Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(ఆగస్టు 30న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాడి మీద నిందలు వేస్తే చంపేస్తా..

సుకన్యకి తిరుపతి 6 లక్షల ఖరీదైన గోల్డ్ చైన్ ఇచ్చాడని వేదవతికి తెలిసేలా వల్లీ మాట్లాడుతుంది. వేదవతి వెళ్లి నా తమ్ముడు నీకు చైన్ ఇవ్వడం ఏంటే.. చంపేస్తా వాడి మీద నిందలు వేస్తే అని వేదవతి అంటే నిజమే కావాలి అంటే మీ తమ్ముడికి అడగండి అని సుకన్య అంటుంది. అంతా మీ వల్లేనే ఎక్కడ దొరికారే మీరు మాకు.. ఈ విషయం నేను తేల్చుతా.. అంత వరకు ఎవరికీ ఈ విషయం చెప్పకు అని వేదవతి వల్లీని తిడుతుంది. వల్లీ మాత్రం నా మొగుడికి 6 లక్షల గురించి తల పట్టుకున్నాడు.. ఈవిడ ఈ విషయం చెప్పొద్దు అంటున్నారు కాసేపట్లో పెద్ద గొడవ అవుతుంది అని అనుకొని డ్యాన్స్ వేస్తాడు.

అన్న వదినతో వచ్చాడు..

విశ్వక్ అమూల్యని తీసుకొని కేఫ్‌కి వస్తాడు. విశ్వక్ ఫ్రెండ్స్ వచ్చి అన్న వదినను తీసుకొచ్చాడు అని అంటారు. కేఫ్ మొత్తం నిండిపోవడంతో వేరే చోటుకి వెళ్దాం అని విశ్వక్ అంటే ఇప్పుడు అందరూ వెళ్లిపోతారు అని ఓ ఫ్రెండ్ ఫోన్ తీసి అంకుల్ మీ అమ్మాయి ఇక్కడ ఎవరితోనో ఉంది అనగానే అందరూ పారిపోతారు. మీ ఫ్రెండ్స్ నన్ను వదిన అంటున్నారేంటి అని అమూల్య అంటుంది. ఇక అమూల్య, విశ్వక్ మాత్రమే కేఫ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రేమ, ధీరజ్‌ని కలపడానికి ప్లాన్స్ ఏంటి అని అమూల్య అడుగుతుంది. మీ ఇంట్లో వాళ్లని ఎవరినైనా అరటి తొక్క మీద కాలు వేసి పడేలా చేద్దాం అని అంటే తొక్కలా ఉంది నీ ఐడియా అని అమూల్య అంటుంది. తర్వాత ఇద్దరూ ఐస్‌క్రీమ్ తింటారు.

6 లక్షలు పోయావి..

చందు, తిరుపతి రామరాజుని తీసుకొని ఇంటికి వస్తారు. మామయ్యగారు ఊరినుంచి ఇదే రావడమా అని వల్లీ మామ కాళ్లు పట్టుకుంటుంది. వేదవతి రామరాజుతో ఎంత మాట్లాడినా రామరాజు కోపంగా ఉంటాడు. వేదవతి చేయి పట్టుకుంటే తోసేస్తాడు. ఏమైందిరా ఎందుకు ఆయన అంత కోపంగా ఉన్నారు అని వేదవతి చందు, తిరుపతిలను అడుగుతుంది. దాంతో తిరుపతి రైస్‌మిల్లులో 6 లక్షలు కనిపించడం లేదు అని అంటాడు. వేదవతి షాక్ అయిపోతుంది. ఏంటి తెలిసిపోయిందా అని వల్లీ అంటుంది. ఏంటమ్మా అని రామరాజు అడిగితే మీ అబ్బాయి మొన్న చెప్పారు లెక్కల్లో తేడా వచ్చిందని అంటుంది. చందు వల్లీని అక్కడి నుంచి వెళ్లిపోమని అంటే కోడల్ని అంటావేంట్రా మీరు సరిగ్గా ఉంటే ఇదంతా రాదు కదా అని రామరాజు చందుని తిడతాడు. డబ్బులు ఎలా పోతున్నాయో నీకు తెలీదారా అని రామరాజు వేదవతిని అడిగితే నాకు తెలీదు బావ అని తిరుపతి అంటే నీకు తెలీకపోవడం ఏంట్రా.. ఆ డబ్బుతో ఎవరికైనా ఏమైనా కొన్నావేమో అని వేదవతి తిరుపతిని అంటుంది.

అక్కా నేను దొంగతనం చేస్తానా..

వేదవతి మాటలకు తిరుపతి ఏంటి అక్కా అలా అంటున్నావ్.. వాళ్లు డబ్బు ఇస్తే నేను తీసుకొచ్చి బావకో అల్లుడికో ఇస్తాను. మరి నేను ఎవరికో ఏదో ఇచ్చా అంటావేంటి ఆ మాట ఎలా అనగలిగావు అక్క అని తిరుపతి అంటాడు. అవును అమ్మా అని చందు కూడా అంటాడు. కానీ వేదవతి మాత్రం లేదురా వీడికి తెలుసు అని షాప్‌ డబ్బుతోనే సుకన్యకి 6 లక్షల రూపాయల చైన్ కొన్నాడు అనేలా మాట్లాడుతుంది. ఏంటి అక్క నా మీద దొంగ అని ముద్ర వేస్తున్నావా అని తిరుపతి అంటాడు. రేయ్ నేను ఎందుకు అలా అంటానురా.. ఇది నీ ఇల్లురా నీకు ఎంత కావాలి అంటే అంత స్వతంత్రంగా తీసుకునే హక్కు నీకు ఉంది అని వేదవతి అంటుంది. తిరుపతి ఏం మాట్లాడకుండా ఏడుస్తాడు. రేయ్ నువ్వు తీసుకుంటే చెప్పరా మేం ఎవరూ ఏం అనుకోం అని రామరాజు కూడా అంటాడు. ఆ మాటలకు తిరుపతి చిన్న పిల్లాడిలా చాలా ఏడుస్తాడు. అక్క తనని అలా అనుమానించినందుకు తిరుపతి చాలా ఏడుస్తూ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. ఇక మరోవైపు అమూల్య, విశ్వక్ ఉన్న కేఫ్ దగ్గరకు నర్మద, ప్రేమ, ధీరజ్‌లు వస్తారు. వాళ్లని చూసి అమూల్య వాళ్లు దాక్కుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.