Honda Elevate Price, Down Payment, Loan and EMI Details: మిడ్-సైజ్ SUV విభాగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది Honda Elevate SUV. జపనీస్ ఇంజనీరింగ్ విశ్వసనీయతకు తోడు మోడర్న్ డిజైన్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ వాహనం నేటి Gen-Z & Alpha జనరేషన్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. బిజీ ట్రాఫిక్‌లో రోజూవారీ కమ్యూట్ & వీకెండ్ లాంగ్ డ్రైవ్‌లకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా ఈ కారు నిలుస్తోంది.

హైదరాబాద్‌లో ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర

భాగ్యనగరంలో Honda Elevate బేస్‌ వేరియంట్‌ SV Petrol Manual ఎక్స్-షోరూమ్ ధర రూ. 11,80,700. రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ & ఇతర చార్జీలు కలిపి హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర సుమారు రూ. 14,71,009 అవుతుంది. టాప్-ఎండ్ మోడల్ ZX Petrol Automatic Dual Tone ADV Edition ఆన్-రోడ్ ధర రూ. 21,09,143 వరకు ఉంటుంది.

విజయవాడలో ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధర

విజయవాడలో Honda Elevate బేస్‌ వేరియంట్‌ SV Petrol Manual ఎక్స్-షోరూమ్ ధర రూ. 11,80,700. రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ & ఇతర చార్జీలు కలిపి బెజవాడలో ఆన్-రోడ్ ధర సుమారు రూ. 14,57,984 అవుతుంది. టాప్-ఎండ్ మోడల్ ZX Petrol Automatic Dual Tone ADV Edition ఆన్-రోడ్ ధర రూ. 20,90,416 వరకు ఉంటుంది.

అద్భుత ఇంజన్, ఫీచర్లు & సేఫ్టీ స్పెసిఫికేషన్లు

ఈ ఎస్‌యూవీలో 1.5-litre i-VTEC Petrol Engine అందించారు. ఇది 121 PS పవర్‌ & 145 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-Speed Manual & 7-Speed CVT Automatic ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. కేవలం లగ్జరీ మాత్రమే కాకుండా, హోండా సెన్సింగ్‌ ADAS టెక్నాలజీ, 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు & 220 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వంటి అత్యుత్తమ ఫీచర్లు ఉన్నాయి.

కనీస డౌన్‌పేమెంట్‌ & ఫైనాన్స్‌ ప్లానింగ్

తెలుగు రాష్ట్రాల్లో.. ప్రముఖ బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు ఈ మోడల్‌పై లోన్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. మీరు, హైదరాబాద్‌లో బేస్‌ వేరియంట్‌ను లోన్‌పై కొనాలంటే, కనీస డౌన్‌పేమెంట్ రూ.3 లక్షలు చెల్లించాలి. మిగిలిన మొత్తం రూ. 11,71,009ను రుణం రూపంలో పొందవచ్చు. ఈ రుణాన్ని మీరు 10% వార్షిక వడ్డీ చొప్పున పొందారు అని భావిస్తే...

ఇది కూడా చదవండి: టాటా కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలలో రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌!

రూ. 11,71,009 లోన్‌పై 10% వడ్డీ రేటుతో 5, 6 & 7 ఏళ్లకు EMI లెక్కలు:

5 ఏళ్ల (60 నెలలు) టెన్యూర్: నెలకు చెల్లించాల్సిన EMI సుమారు రూ. 24,880 గా ఉంటుంది.

6 ఏళ్ల (72 నెలలు) టెన్యూర్: నెలకు చెల్లించాల్సిన EMI సుమారు రూ. 21,693 గా ఉంటుంది.

7 ఏళ్ల (84 నెలలు) టెన్యూర్: సుదీర్ఘ కాలపరిమితి ఎంచుకుంటే నెలకు కనీసం రూ. 19,440 చెల్లిస్తే సరిపోతుంది.

మీరు 7 ఏళ్ల కాల వ్యవధిని ఎంచుకుంటే, నెలకు రూ.20,000 కంటే తక్కువ మొత్తంతోనే Honda Elevate ను మీ సొంతం చేసుకోవచ్చు.

కారు కొనుగోలు చేసే ముందు విభిన్న బ్యాంకులు అందించే ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్లు & ప్రిపేమెంట్ నిబంధనలను పరిశీలించండి. మీ CIBIL స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 10% కంటే తక్కువ వడ్డీకే రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. ఆన్-రోడ్ ధరపై డీలర్‌షిప్ వారంటీ ఆఫర్లను సరిచూసుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: కొత్త ఇంజిన్‌తో సరికొత్తగా మారిన 2026 Maruti Baleno.. ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ రోడ్డుపై ఎలా ఉంది?

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.