Hardik Pandya Expands Luxury Car Collection: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన లగ్జరీ కార్ల గ్యారేజీని మరింత విస్తరించారు. ఇటీవలే ఫెరారీ 12 సిలిండ్రీ (Ferrari 12Cilindri) కొని వార్తల్లో నిలిచిన పాండ్యా, ఇప్పుడు సరికొత్త మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ (Mercedes-Benz V-Class) ను తన కలెక్షన్‌లో చేర్చుకున్నారు. ఈ నెలలోనే భారత మార్కెట్లోకి విడుదలైన ఈ ప్రీమియం ఎంపీవీకి పాండ్యానే దేశంలో మొదటి యజమాని కావడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, హార్దిక్ ఈ లగ్జరీ కారును తన గర్ల్‌ఫ్రెండ్ మహిమా శర్మకు కానుకగా ఇచ్చారు. వీరు ఇద్దరూ కలిసి మెర్సిడెస్ షోరూమ్ వద్ద కారు కీస్ తీసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar)

ధర, కాంపీటిష‌న్ వివరాలు
భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.40 కోట్లుగా ఉంది. ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్‌లో ఇది టొయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire), లెక్సస్ ఎల్ఎమ్ (Lexus LM) మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. 2023లో గ్లోబల్ మార్కెట్లో పరిచయమైన ఈ లేటెస్ట్ జనరేషన్ మోడల్ సరికొత్త విజువల్ ఐడెంటిటీతో వచ్చింది. దీని ముందు భాగంలో మెర్సిడెస్ సిగ్నేచర్ గ్రిల్ డిజైన్ తో పాటు మోడ్రన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఫీచర్లు.. ఇంటీరియర్ విశేషాలు
ఈ కారు ఇంటీరియర్ లో విలాసానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ అడ్జస్టబిలిటీ కలిగిన లాంజ్ సీట్లు ఉన్నాయి. వీటిలో మసాజ్, వెంటిలేషన్, హీటింగ్ వంటి అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. 64-కలర్ యాంబియంట్ లైటింగ్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, రెండు 12.3-అంగుళాల డిజిటల్ డిస్ప్లేలు కారుకు రాయల్ లుక్ ఇస్తున్నాయి. భద్రత విషయంలో కూడా ఏడు ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లతో రాజీ పడలేదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంజిన్ సామర్థ్యం
ఈ లగ్జరీ కారు పెట్రోల్, డీజిల్ అనే రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. డీజిల్ వెర్షన్ (V300 d) లో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉండగా, ఇది 237 hp పవర్ ఇస్తుంది. పెట్రోల్ వెర్షన్ 231 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు మోడళ్లలోనూ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అమర్చారు. ఇండియాలో లభించే మెర్సిడెస్ మోడళ్లలో ఇదే అత్యంత పొడవైన కారు కావడం గమనార్హం. ఏదేమైనా ఇటీవల కార్లు కొంటూ హార్దిక్ వార్తల్లో నిలవడం పరిపాటిగా అయిపోయింది. రీసెంట్ గానే తన కుమారుడి కోసం నాలుగు కోట్ల కారు కొన్నాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మరో రెండు కార్లు కొనడంపై అతని అభిమానులు హేపీగా ఫీలవుతున్నారు.