Happy Ramadan Wishes 2026: ముస్లింల పవిత్ర గ్రంథం అయిన 'ఖురాన్‌' ఆవిర్భవించిన నెల రంజాన్.. అందుకే ఈ నెలలో ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నెలవంక కనిపించడంతో ప్రారంభమయ్యే రంజాన్‌ మాసం మళ్లీ నెలవంక వచ్చిన తర్వాతే ముగుస్తుంది. ఈ నెల రోజులు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సెహరీతో ఉపవాస దీక్షలు మొదలై సాయంత్రం ఇఫ్తార్ విందుతో విరమిస్తారు. నెల పాటూ ఈ దీక్షలను అత్యంత నియమంగా పాటిస్తారు. దీక్షలు ముగింపు రోజున ఈద్ ఉల్ ఫీతర్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈద్ ముబారక్, ఈద్ సద్ అని, రంజాన్ శుభాకంక్షలు అని చెప్పుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. రంజాన్ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

అల్లాహ్ మీ జీవితంలో ఆనందం నింపాలి
ఐశ్వర్యం ప్రసాదించాలి
మీ ప్రార్థనలు ఫలించాలి
ఈద్ ముబారక్

రంజాన్ అంటే క్షమాపణ కోరేందుకు మరో అవకాశం
ఈ అవకాశాన్ని సోదరులంతా సద్వినియోగం చేసుకోవాలి
రంజాన్ శుభాకాంక్షలు 2026

అల్లా అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ
రంజాన్ శుభాకాంక్షలు 2026

ఈ పవిత్ర మాసంలో అల్లా మీ చింతలు తొలగించి ఆనందాన్ని ప్రసాదించాలి
రంజాన్ శుభాకాంక్షలు

విధేయతతో చేసే పనులు మంచి ప్రతిఫలాన్నిస్తాయి
అల్లా ఆశీర్వాదం మీపై సదా ఉండాలని కోరుకుంటూ

ప్రతి రంజాన్ నెల ఓ అద్భుత ప్రయాణం
అందులో ఈద్-ఉల్-ఫితర్ అద్భుత ఘట్టం
ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

అల్లా మీకు శాంతిని, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటూ
ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్నీ అధిగమించే శక్తిని అల్లా మీకు ప్రసాదించాలి
ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

దేవునిపై భక్తి విశ్వాసాలు ఉండేవారి కర్మానుసారం
పవిత్రమైన జీవితం అందుతుందని చెబుతోంది ఖురాన్
రంజాన్ శుభాకాంక్షలు 2026

రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగించుకుని
ఈద్ ఉల్ ఫితర్ వేడుక జరుపుకుంటున్న సందర్భంగా
రంజాన్ శుభాకాంక్షలు

సహనం, సంతోషం, ప్రేమ, దయ కలయికే రంజాన్ మాసం
మీకు , మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

ఈ రంజాన్ మీ కుటుంబంలో సంతోషం నింపాలి

ఈ మహత్తరమైన రోజున మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి
రంజాన్ శుభాకాంక్షలు 2026

ఈ పవిత్ర మాసం మీ కలలు నిజం చేయాలి, ఆశలు నెరవేర్చాలి
మీకు , మీ కుటుంబ సభ్యులకు రంజాన్ ముబారక్

మీ జీవితం ఎంత కష్టంగా ఉన్నా.. రంజాన్ దాన్ని మార్చగలదని విశ్వశించండి
మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు

ఈ రంజాన్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు

ఉపవాసంతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు..
పేదవాడి ఆకలి బాధ తెలుసుకోవడమే అసలు ఉద్దేశం
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

ఈ రంజాన్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి
సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

ఆ చంద్ర కాంతి మీపై ప్రసరించాలి
అల్లా దీవెనతో మీ కోర్కెలు ఫలించాలి
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

ధార్మిక చింతన, క్రమ శిక్షణల కలయిక రంజాన్ మాసం
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు 2026

ముస్లింలు పండుగ శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈద్ ముబారక్ అని పలకరిస్తారు.. ఇంకా.. ఖైర్ ముబారక్, అల్లాహ్ యెబరేక్ ఫీక్ అని కూడా చెప్పవచ్చు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.