Suhas's Hey Balwanth Movie OTT Platform Locked : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'హే బల్‌వంత్' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సినిమాకు గోపీ అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్, శివానీలతో పాటు సీనియర్ హీరో నరేశ్, సుదర్శన్, స్రవంతి, హర్షవర్థన్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి నరేంద్ర రెడ్డి నిర్మించగా... వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.

Also Read : మ్యూజిక్ డైరెక్టర్‌కు విశ్వక్ గోల్డ్ వాచ్ - రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా అంటూ ఎమోషనల్