Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జులై 2న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వల్లీ వాళ్ల అమ్మే అలా చెప్పమంది..

నర్మద డాక్టర్‌ని నిలదీయడంతో డాక్టర్ బిత్తరపోతుంది. ప్రెగ్నెంట్ కానీ వల్లీ ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పారు.. ఈ రిపోర్ట్స్ ఎందుకు ఇచ్చారు చెప్పండి అని అంటుంది. దానికి డాక్టర్ నేనేం రిపోర్ట్స్ ఇవ్వలేదు మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అని అంటుంది. సరే వెళ్తా.. ముందు పోలీస్ స్టేషన్‌కి తర్వాత డీఎమ్‌హెచ్‌ఓ దగ్గరకు వెళ్తా.. తర్వాత మీరు జైలుకి వెళ్తారు.. చెప్తారా లేదా అని నర్మద అడుగుతుంది. దాంతో డాక్టర్ వల్లీ వాళ్ల అమ్మ వల్లీ కాపురం నిలబెట్టమని బతిమాలారు అందుకే వల్లీ ప్రెగ్నెంట్‌ అని చెప్పా.. వల్లీ కూడా కాళ్ల వేళ్లా పట్టుకొని బతిమాలడంతో రిపోర్ట్స్ ఇచ్చా అని అంటుంది. మీరు ఇచ్చిన రిపోర్ట్స్ వల్ల వల్లీ ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది.. తనకు అబార్షన్ అయిందని నా మీద నింద వేసింది.. రండి మా ఇంటికి వచ్చి విషయం చెప్పండి అని నర్మద కోప్పడుతుంది. సాటి ఆడదానిలా తన కాపురం నిలబెట్టడానికి అలా చెప్పాను.. ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు.. అంత పెద్ద మోసం చేసిన డాక్టర్‌ని వదిలేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని నర్మద అంటుంది. ఆ డాక్టర్‌ని జుట్టు పట్టుకొని లాక్కొస్తా అని నర్మద అంటుంది.

ALSO READ: Nindu Manasulu Serial Today July 1st: నిండు మనసులు: సాహితితో తనకి రిసెప్షన్ కావాలని గొడవ చేసిన గణ! సిద్ధూ ఏం చేస్తాడు?

నేనే దిక్కు బేబీ..

డ్యాన్స్ పోటీ ఉందని లంగావోణి కట్టుకొని ప్రేమ రెడీ అయిపోతుంది. పక్కనే ధీరజ్ ఉంటే బాగుండేదని అనుకుంటుంది. ఇంతలో రాజపుష్పం ప్రేమ గది డోర్ కొడతాడు. ప్రేమ వెళ్లి డోర్ తీస్తుంది. సార్ డాన్స్ పోటీ మొదలైందా అని ప్రేమ అడిగితే మొదలెడదాం.. ముందు రిహార్సల్స్ చేద్దాం అని ప్రేమ మీదకు వెళ్తాడు. తిక్క తిక్కగా మాట్లాడితే చంపేస్తా అని ప్రేమ లాగి పెట్టి కొడుతుంది. నిన్ను వదలను అని రాజపుష్పం ప్రేమ మీదకు వెళ్తాడు నాలో రొమాంటిక్ కింగే కాదు.. రాక్షసుడు కూడా ఉన్నాడు.. ఎదురు తిరిగితే వదలను అని ప్రేమ చేయి పట్టుకొని ఇబ్బంది పెడతాడు. దాంతో ప్రేమ రాజపుష్పాన్ని నెట్టేసి డోర్ లాక్ చేస్తుంది. రాజపుష్పం బయట నుంచి లాక్ వేసేస్తాడు. నువ్వు బయటకు వెళ్లాలి అన్నా.. డ్యాన్స్ కాంపిటేషన్ గెలిచి 10 లక్షలు తీసుకెళ్లాలి అన్నా ఒకటే దిక్కు ఆలోచించుకో అని అంటాడు.

ప్రేమ ఎక్కడ నిజం చెప్పు..

ధీరజ్ ఫుడ్ డెలవరీ కోసం ఓ చోటుకి వెళ్తాడు. ఆ ఇంట్లో ప్రేమ ఫ్రెండ్‌ని చూసి షాక్ అయిపోతాడు. తన తల్లికి బాలేదు అని సిటీలో హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి తోడుగా ప్రేమని తీసుకెళ్తా అని అన్నావ్ కదా మరి ప్రేమ ఎక్కడ అని అడుగుతాడు. ఇప్పుడు బయల్దేరుతున్నా అని ఆమె అంటే హార్ట్‌అటాక్ పేషెంట్‌ని ఇంత లేటుగా తీసుకెళ్తారా.. విషయం మీ అమ్మకి బాలేకపోవడం కాదు.. ఇంకేదో ఉంది.. నువ్వు దాస్తున్నావు అని నాకు అర్థమైంది.. విషయం ఏంటి.. ప్రేమ ఎక్కడ.. నువ్వు ఇక్కడే ఉంటే ప్రేమ కూడా ఉండాలి కదా.. ప్రేమ ఎక్కడ పిలు అని అంటాడు. సారీ ధీరజ్ ప్రేమ డ్యాన్స్ కాంపిటీషన్‌కి వెళ్లింది అని ఆమె చెప్పేస్తుంది. ధీరజ్ షాక్ అయిపోతాడు. చెప్తానుండు దాని సంగతి అని ధీరజ్ కాల్ చేస్తాడు.

నీ సంగతి చెప్తా ఆగవే..

ప్రేమ ఫోన్ రాజపుష్పం దగ్గర ఉంటుంది. రాజపుష్పం ఫోన్ లిఫ్ట్ చేసి మ్యూట్‌లో పెట్టి ధీరజ్ మాటలు వినిపిస్తాడు. ధీరజ్ కోపంగా ప్రేమని తిడతాడు. నీకు తెలివి తేటలు ఎక్కువ అయిపోయావే నీ కాళ్లు విరగ్గొడతా చూడు అని అంటాడు. ప్రేమ కూడా అన్‌మ్యూట్ చేయమని బతిమాలుతుంది. ధీరజ్ కోపంతో కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇంట్లో అబద్ధం చెప్పి నా కోసం వచ్చావా అని రాజపుష్పం అంటాడు. మా ఆయనకు కారు కొనివ్వాలి అని ఈ పోటీలకు వచ్చాను నన్ను వదిలేయండి అని ప్రేమ బతిమాలుతుంది. నీ అందం నా సొంతం అయితే డబ్బు నీకే ఇస్తా అని రాజపుష్పం అంటాడు. ప్రేమ చాలా ఏడుస్తుంది.

ALSO READ: Godavari Serial Today July 1st: 'గోదావరి' సీరియల్: అప్పు కోసం వెళ్తే జానుకి ఘోర అవమానం! సింహాద్రి కుట్ర మామూలుగా లేదుగా!

సాక్ష్యాలతో నిరూపిస్తా..

నర్మద కోపంగా వల్లీ సంగతి చెప్తా అని వల్లీ వల్లీ అని అరుస్తుంది. పెద్దలకు మర్యాద ఇవ్వాలి అని తెలీదా అని వేదవతి నర్మదని తిడుతుంది. అలాంటి వాళ్లకి మర్యాద అవసరం లేదు.. ఇప్పుడు ఆ డాక్టర్‌ దగ్గర నుంచే వస్తున్నా.. వల్లీ కడుపు అబద్ధం అంట.. వాళ్ల తల్లి అలా చెప్పమని కాళ్లా వేళ్లా పడితే వల్లీ ప్రెగ్నెంట్ అని చెప్పిందని నర్మద అంటుంది. ఏంటే వల్లీని తప్పు పట్టడానికి అబద్ధాలు చెప్తున్నావా.. నువ్వు మారవా.. తన కడుపు పోగొట్టిన వల్లీ నిన్ను క్షమించింది.. కదా ఇంకా దాని మీద ఎందుకు నిందలు వేస్తున్నావ్.. అని వేదవతి అడుగుతుంది. మీరు నేను ఏం చెప్పినా వినరు అని అర్థమైంది అత్తయ్యా మీకు అన్నీ ఆధారాలతో నిరూపిస్తా అని నర్మద అంటుంది. నిరూపించు అప్పుడు నేనే దాన్ని మెడ పట్టుకొని గెంటేస్తా అని వేదవతి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.