Secunderabad Traffic Diversions | హైదరాబాద్: సికింద్రాబాద్‌లో వైభవంగా జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో నేటి (ఆగస్టు 2వ తేదీ) నుంచి 4వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ వెల్లడించారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధి వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఆగస్టు 3న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నారు. బోనాలు.. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ప్రకృతి శబ్దమైన 'భోజనం' రూపాంతరమే 'బోనం' అని తెలిసిందే. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అన్నం, పాలు, బెల్లం కలిపి సమర్పించే నివేదననే బోనం అని అంటారు.

ఏయే మార్గాలు మూసివేస్తారంటే...
లష్కర్ బోనాలు జాతరను పురస్కరించుకొని 1వ తేదీ అర్ధరాత్రి 1:00 గంటల నుండి 4వ తేదీ ఉదయం వరకు నగరంలోని పలు కీలక రహదారులను పూర్తిగా మూసివేయనున్నారు. పొగాకు బజార్, హమాలీ విగ్రహం నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారులతో పాటు సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్, అడవియ్య క్రాస్ రోడ్స్, జనరల్ బజార్ నుండి ఆలయానికి వెళ్లే దారుల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలకు ట్రాఫిక్ మళ్లింపులు
ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.

కర్బాలా క్రాస్ రోడ్స్: చిల్డ్రన్ పార్క్ వైపు నుండి వచ్చే వాహనాలను రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.

ఆర్టీసీ బస్సులు & సాధారణ వాహనాలు: కర్బాలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర సాధారణ వాహనాలు రాణిగంజ్ క్రాస్ రోడ్స్ వద్ద మళ్లింపు తీసుకొని, మినిస్టర్ రోడ్డు మరియు గోపాలపురం లైన్ మీదుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోనున్నాయి.

Also Read: Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత

వాహనాల నిలిపివేతకు 8 పార్కింగ్ స్థలాలు
ఆలయానికి వచ్చే భక్తుల వాహన రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులు 8 ప్రదేశాలలో పార్కింగ్ స్థలాలను కేటాయించారు. భక్తులు తమ వాహనాలను క్రింది ప్రాంతాలలో పార్క్ చేసుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు, అధికారులు సూచించారు.

- హరిహర కళాభవన్‌ పక్క రోడ్డు
- మహబూబ్ కళాశాల స్కూల్
- మోండా మార్కెట్ వెనుక ఉన్న ఇస్లామియా స్కూల్
- ఓల్డ్ జైల్ ఖానా
- ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద
- అడవయ్య ఎక్స్ రోడ్డు సమీపంలోని ఆదయ్య మెమోరియల్ స్కూల్
- తాజ్ త్రీస్టార్ హోటల్ వద్ద
- బెల్సన్ తాజ్ హోటల్ ప్రాంతం