Husharu Pittalu OTT Streaming Platform: టీనేజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తెలుగు సినిమా 'హుషారు పిట్టలు'. థియేటర్లలో సంచలన విజయం సాధించింది. అయితే... సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్లపై వివాదం నెలకొంది. ఆ హీరో హీరోయిన్ల వయసు ఏమిటి? ఆ కంటెంట్ ఏమిటి? అని విమర్శలు వచ్చాయి. సినిమా ఓటీటీలోకి వచ్చిన తరుణంలో మరోసారి ఆ వివాదం మళ్ళీ మొదలు అవుతుందా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది? వివాదం ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'హుషారు పిట్టలు'
ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇవాళ్టి (సెప్టెంబర్ 15వ తేదీ) నుంచి 'హుషారు పిట్టలు' స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలో అడుగు పెట్టింది. థియేటర్లలో విజయానికి ముందు అనేక వివాదాలతో వార్తల్లో నిలిచిందీ సినిమా.

Also Read: Jai Jai Ram Song - రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?

'హుషారు పిట్టలు' టీజర్ విడుదలైనప్పుడు నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇందులో అమ్మాయి స్కూల్ స్టూడెంట్. అబ్బాయి ఏమో పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ కాలేజీ జాయిన్ అవుతాడు. హీరో హీరోయిన్లు ఇద్దరివీ టీనేజ్ క్యారెక్టర్లు. వాళ్ళ మధ్య చూపించిన బోల్డ్ రొమాంటిక్ సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులపై సోషల్ మీడియా వేదికలలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ వివాదం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.

బిక్షు దర్శకత్వం వహించిన 'హుషారు పిట్టలు'లో టీనేజ్ రొమాన్స్, కామెడీ ఉన్నాయి. అంతే కాకుండా... టీనేజర్లకు స్మార్ట్‌ ఫోన్ ఇవ్వడం వల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయి? యువతీ యువకులపై ఆన్‌ లైన్ కంటెంట్ ఎటువంటి ప్రభావం చూపిస్తోంది? వంటి అంశాలను ప్రధానంగా చూపించారు.

Also Read: Eesha Rebba Tharun Bhascker - ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్... రిలేషన్షిప్ రూమర్లకు చెక్ పెడుతూ అఫీషియల్‌గా

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా... యూత్‌ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'హుషారు పిట్టలు' సినిమాను పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. సురేష్‌ ఏషియన్‌ ఫిలిమ్‌ సంస్థలు థ్రియేటికల్ రిలీజ్ చేశారు. థియేటర్‌లో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందించిన ప్రేక్షకులు ఓటీటీలో కూడా మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నానని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. సునీత మనోహర్, అంజి మామ, గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి కీలక పాత్రలలో కనిపించారు. ఆగస్టు 15న థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు ఓటీటీ విడుదల తర్వాత ప్రేక్షకులలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ ఓటీటీలో ప్లస్ అవుతుందా? లేదంటే కొత్త వివాదాలకు దారి తీస్తుందా? అనేది చూడాలి.

Also Read: Prerana Kambam Announces Pregnancy - తల్లి కాబోతున్న కృష్ణ అలియాస్ ప్రేరణ... వినాయక చవితికి గుడ్ న్యూస్ చెప్పిన 'ఇస్మార్ట్ జోడీ 3' విన్నింగ్ కపుల్