Hyundai Creta N Line Review Report: హ్యుందాయ్ క్రెటా N లైన్‌ని 15,000 కి.మీ. డ్రైవ్‌ చేసిన తర్వాత ఇస్తున్న రిపోర్ట్‌ ఇది. మొదట్లో, ఫ్యామిలీ కోసం ఉపయోగించిన ఈ SUV ఇప్పుడు ఆఫీస్‌కు వెళ్లడానికి, లాంగ్‌ ట్రావెలింగ్‌కు ఫస్ట్‌ ఛాయిస్‌గా మారింది. ఎందుకంటే దీని 160hp టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌ దీనిని చాలా వేగంగా మార్చింది. పైగా, పెద్ద బూట్ స్పేస్‌ ఉండటం వల్ల కూడా లాంగ్‌ ట్రిప్‌ సామాగ్రి పెట్టుకోవడానికి బాగా సూటవుతోంది.

ఫీచర్లు, టెక్ పర్ఫెక్ట్ కాంబినేషన్
Hyundai Creta N Line లో ఇచ్చిన ఫీచర్లు డ్రైవర్‌కి కన్వీనియన్స్‌తో పాటు కంఫర్ట్‌ను కూడా ఇస్తాయి. బ్లైండ్ స్పాట్ కెమెరాలు రోడ్లపై సేఫ్‌గా డ్రైవ్ చేయడానికి చాలా హెల్ప్‌ అవుతున్నాయి. స్టీరింగ్‌ తిప్పే సమయంలో డిస్‌ప్లేలో వచ్చే క్లియర్ వ్యూ డ్రైవింగ్‌ను ఈజీగా మారుస్తుంది. ఇంకా.. క్లైమేట్ కంట్రోల్‌, ఆడియో సిస్టమ్‌ కోసం ఇచ్చిన ఫిజికల్ బటన్స్, నాబ్స్ డ్రైవర్‌కి ఇబ్బంది లేని అనుభవం అందిస్తున్నాయి.

ఫ్యామిలీ ఫేవరెట్
ఫ్యామిలీకి కూడా క్రెటా ఒక ప్రత్యేకమైన అటాచ్‌మెంట్‌ ఇస్తుంది. ముందు సీట్‌లో కో-డ్రైవర్‌, వెనుక సీట్లో వైఫ్‌, బేబీ చైల్డ్ సీట్‌, పెంపుడు జంతువు అందరూ కంఫర్ట్‌గా కూర్చోగలిగే స్పేస్‌ ఉంది. వెనుక గ్లాస్ పూర్తిగా కిందకు దిగి వెళ్ళడం వల్ల పెట్ కూడా సంతోషంగా ట్రావెల్ చేస్తుంది. వీటన్నిటి వల్ల క్రెటా ఫ్యామిలీ రైడ్‌కు సూపర్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

రోడ్డు మీద డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్
18 అంగుళాల వీల్స్‌, స్పోర్టీ సస్పెన్షన్ వల్ల రోడ్ మీద డ్రైవింగ్ ఫీల్ చాలా స్పెషల్‌గా ఉంది. అదే సమయంలో, గుంతలు పడిన రోడ్ల మీద డ్రైవింగ్‌ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. స్టీరింగ్‌ కూడా కొంచెం హెవీగా ఉంటుంది. ఈ కారణంగా... సిటీ ట్రాఫిక్‌లో లైట్ హ్యాండ్లింగ్ కోసం చూసేవారికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు.

మైలేజ్‌లో నిరాశ
సిటీ డ్రైవ్‌లో మైలేజ్ మాత్రం పెద్ద మైనస్‌. ఒక్క లీటర్‌కు 8 కి.మీ. కూడా ఇవ్వడం లేదు. ఎథనాల్ మిక్స్ ఫ్యూయల్ వల్లా లేక ఇంజిన్ స్వభావం వల్లా తెలియదు కానీ, పెట్రోల్ బంక్‌కు తరచుగా వెళ్లాల్సి వస్తోంది. దీంతో మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్రప్రదేశ్‌ &తెలంగాణలో - ఈ కారు ధర రూ. 17.83 లక్షలు. ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 22.15 లక్షలు (Hyundai Creta N Line New on-road price, Hyderabad Vijayawada) అవుతుంది.

హ్యుందాయ్ క్రెటా N లైన్ లాంగ్ టర్మ్ రివ్యూ చెప్పేది ఒకే మాట - ఫీచర్లు, కంఫర్ట్‌, డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌లో ఇది టాప్ క్లాస్‌. కానీ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ మాత్రం చాలా నిరాశపరిచింది. ఫ్యామిలీ కోసం, అప్పుడప్పుడు ఆఫీస్ కోసం సూపర్ SUV కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌. అయితే, రోజువారీ సిటీ యూజ్ కోసం చూస్తే, మైలేజ్ విషయంలో కాస్త కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది.