Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ అమూల్యని రెడీ చేసి టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అన్నీ మారుతాయ్.. తగిలిన గాయాలు మారుతాయి.. అన్నీ చీల్చుకొని ముందుకు వెళ్తేనే జీవితం కొత్తగా ఉంటుంది అని చెప్తుంది. అమూల్య ప్రేమని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. ధీరజ్ వచ్చి ఏంటి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తను చెప్తుందా అంటే అమూల్య అది కాదు అన్నయ్య అని అంటే వద్దు ఏం చెప్పకు అని అంటాడు.

ప్రేమ ధీరజ్‌తో నేనేం తప్పు చేయలేదురా.. నాకేం తెలీదు నమ్మరా మొగుడా అంటే నీ చెవికి ఎక్కదా.. నమ్మరా ప్లీజ్ నమ్ము అని అంటుంది. నేనేం నమ్మను అని వెళ్తూ ఉంటే షర్ట్ డోర్‌కి ఇరుక్కుంటుంది. ధీరజ్ ప్రేమే అనుకొని వదలవే అంటాడు.. ప్రేమ చూసి నేను వదలను అంటుంది. వదలవే అంటే నన్ను బతిమాలితే వదులుతా అంటుంది. వెనక్కి తిరిగి చూడరా అంటే చూడను అని షర్ట్ గట్టిగా లాగితే షర్ట్ చిరిగిపోతుంది. అవతల వాళ్లకి చెప్పే ఛాన్స్ ఇవ్వకపోతే ఇలా విరిగిపోతుంది మనసు అని అంటుంది. నువ్వు ఎప్పుడో నా మనసు విరిచేశావని ధీరజ్ అంటాడు. ఇక ధీరజ్ అమూల్యని కాలేజ్‌లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు.

శ్రీవల్లి పుట్టింటిలో పడుకొని ఉంటే.. భాగ్యం చూసి నా కూతురికి అత్తారింట్లో ఎన్ని కష్టాలు పెడుతున్నారో.. కనీసం నిద్రకు కూడా పోనివ్వట్లేదు అందుకే ఇలా టైం కాని టైంలో గురక పెట్టి నిద్రపోతుంది అని భాగ్యం లేపుతుంది. ఎందుకమ్మా నిద్ర లేపుతున్నావ్ అంటే స్కూల్ అయిపోయే టైం అయిపోయింది. మీ ఆయన నిన్ను తీసుకెళ్లడానికి స్కూల్ దగ్గరకు వెళ్తారు అని అంటుంది. అమ్మా ఇల్లు అనకే నాకు భయం వేస్తుంది. ఆ ఇద్దరూ నరకంలో లేని శిక్షలు కూడా నాకోసం డిజైన్ చేస్తున్నారు నా వల్ల కాదు.. మా ఆయనకు కాల్ చేసి ఈ పూటకి ఇక్కడే ఉంటాను అని ఏదో ఒక మ్యానేజింగ్ చేయ్ అని అంటుంది. ఇంతలో నర్మద, ప్రేమ కలిసి శ్రీవల్లికి కాల్ చేస్తారు. బల్లిఅక్కాయ్ ఏం చేస్తుంది అని ఇద్దరూ ఒకే సారి అడుగుతారు. మీ కచేరితో నా ఒళ్లు హూనం అయిపోయింది కూసంత రెస్ట్ తీసుకుంటున్నా అని అంటుంది. అయితే మరి రోడ్డు మీద ఎలా పరుగులు పెడుతుంది మా బల్లి అక్కాయ్ అని అంటారు. ఎందుకు అని వల్లీ అడిగితే నీ అందమైన వాయిస్ మీ ఆయనకు పంపేశాం కదా అంటారు. దాంతో శ్రీవల్లి చాలా కంగారు పడుతుంది. వెంటనే లేచి పరుగుకి రెడీ అయిపోతుంది.

చందు కాల్ చేయడంతో వాయిస్ వినేసుంటాడా అని పరుగులు పెడుతుంది. పరుగులు పెడుతూ స్కూల్ బయట ఉన్న చందు దగ్గరకు వెళ్తుంది. ప్రేమ వాయిస్ మెసేజ్ పెట్టింది అని చందు అంటే నేను వింటా అని శ్రీవల్లి ఫోన్ లాక్కోవాలని చూస్తుంది. చందు వద్దని ఫోన్ లాక్కుంటాడు. ఇద్దరం కలిసి విందామని అంటాడు. ప్రేమ వాయిస్లో వల్లీ అక్కని త్వరగా పిక్ చేసుకొని ఇంటికి తీసుకురండి.. పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి అలిసిపోయింటుందని అంటుంది. ఇద్దరూ నన్ను వెర్రిదాన్ని చేసి వాయించేశారన్నమాట అని శ్రీవల్లి అనుకుంటుంది.

ప్రేమ, నర్మదలు ఇంటి దగ్గర ఓ తాడుని చెరోవైపు పట్టుకొని లాక్కొని టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటారు. వల్లీ వచ్చిందా లేదా అని చూస్తూ ఉంటారు. ఇంతలో వల్లీ వస్తుంది. నర్మద అటు చూస్తుండగా ప్రేమ నర్మదని లాగేస్తుంది. ప్రేమ గెలిచేస్తుంది. దాంతో నేనే గెలిచాను..నైట్ బల్లి అక్కని ఆడుకునే ఛాన్స్ నాదే అని గెంతులేస్తుంది. ఇద్దరూ ఇలా తాడుతో బలప్రయోగం చేస్తున్నారు నా ముఖానికి వేసి లాగేస్తారా ఏంటి అని అనుకుంటారు. ఇద్దరూ వల్లీని పిలుస్తారు. స్కూల్ ఎలా ఉంది.. బెంచీలు ఎలా ఉన్నాయి.. అని ప్రేమ అడిగితే తన ముఖం చూస్తే అర్థం కావడం లేదా ఫుల్లుగా పడుకొని వచ్చింది అని అంటుంది. మీరు నన్ను ఉంచడం లేదు కదా అని వల్లీ అంటే నిన్నే అంటుంది అని నర్మద ప్రేమని అంటుంది. దాంతో ప్రేమ నేను హర్ట్ అయ్యాను వెళ్లిచెప్పేస్తా అని ప్రేమ అంటే.. వద్దు అని శ్రీవల్లి బతిమాలుతుంది. తర్వాత నర్మద కూడా నన్ను అన్నావా నేను చెప్పేస్తా అని అంటుంది. దాంతో వల్లీ నర్మదని బతిమాలుతుంది. ఇక ఇద్దరూ శ్రీరామనవమికి ఇంట్లో చెప్పేస్తాం అని ఈ రోజు రాత్రి కచేరి ఉంది రెడీ అయిపో అని చెప్తారు. వెళ్తూ వెళ్తూ ఈ సారి మేం విలన్స్ అని చెప్పి వెళ్లిపోతారు.

ప్రేమ బాత్‌రూం స్నానానికి వేడి నీరు పెట్టుకుంటుంది. ప్రేమ సున్నిపిండి కోసం వచ్చేలోపు ధీరజ్ వెళ్లిపోతాడు. ధీరజ్ ఉన్నాడు అని తెలీక ప్రేమ కూడా వెళ్లిపోతుంది. అప్పుడే ఆయిల్ కింద పడిపోతుంది. నేను పెట్టుకున్న వేడినీరుతో ఎందుకు స్నానం చేశావ్‌రా అని ప్రేమ అడుగుతుంది. అందుకే అవి మండిపోతున్నాయ్ అప్పుడే అనుకున్నా నీ నీరు అని అంటాడు. ఇక ధీరజ్ బయటకు వెళ్లబోతూ ఆయిల్ వల్ల పడిపోతాడు.ప్రేమ పట్టుకుంటుంది. నన్ను అంత సేపు పట్టుకున్నావ్ అంటే నేను అంటే నీకు ఎంత ఇష్టమో అని ప్రేమ అంటుంది. ధీరజ్ తన బట్టలు తీసుకోవాలని ప్రేమవి తీసుకుంటాడు. ఇక ప్రేమ వచ్చి నా కళ్లలోకి చూసి నా బట్టలు తీసుకున్నావ్ అని అంటాడు. అప్పుడే ధీరజ్ టవల్ జారిపోతే ప్రేమ నవ్వి వెటకారం చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.