బాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు ఉన్నాయి. అలాగే, కొన్ని బ్రేకప్ కహానీలు ఉన్నాయి. అన్నిటిలోకెల్లా హృతిక్ రోషన్ వర్సెస్ కంగనా రనౌత్ (Hrithik Roshan vs Kangana Ranaut) ఎపిసోడ్ సంథింగ్ స్పెషల్. తనను హృతిక్ మోసం చేశాడనట్టు గతంలో కంగన విమర్శలు చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తుంటారు. అయితే... ఆవిడ ఎంపీ అయ్యాక ఆ ఎపిసోడ్ మరుగున పడింది. ఇప్పుడు దాన్ని జెన్ జి మళ్ళీ తెరపైకి తీసుకు వచ్చింది. దాంతో కంగనాకు కోపం వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే...

హృతిక్‌కు మనం సారీ చెప్పాలి!
''మనం హృతిక్ రోషన్‌కు క్షమాపణలు చెప్పాలి'' (We Need to Apologise to Hrithik Roshan హ్యాష్ ట్యాగ్) అంటూ సోషల్ మీడియాలో జెన్ జి వరుసపెట్టి పోస్టులు చేస్తున్నారు. దాంతో సారీ హృతిక్ వైరల్ ట్రెండ్ అయ్యింది.

ఉన్నట్టుండి హృతిక్ రోషన్ ఎందుకు తెరపైకి వచ్చారు? ఆయనకు సారీ చెప్పాలని జెన్ జి ఎందుకు ట్రెండ్ చేస్తుంది? దీనికి కారణం ఏమిటి? అంటే... స్టూడెంట్ ప్రోటెస్ట్స్ (నీట్ పేపర్స్ లీక్ అంశంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు నగరాల్లో జరిగిన ధర్నాలు) విషయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల పట్ల సీజేపీ నొచ్చుకుంది.

కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ కంగనా రనౌత్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ప్రభుత్వానికి మద్దతుగా ఆమె నిలబడ్డారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)పై ఘాటుగా విమర్శలు చేశారు. ఆ తరువాత సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ''నేను చూడటానికి యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానని నా ఫ్రెండ్స్ అంటారు. అందుకే కంగనా రనౌత్ నా మీద పడి ఏడుస్తోంది" అని వెటకారంగా మాట్లాడారు. అది కంగనాపై సెటైర్. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దాంతో పదేళ్ళ క్రితం (2016లో) జరిగిన వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. దీంతో హృతిక్ రోషన్‌కు సారీ చెప్పాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?

వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న హృతిక్!
సోషల్ మీడియాలో ట్రెండ్ గమనించిన హృతిక్ రోషన్ కూల్‌గా స్పందించారు. ఓ విధంగా ఆయన చెప్పిన మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్ ఫ్రెడ్డీ బర్డీ చేసిన పోస్టుకు రిప్లై ఇస్తూ... ''మీకు ఒకరు నచ్చడం లేదు కాబట్టి మరొకరి వైపు నిలబడటం మన సమాజంలో ఉన్న అతి పెద్ద సమస్య" అన్నారు. కంగనా రనౌత్ మీకు నచ్చడం లేదు కాబట్టి నావైపు నిలబడ్డారని అర్థం వచ్చేలా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో సెంటిమెంట్స్ కంటే వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని, తాను కూడా వాస్తవాల కోసమే వేచి చూస్తున్నానని హృతిక్ రోషన్ స్పష్టం చేశారు.

Hrithik Roshan finally reacts to the viral “We Need To Apologise To Hrithik” trend.

“I’ll wait for facts, not online narratives.”

His sharp response is now fueling fresh debate online.

#HrithikRoshan #sorryhrithik #KanganaRanaut pic.twitter.com/6RNSIu36Mo

— Smriti Sharmaa (@SmritiSharma_) August 2, 2026

హృతిక్ రోషన్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఫైర్!
హృతిక్ రోషన్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "అగ్నికి ఆజ్యం పోయడం ఆపండి" అని హృతిక్‌ను ఉద్దేశిస్తూ చెప్పారు. సబా ఆజాద్‌తో ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటూ... సోషల్ మీడియాలో తనను వేధిస్తున్న వాళ్ళను ఖండించాల్సింది పోయి, అటువంటి కామెంట్స్ చేయడం ఆపమని చురకలు అంటించారు.

Also Read: Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Old Feud, New Twist!

The viral #SorryHrithik trend has reignited the Kangana Ranaut–Hrithik Roshan controversy. After Hrithik’s post urging people not to follow social media narratives, Kangana hit back, accusing him of “adding fuel to the fire.” #KanganaRanaut #HrithikRoshan pic.twitter.com/pf5FFP2vH7

— Smriti Sharmaa (@SmritiSharma_) August 2, 2026

అసలు హృతిక్, కంగనా రనౌత్ గొడవ ఏంటి?
సుమారు పదేళ్ళ క్రితం... 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హృతిక్‌ను 'సిల్లీ ఎక్స్' అని కంగనా రనౌత్ పేర్కొనడం పెద్ద రచ్చకు దారి తీసింది. తనకు కంగనాతో ఎప్పుడూ రిలేషన్ లేదని హృతిక్ రోషన్ చెప్పారు. అంతే కాదు... లీగల్ నోటీసులు, ఈ మెయిల్స్, కోర్టు కేసుల వరకు వెళ్ళిందీ వివాదం. ముందు హృతిక్ లీగల్ నోటీసు పంపిస్తే, కంగన కౌంటర్ నోటీసు ఇచ్చారు. తనకు ఈమెయిల్స్ చేశారని పేర్కొన్నారు. అయితే... ఈ కేసులో సరైన ఆధారాలు లేవని 2021లో పోలీసులు క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జెన్ జి చేస్తున్న ఉద్యమం మళ్ళీ పాత గొడవను బయటకు తెచ్చింది. హృతిక్ ఏమో ఫ్యాక్ట్స్ (వాస్తవాల) కోసం వెయిట్ చేస్తానంటుంటే... కంగనా రనౌత్ మాత్రం తనను టార్గెట్ చేయడం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అదీ సంగతి!

Also Read: Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?