Illu Illalu Pillalu Serial Today Episode : తిరుపతి ప్రేమ నగలు తీసుకొచ్చి రామరాజుకు ఇవ్వడంతో ఆయనతోపాటు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. అందరూ ఈ నగలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తారు. తిరుపతి పిచ్చిపిచ్చి సమాధానాలు ఇస్తుండటంతో రామరాజు గూబ పగులగొడతాడు. నగులు తిరిగొచ్చాయని ఆనందించాలి తప్ప ఆరాలు తీయకూడదంటాడు. నగలు గురించి అంత పెద్దగొడవ జరుగుతుంటే అందరూ తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు...ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడ నుంచి వచ్చాయని నిలదీస్తాడు. దీంతో శ్రీవల్లి చెప్పిన స్టోరీయే తిరుపతి రామరాజుకు చెప్తాడు. ప్రేమకు ఈ నగలు దూరం కాకూడదన్న ఉద్దేశంతో తానే ఈ నగలు దాచిపెట్టి గిల్ట్ నగలు వారికి ఇచ్చానని చెబుతాడు. దీంతో మరోసారి రామరాజు తిరుపతి చెంప పగులగొడతాడు. శ్రీవల్లి చేసిన పనికి తిరుపతి బాబాయి దెబ్బలు తింటున్నా గానీ శ్రీవల్లి అలాగే చూస్తూ ఉండటం చూసి ప్రేమకు కోపం వస్తుంది. ఇంతలో రామరాజు మరింత కోపంతో తిరుపతిపై రెచ్చిపోతాడు.మీ వాళ్లంతా నన్ను ఏవిధంగా అవమానించాలా అని కాచుకుని కూర్చుంటే...ఇలాంటి సమయంలో నువ్వు చేసే పని ఇదా అంటూ మండిపడతాడు. నువ్వు చేసిన పని వల్ల మీ వాళ్ల నున్నఎంతలా అవమానించారో చూశావ్ కదా...ఇప్పుడు నువ్వు ఈనగలు తీసుుకురాకుంటే మీ వాళ్లు అన్నట్లు మేం నిజంగానే నన్ను మరోసారి పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కించేవారు కదా అంటాడు.
గొడవ పెద్దది అవుతుండటంతో మధ్యలో కల్పించుకున్న శ్రీవల్లి రామరాజును కూల్ చేస్తుంది. ప్రేమ కోసమే ఇదంతా చేశానని చెబుతున్నాడు కాబట్టి క్షమించి వదిలేయాలని కోరుతుంది. అటు బుజ్జమ్మ కూడా చెప్పడంతో రామరాజు కొంచెం మెత్తబడతాడు. అయినా మా వాళ్లు మనల్ని అవమానించడానికి ఇదే కావాలా ఏంటి..? ముందు వాళ్ల నగలు వాళ్ల ముఖాన కొట్టండంటూ బుజ్జమ్మ చెప్పడంతో రామరాజు సరేనంటాడు. నాకు చెప్పిన విషయాలన్నీ వాళ్లకు చెప్పి ఈ నగలు నువ్వే వాళ్లకు ఇవ్వు అంటూ తిరుపతిని పంపిస్తాడు. నగలన్నీ తీసుకుని తిరుపతి వాళ్ల ఇంటికి తీసుకెళ్లి ఇస్తాడు. ఇప్పటి వరకు మాకు తెలియదని అన్నారుకదా...ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయని వాళ్లు ప్రశ్నిస్తారు. అక్కడ కూడా తిరుపతి పిచ్చిపిచ్చిగా మాట్లాడటంతో వాళ్లు కూడా చెంప పగులగొడతారు. అప్పుడు నగలు ఎక్కడ ఉన్నయో తెలియదని ఇప్పుడు పంపిస్తే వెంటనే తీసుకుంటామని ఎలా అనుకుంటారని నిలదీస్తారు. చాలా తెలివిగా నగలు కొట్టేసి గిల్ట్ నగలు పంపించారు.ఇప్పుడు పోలీసులకు పట్టిస్తామని బెదిరించడంతో భయపడి నగలు తీసుకొచ్చారా అంటూ ప్రియా తల్లిదండ్రులు రామరాజును నిలదీస్తారు. దీంతో రామరాజు తిరుపతిపై మండిపడతాడు.నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో వాళ్లకు చెప్పు అంటాడు. దీంతో జరిగిందంతా తిరుపతి వాళ్లకు చెబుతాడు. దీంతో రామరాజు మరింత రెచ్చిపోతాడు. ఇప్పుడు నిజం తెలిసింది కదా అంటాడు. నగలు గురించి నాకు తెలియదని చెప్పినా....నేనే ఆ నగలు కొట్టేశానంటూ అబంఢాలు వేశారని మండిపడతాడు. దీంతో ప్రియా అత్త ఆ నగలు రోడ్డుపై విసిరేస్తుంది. నగలు దాచిపెట్టి ఇప్పుడు కట్టుకథలు అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నగలు గురించి రామరాజు బావకు ఏ పాపం తెలియదని తిరుపతి అనగానే...తమ్ముడి చెంప పగులుగొడుతుంది. మన ఇంటికి నమ్మకద్రోహం చేసి నాన్న ప్రాణాలు పోవడానికి కారణమైన వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావని మండిపడుతుంది. నీ కారణంగానే నా చెల్లెలు దూరమైందని.. నీ కొడుకు కారణంగా నా మేనకోడలు దూరమైందని...వాళ్లు దూరమైతేనే లెక్కచేయలేదని ఈ నగలు ఒక లెక్కా నాకు అంటుంది. ముష్టి వేస్తున్నాను తీసుకోండంటూ వాళ్లు అక్కడి నుంచి ఇంటిలోపలికి వెళ్లిపోతారు. ఇంతంలో ప్రియా తల్లి అక్కడికి వచ్చి ఆ నగలన్నీ ఏరి ప్రియా చేతికి ఇస్తుంది. ఈ నగలు నీవేనని అవి నీదగ్గరే ఉండనివ్వమని చెబుతుంది. ఈ నగల గురించి ఇన్ని గొడవలు జరిగిన తర్వాత కూడా ఇంకా నా దగ్గర ఉంచమంటావా అని అడుగుతుంది.
ఇవి మీ నాయనమ్మ నగలు...వారసత్వంగా నీకే చెందాలని చెబుతుంది. వీటిపై హక్కు నీపుట్టింటి వాళ్లకు గానీ, నీ అత్తింటి వాళ్లకుగానీ లేదని చెప్పి వెళ్లిపోతుంది.

అందరూ లోపలకి వెళ్దాం పదండి అని తిరుపతి అనగా...రామరాజు అతన్ని బయటకు గెంటేస్తాడు.ఇదంతా నీవల్లే జరిగిందని...మరోసారి నా ఇంటి గుమ్మం తొక్కొద్దని గట్టిగా హెచ్చరిస్తాడు. ఇక నువ్వు మామూలుగా కూడా ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటాడు.
నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి శ్రీవల్లిని తిడతారు. నీవల్లే ఇవాళ తిరుపతి బాబాయి ఇంటికి దూరమయ్యాడని మండిపడతారు. ప్రేమ నగలు కొట్టేసింది నువ్వేనని తెలిసినా కూడా వదిలేశామని చెబుతారు. ఇప్పటికైనా మారతావని క్షమించి వదిలేశామని...ఇక నుంచైనా మారి ఇంటి విషయాల్లోగానీ, మా విషయాల్లో గానీ జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తారు....