Hyderabad Real Estate: పరిశ్రమల మధ్యలో సింగిల్ ఎంట్రీ ఉన్నా.. మెరుపు వేగంతో దూసుకుపోతున్న జీడిమెట్ల రియల్ భూమ్
1 week ago 3
ARTICLE AD
హైదరాబాద్ మహనగరంలో జీడిమెట్ల పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి జీవనాధారం. ఇక్కడ పరిశ్రమల్లో పని చేసేందుకు తెలుగు రాష్ట్రాలతో పోటీగా బిహార్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల కార్మికులు వలస వచ్చి ఇక్కడే స్దిరపడ్డారు. ఓసారి ఈ కాలనీపై ఓ లుక్కేయండి... భారీ పరిశ్రమల మధ్యలో దాగున్న జీడిమెట్ల కాలనీలకు వెళితే ప్రశాంతమైన పల్లెటూరికి వచ్చామా అనేలా ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ కాలనీల చుట్టూ పరిశ్రమల పొగ, కలుషితమైన నీరు.. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు జీడిమెట్ల అంటే హైదరాబాద్ రియల్ రంగంలో మెరుపు వేగంతో దూసుకుపోతున్న కీలక ప్రాంతం. అందుకే గతంలో వద్దు బాబోయ్ మాకు జీడిమెట్ల జాగా అన్నవాళ్లు.. ఇప్పుడు కొనగలమా ఇక్కడ జాగా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ఫ్లాట్ ధర రూ.50 లక్షల పైమాటే..
ఇక్కడ సొంతిల్లు 10 లక్షల నుండి ఇప్పుడు కోటిన్నరకు పైగా చేరుకుంది. ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఊహించని స్దాయిలో పెరిగిపోయింది. సొంత ఇళ్లు కంటే ఫ్లాట్లు కట్టి అమ్మేస్తున్నారు. కాలుష్యం గతంతో పోల్చితే బాగా తగ్గింది. తాగునీటి సమస్యకు విముక్తి కలిగింది. మంజీరా వాటర్ ప్రతీ ఇంటికీ చేరుతోంది. అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలంటే జీడిమెట్ల కాలనీలలో ఇప్పుడు 50 లక్షల నుండి 60 లక్షల మధ్య ధర పలుకుతోంది.
హైదరాబాద్ లో ప్రైమ్ ఏరియా కూకట్ పల్లికి కూతవేటు దూరంలో ఉన్న జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో, పరిశ్రమలు దాటుకుని లోపల కాలనీలలోకి వెళితే భాగ్యనగరంలో ఓ కొత్త ప్రపంచాన్ని చూసినట్లుటుంది. గత పదేళ్ల కాలంలో జీడిమెట్ల కాలనీలు అత్యంత వేగంగా అభివృద్ది చెందాయి. ముఖ్యంగా దశాబ్దాల నుండి వెంటాడుతున్న త్రాగునీరు, పారిశుధ్యం, కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారం లభించింది. ఈ ప్రభావంతో రియల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గజం 20వేల నుండి ఏకంగా 75 వేలు, కొన్నిచోట్ల లక్షకు పైగా ధర పలుకుతోంది. అంటే ఓ 10 గజాలు జాగా కొనాలంటే ఇప్పుడు 75 లక్షలకు పైమాటే.
తాజాగా ధరలు ఏ మాత్రం తగ్గలేదు కానీ హైదరాబాద్ వ్యాప్తంగా రియల్ రంగం మందకొడిగా ఉండటంతో కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. నిర్మాణ వ్యయం కూడా ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇళ్లు కట్టాలంటే ఒకప్పటి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ధరలు అమాంతం పెరగడంంతో ఆ ప్రభావం కొనుగోళ్లు , అమ్మకాలు ఉపాధి అవకాశాలపై స్పష్టంగా కనిపిస్తుంది. బయట నుండి చూస్తున్నవారికి జీడిమెట్ల అంటే విపరీతమైన వాయుకాలుష్యం, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం, అక్కడ ఉండలేమనే అభిప్రాయం ఉంటుంది. కానీ జీడిమెట్ల కాలనీలకు వస్తే ఇక్కడ పూర్తిగా రివర్స్ లో ఇక్కడ ప్రశాంతమైన వాతావారణం కనిపిస్తుంది. పచ్చటి చెట్ల మధ్యలో ఇళ్లు, వాహనాల రద్దీ, ధ్వని కాలుష్యం , ఇవేవీ కనిపించవు, వినిపించవు. అచ్చమైన పల్లెటూరి వాతావరణం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉపాధి కూలీలు, వారిని నమ్ముకుని నడుస్తున్న కిరాణ వ్యాపారాలు, చిన్న చిన్న హోటల్స్ ఇలా జీడిమెట్ల కాలనీలు హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న ఆహ్లాదకర ప్రాంతాలుగా చెప్పవచ్చు. హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ విషయంలో జీడిమెట్ల కాలనీలలో వింత పరిస్ధితి కనిపిస్తుంది. పారిశ్రామిక వాడమీదుగా జీడిమెట్ల కాలనీలలోకి ఎంటర్ అయ్యామంటే , అక్కడితో కాలనీ ఎండ్ వరకూ వెళ్లి, మళ్లీ వెళ్లిన దారిలోనే తిరిగి వెనక్కు రావాల్సిందే. మరో మార్గం ద్వారా వేరే ప్రాంతానికి వెళ్లడం జీడిమెట్ల కాలనీలలో అసాధ్యం. సింగిల్ ఎంట్రీ జీడిమెట్ల కాలనీలకు మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.
జీడిమెట్ల కాలనీలలో ఇటీవల కాలంలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె 10వేలకు చేరుకుంది. డబుల్ బెడ్ రూమ్ అయితే 15 నుండి 18వేల మధ్య నడుస్తోంది. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే 50లక్షలకు పైమాటే. ఇలా భారీ పరిశ్రమల చాటున దాగిన జీడిమెట్ల హైదరాబాద్ రియల్ రంగంలో సైలెంట్ గా దూసుకుపోతోంది.
Read Entire Article