Illu Illalu Pillalu Serial Today Episode నర్మద కోసం సాగర్ మల్లెపూలు తీసుకొని వచ్చి రొమాన్స్ చేసి మల్లెపూలు పెడతాడు. తర్వాత వేదవతి దేవుడికి దండం పెట్టుకుంటూ ఏ ఆటంకం లేకుండా నిశ్చితార్థం జరగాలి అని కోరుకుంటుంది. ఇంతలో దేవుడి దగ్గర దీపం ఆరిపోవడంతో వేదవతి చాలా టెన్షన్ పడుతుంది.

కామాక్షి బయట అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఏమైందని తిరుపతి అడిగితే మా ఆయన కోసం ఎదురు చూస్తున్నా అని అంటుంది. ఇంతలో కామాక్షి భర్త రావడంతో నేను చెప్పిన సూట్‌కేస్ తెచ్చారా అని తెగ హడావుడి చేస్తుంది. ఆయన చిన్న సూట్‌కేస్ తేవడంతో పెద్ద సూట్‌ కేస్ తీసుకురాలేదని గోల గోల చేస్తుంది. తిరుపతి చూసి ఇంత పెద్ద సూట్‌కేస్ ఏంటి అని అంటే ఇది పెద్దదా చాలా చిన్న సూట్ కేస్ అయినా ఇందులో మా ఆయన బట్టలు ఉన్నాయి అని అంటుంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడానికి ఇన్ని బట్టలు ఎందుకు అని తిరుపతి సూట్‌కేస్ పట్టుకొని ఖాళీ సూట్‌కేసా అర్థమైందిలే ఇక్కడ నుంచి సరుకులు రవాణా అవుతాయి అని అంటాడు.

సాగర్, తిరుపతి కార్పెట్స్ వేస్తూ ఉంటారు. నర్మద గుమ్మానికి పువ్వులు పెడుతూ ఉంటే సాగర్ అక్కడే అతుక్కుపోతాడు. ఇక కాస్త దూరంలో కామాక్షి ఇంట్లో అందంగా కనిపించే వస్తువులు తీసి జాగ్రత్తగా సంచిలో సర్దడం తిరుపతి చూసి మా బావ కాబట్టి భరిస్తున్నాడు ఇంకెవరైనా అయినా అయిపోయేవాళ్లు అనుకుంటారు. మరోవైపు రామరాజు ఫ్యామిలీ మొత్తం నిశ్చితార్థం వాళ్ల కోసం ఎదరు చూస్తూ ఉంటారు. భాగ్యం, వల్లీ, ఇడ్లీ బాబాయ్ మాత్రం విశ్వ, అమూల్యల ఫొటోలు అడ్డు పెట్టుకొని నిశ్చితార్థం ఆపాలి అనుకుంటారు. అందుకు ప్లాన్ కూడా చెప్పుకుంటారు.

రామరాజు వియ్యపువాళ్లు వస్తారు. రామరాజు కుటుంబంతో వచ్చి మర్యాద చేసి లోపలికి తీసుకెళ్తాడు. వేదవతి మాత్రం బయటే ఉండి.. మేడ మీద నుంచి చూస్తున్న భద్రావతిని చూస్తుంది. భద్రావతి నవ్వి చేతిలో కాఫీ కప్పు పడేస్తుంది. అక్క ఇలా చేస్తుంది ఏంటి.. ఒకవేళ ఈ నిశ్చితార్థం ఆపడానికి ఏమైనా చేస్తున్నారా అని అనుకుంటుంది. వేదవతిని పిలవడానికి నర్మద, ప్రేమ వెళ్తారు. ఇక రామరాజు వల్లీ పేరెంట్స్‌ని పరిచయం చేస్తారు. ఇడ్లీబాబయ్ పైన కుర్తీ మాత్రమే వేస్తే ఇలా ఏంటి అని అడుగుతారు. దానికి తిరుపతి డ్రస్ పాడు చేయడంతో మా బావగారి డ్రస్‌తో మ్యానేజ్ చేస్తున్నా అని అంటాడు. అందరూ నవ్వుకుంటారు.

వేదవతి టెన్షన్‌గా ఉంటే నర్మద, ప్రేమ అక్కడికి వెళ్తారు. ఏమైంది ఎందుకు అంత టెన్షన్‌గా ఆలోచిస్తున్నారు ఏమైందని అడుగుతారు. ఈ నిశ్చితార్థం జరుగుతుందో లేదో అని భయంగా ఉంది.. వాళ్ల దగ్గర నిజం దాచాం కాదా.. దాని వల్ల నీ కూతురి జీవితం ఏమవుతుందా అని భయంగా ఉందని అంటుంది. భయపుతున్నట్లు ఏం జరగదు అని ప్రేమ, నర్మద అత్తకి ధైర్యం చెప్తారు. కూతురి జీవితం కోసం ఆరాట పడుతున్న తల్లి ప్రేమ గెలుస్తుంది ఇంకేం ఆలోచించకండి సంతోషంగా లోపలికి పదండి అని చెప్తారు. రామరాజు తన కొడుకుల్ని కోడల్ని పరిచయం చేస్తారు. ప్రేమని పరిచయం చేయడానికి ప్రేమ అక్కడ లేకపోవడంతో ధీరజ్ ప్రేమని పిలుస్తాడు. ప్రేమ ధీరజ్ మీద అలిగి కూర్చొని ఉంటుంది. ధీరజ్ పక్క పక్కకే వెళ్లినా మాట్లాడదు.. ధీరజ్ ప్రేమని బతిమాలుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.