సంగీత దిగ్గజం ఇళయరాజా కూతురు భవతారిణి జయంతి ఫిబ్రవరి 12న. ఈ సందర్భంగా ఒక మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తన కుమార్తె చివరి కోరికను నెరవేర్చడానికి పూర్తిగా బాలికలతో కూడిన ఒక ఆర్కెస్ట్రాను తను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ఈవెంట్లో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు కార్తీక్ రాజా, సోదరుడు గంగై అమరన్, డైరెక్టర్ వెంకట్ ప్రభు సహా ఇళయరాజా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇళయరాజా కూతురి చివరి కోరిక ఇదే
జనవరిలో 'భవత తిథి' అంటే... మరణించిన తర్వాత చేసే ఆచారం (భవతారిణి మొదటి వర్ధంతి) సందర్భంగా ఇళయరాజా తన కూతురు చివరి కోరిక గురించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ "ఫిబ్రవరి 12న భవతారిణి పుట్టినరోజు వస్తుంది. ఆమెను స్మరించుకోవడానికి ఒక సంగీత కార్యక్రమం నిర్వహిస్తాను" అని ముందుగానే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇంకా మాట్లాడుతూ బాలికలు మాత్రమే ఉండే ఆర్కెస్ట్రాను స్టార్ట్ చేయాలనుకుంటున్నానని భవతారిణి తనకు చెప్పిందని గుర్తు చేసుకున్నారు. అదే ఆమె చివరి కోరిక అని ఇళయరాజా వెల్లడించారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?

"రెండు రోజుల క్రితం నేను మలేషియాలో ఉన్నప్పుడు, నా ముందు యువతులతో కూడిన ఆర్కెస్ట్రా బృందం ప్రదర్శన ఇవ్వడంతో, భవత కోరిక గుర్తుకొచ్చింది" అని ఇళయరాజా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే "భవతారిణి పేరుతో ఒక ఆర్కెస్ట్రాను ప్రారంభించబోతున్నాను. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలు ఈ ఆర్కెస్ట్రాలో భాగమవుతారు. ఈ టీం ప్రపంచవ్యాప్తంగా పర్ఫార్మ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. దీనికి సంబంధించి టైం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న యువతులు దీనికోసం అప్లై చేసుకుని, ఆర్కెస్ట్రాలో భాగం కావడానికి ఆడిషన్స్ లో పాల్గొని వెల్లడించారు. ఈ ఆర్కెస్ట్రా భవత వారసత్వాన్ని నిలబట్టి ప్రపంచవ్యాప్తంగా మరింత ఉత్సాహాన్ని వ్యాపింప చేయాలని కోరుకుంటున్నాను" అని ఇళయరాజా వెల్లడించారు. అలాగే భవతారిణి అన్నయ్య కార్తీక్ రాజా తన దివంగత సోదరి గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టారు.

ఇక తాజాగా డైరెక్టర్ వెంకట్ ప్రభు భవతారిణిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. "అప్పుడే సంవత్సరం పూర్తి అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు తంగాచి #భవతారిణి (sic)." అని రాశారు.

Can’t believe it’s one year already 💔 💔 💔 happy bday thangachi #bhavatharini https://t.co/YSBPUWPQlE

— venkat prabhu (@vp_offl) February 12, 2025

క్యాన్సర్ తో భవతారిణి కన్నుమూత
భవతారిణి జాతీయ అవార్డు గెలుచుకున్న సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. తమిళ సినిమా 'భారతి'లోని ఓ పాటతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. క్యాన్సర్ తో పోరాడుతూ భవతారిణి 2024 జనవరి 25న 47 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచింది. ఆమె భర్త పేరు శబరి రాజ్. ఇళయరాజా భవతారిణి తండ్రి. అలాగే ఆమెకు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.

Also Read: మూడు నెలల తర్వాత తెలుగు ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ గ్యాంగ్ స్టర్ డ్రామా... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?