High Blood Pressure : బీపీని తగ్గించే 4 మ్యాజికల్ ఫుడ్స్.. హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన సీక్రెట్స్ ఇవే

1 month ago 5
ARTICLE AD

Tips to Control Hypertension : అధిక రక్తపోటు అంటే రక్తనాళాల్లో రక్తపోటు చాలా ఎక్కువగా ఉండటమే. 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ అయితే హై బీపీగా పరిగణిస్తారు. నార్మల్ బీపీ అంటే 120/80 mm Hg కంటే తక్కువగా ఉండాలి. అయితే ఈ అధిక రక్తపోటు ఆరోగ్యాన్ని చాలా సైలెంట్​గా ప్రభావితం చేస్తుంది. నెమ్మదిగా కిడ్నీ ఫెయిల్యూర్, స్ట్రోక్, హార్ట్  అటాక్​కు దారితీస్తుంది. అందుకే దీన్నీ సైలెంట్ కిల్లర్ అంటారు.

దాదాపు సగం మంది తమకు హై బీపీ ఉందనే విషయం కూడా తెలియదని కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజ్ రాజ్ తెలిపారు. హై బీపీ ఉందని తెలిసే సరికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అది వారిలో ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు. మరి దీనిని ఎలా కంట్రోల్ చేయాలి? ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుందనే దానిపై పలు సూచనలు చేశారు.

మందులతో బీపీ తగ్గుతుందా ?

మందులు వాడకుండా బీపీని తగ్గించుకోవచ్చా? అనే ప్రశ్నకు సంజయ్ ఆన్సర్ ఇస్తూ.. అవును అన్నారు. అయితే అది పూర్తిగా కన్సిస్టెన్సీ మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే మీరు తీసుకునే ఆహారం దీనిలో కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. మీరు తీసుకునే ఫుడ్​లోని న్యూట్రియెంట్స్.. మీ కార్డియో వాస్కులర్ సిస్టమ్​తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనేది ముఖ్యమని చెప్తున్నారు. మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బీపీ అదుపులో ఉండి గుండెపై భారం పడకుండా ఉంటుందనే విషయాలు తెలిపారు.

అవకాడో

అవకాడోలో పొటాషియం, మెగ్నీషియం రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపీని రెగ్యులేట్ చేయడానికి అవసరమైన మినరల్స్. పొటాషియం శరీరంలో సోడియం లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. రక్తనాళాల మీద ఒత్తిడి తగ్గిస్తుంది. మెగ్నీషియం వాస్కులర్ సిస్టమ్​ని రిలాక్స్ చేస్తుంది. కాబట్టి దీనిని సలాడ్స్​లో, స్మూతీల్లో తీసుకోవచ్చు. టోస్ట్ మీద స్ప్రెడ్ చేసి తినవచ్చు.

అరటిపండు

ఖరీదైన మందుల కంటే అరటిపండు బీపీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అధిక పొటాషియమ్ వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. కార్డియో వాస్కులర్ సిస్టమ్​లో టెన్షన్ తగ్గుతుంది. పైగా ప్రతిరోజూ తినడానికి సులభంగా అందుబాటులో ఉంటుంది. దీనిని మీరు స్నాక్​గా తీసుకోవచ్చు. ఓట్ మీల్​లో వేసుకోండి. బ్రేక్ ఫాస్ట్​కి టాపింగ్​గా తినవచ్చు.

ఆకుకూరలు

పాలకూర, కాలే, మెంతి, కొత్తిమీర వంటి ఆకుకూరలు బీపీకి సూపర్ హీరోలు. ఆకుకూరల్లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. నైట్రేట్స్ రక్తనాళాల సౌలభ్యాన్ని పెంచుతాయి. రక్తప్రవాహం మెరుగవుతుంది. బీపీ సహజంగా తగ్గుతుంది. వీటిలో కొన్ని పచ్చిగా సలాడ్​గా తీసుకోవచ్చు. పప్పులో లేదా కర్రీలుగా చేసుకుని డైట్​లో చేర్చుకోవచ్చు.

వెల్లుల్లి

వేల సంవత్సరాలుగా ఔషధ గుణాల కోసం వాడుతున్న వెల్లుల్లి.. ఇప్పుడు సైన్స్ ద్వారా కూడా బీపీని అదుపులో ఉంచుతుందని నిరూపించింది. అల్లిసిన్ అనే కాంపౌండ్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల సర్క్యులేషన్ మెరుగవుతుంది. క్రమంగా బీపీ తగ్గుతుంది. పొద్దున ఖాళీ కడుపుతో 1 లేదా 2 రెబ్బలు తినవచ్చు. వంటల్లో తీసుకోవచ్చు.

అయితే ఇవి ఒక్కరోజు తింటే ఫలితం వచ్చేస్తుంది అనుకోకూడదు. రోజూ డైట్​లో తీసుకోవాలి. అలాగే ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజూ 30 నిమిషాల వ్యాయామం లేదా వాకింగ్ చేసినా బీపీ అదుపులో ఉంటుంది. నిద్రకూడా దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తుంది కాబట్టి రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Read Entire Article