Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమకి ధీరజ్ టిఫెన్ తినిపిస్తే థ్యాంక్స్ బావ అని అంటుంది. ధీరజ్ మొత్తం చూస్తే నిన్నేరా సచ్చినోడా..నువ్వు నాకు మేనబావవిరా అని అంటుంది. ఇంతలో ప్రేమ పొలమారుతుంటే ధీరజ్ కంగారుగా నీరు తాగిస్తాడు. నువ్వు ఇంత ప్రేమ చూపిస్తే పొలమారడం ఏంట్రా ప్రాణం పోయినా తిరిగి వస్తుందని అంటుంది. అప్పుడే ప్రేమ అమ్మ, నానమ్మ వస్తారు. ప్రేమ నానమ్మ చప్పట్లు కొడుతూ ఇదే ప్రేమతో నిండు నూరేళ్లు ఉండండిరా అని ధీరజ్ భుజం తడుగుతుంది.

రేవతి ప్రేమని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. రేయ్ చిన్న మనవడా నువ్వు అసలే కోతి లాంటి వాడివి నా మనవరాలిని ఎలా చూసుకుంటావో అని అనుకున్నా కానీ జాగ్రత్తగా చూసుకుంటావ్‌రా అంటుంది. నువ్వేంటి అమ్మమ్మ నీ భద్రకాళి భద్రావతి ఉండగా ఇలా వచ్చావ్ అని అంటాడు. నేను అంటే నా పెద్ద కూతురు గజగజ వణికిపోతుంది అంటుంది. అవునా ఇదే మాట అక్కడున్న మీ పెద్ద కూతురికి చెప్పు అమ్మమ్మా అని ధీరజ్ అంటే ఏంట్రా భద్రావతి వచ్చిందా అని ధీరజ్ అమ్మమ్మ అలా ఉండిపోతుంది. దాంతో ధీరజ్ పెద్దగా నవ్వుతాడు. ఇంతలో తిరుపతి రామరాజు వస్తారు. అమ్మా, వదిన మీరు ఇలా వచ్చారేంటి.. కొంపతీసి రెండు కుటుంబాలు కలిశాయా ఏంటి అని అంటాడు. నా ప్రాణం పోయే లోపు అది జరిగితే చూడాలి అని ఉందిరా అని తిరుపతి తల్లి అంటుంది.

రేవతి వాళ్లు బయల్దేరుతుంటే కాసేపు ఉండమని రామరాజు చెప్తాడు. నా కూతురిని చూడటానికి దొంగతనంగా రావాల్సిన ఖర్మ పట్టింది అన్నయ్య,,ఈ ఇంట్లో ఉన్నంత మంచి మనసులు అక్కడ లేవు.. అదే ఉండుంటే ఈ పాతికేళ్లు మనం ఇలా ఎందుకు గొడవలు పడతాం.. ప్రతి రోజు పండగే అయ్యేది అని రేవతి అంటుంది. దానికి రామరాజు కాలమే అందర్ని మార్చేస్తుందిలే అని ధైర్యం చెప్తాడు. తర్వాత రేవతి వాళ్లు చెప్పేసి వెళ్లిపోతారు. బామ్మ ప్రేమ, ధీరజ్‌ల చేయి కలిపి త్వరగా పాపనో బాబునో కని ఈ ఆనందం ఇంకా పెంచండి అని అంటుంది.

తిరుపతి, తల్లి, వదినను ఆ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. మీ అన్నయ్య కానీ మీ అక్క కానీ చూస్తారు అని భయంతో చస్తున్నాం అని రేవతి అంటుంది. అప్పుడే గుమ్మానికి ఎదురుగా భద్రావతి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లి వస్తున్నారు అని అంటుంది. కూరగాయలకు వెళ్లాం రేట్లు ఎక్కువ అని తీసుకురాలేదు అని బామ్మ వణుకుతూ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్తారు మర్యాదగా చెప్పండి అని భద్రావతి అంటే ప్రేమని చూడటానికి వెళ్లామని రేవతి చెప్తుంది. భద్రావతి ముందు తిట్టి తర్వాత నా మేనకోడలికి ఎలా ఉంది అని అంటుంది. మందులు వేసుకుంటుందా.. అని అన్నీ భద్రావతి అడిగితే నా మనవడు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.. అయినా నీకు నీ మేనకోడలు అంటే పంచ ప్రాణాలు అని మాకు తెలుసులే.. మమల్ని వెళ్లొద్దు అంటున్నావ్ కానీ నువ్వు నీ మేనకోడల్ని చూడకుండా ఉండగలవా అని తల్లి భద్రావతితో అంటుంది.

నర్మద ఆఫీస్‌లో పని చేస్తూ ప్రేమ గురించే ఆలోచిస్తుంది. తర్వాత నర్మద ఫ్రెండ్ దివ్య వచ్చి ఏంటి మేడం పరధ్యానంలో ఉన్నారు అని అడిగితే నర్మద తన కొలిగ్‌కి విషయం మొత్తం చెప్తుంది. ఆర్డీవో ఆఫీస్‌లో ప్రసాద్ ఉన్నాడు కదా తనకి చెప్పు అని దివ్య అంటే నర్మద ఫోన్ చేసి మొత్తం చెప్తుంది. లారీ డిటైల్స్ చెప్పమని అంటుంది. ఇక మరోవైపు నర్మద జీవితంలో చిచ్చు పెట్టేయాలి అని భాగ్యం, ఇడ్లీబాబాయ్, భాగ్యం నర్మద నగలు తాకట్టు పెట్టిన నగల దుకాణానికి వెళ్తారు. 20 లక్షలు నగలు తీసుకొని వంద రూపాయలు ఇస్తుంది. ఇదేంటి అని ఆయన అంటే మిగతా అంతా ఈఎమ్‌ఐ ద్వారా కడతామని అంటుంది. మీరు ఎవరో నాకు తెలీదు ఇవ్వను అని అంటే నా కూతురు రామరాజు పెద్ద కోడలు అని అంటుంది. రామరాజు గారితో ఒక్క మాట చెప్పిస్తే ఇస్తాను అంటే నర్మద, సాగర్‌కి ఇచ్చారు కదా.. వాళ్లకి ఓ న్యాయం మాకు ఓ న్యాయమా.. అని అడిగితే వాళ్లు గరవ్నమెంట్ జాబ్‌లు ఇచ్చేస్తారు అంటే ఇప్పటి వరకు వాళ్లు వడ్డీ అయినా కట్టారా.. ఇప్పుడే వెళ్లి రామరాజుని అడగండి లేదంటే మీ డబ్బు పోతుందని రెచ్చగొట్టేస్తారు. మీ నగలు మాకు వద్దు అని ఇచ్చేసి వెళ్లిపోతారు.

అగ్గిపుల్ల పెట్టేశాం ఇక నర్మద కాపురం అయిపోతుందని తెగ సంతోషపడతారు. ఇంటి దగ్గర ధీరజ్ ప్రేమ కోసం జ్యూస్ చేస్తుంటే ప్రేమ అలా చూస్తుంటుంది. ధీరజ్‌ వినేలా ప్రేమ పాటలు పెడుతుంది. తను కూడా పాడుతూ ఉంటే ధీరజ్ ఏదీ ఈ ఫైర్ ఇంజన్ సౌండ్ అని వెటకారం చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.