగర్‌ని చూసి ఇంట్లోకి వెళ్లిపోతాడు. వల్లీ వాళ్లు గదిలోకి వెళ్లి గెంతులేస్తారు.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

పాత్ర

ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగింది

వల్లి

ఇంటి మధ్యలో గీత గీసి వేరు కాపురం పెట్టాలని సిగ్నల్ ఇచ్చింది.

రామరాజు

ఆస్తి పంచకపోవడంతో గొడవలు

వేదవతి

కుటుంబంలో చీలికపై కన్నీళ్లు పెట్టుకుంది.

సాగర్

ఆస్తి వాటా కోసం కోర్టుకెళ్తానని బెదిరించాడు.

నర్మద తండ్రి

కోర్టుకు వెళ్తామని హెచ్చరికలు