Actress Hansika Motwani Divorced From Her Husband Sohael Khan : టాలీవుడ్ హీరోయిన్ హన్సిక తన భర్త సోహైల్‌తో డివోర్స్ తీసుకున్నారు. గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉండగా విడాకుల రూమర్స్ హల్చల్ చేశాయి. దీనిపై ఇరువురూ స్పందించలేదు. తాజాగా వీరి నాలుగేళ్ల వివాహ బంధానికి తెరపడింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. ఇరువురూ పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు తెలుస్తోంది.

హన్సిక తన భర్త నుంచి ఎలాంటి భరణం కోరలేదని తెలుస్తోంది. ఇరువురి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయినట్లు సమాచారం. ఫ్యామిలీ మెంబర్స్ ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత కొద్ది రోజులుగా హన్సిక, సోహైల్ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు సైతం హీరోయిన్ డిలీట్ చేయడంతో డివోర్స్ రూమర్లకు మరింత బలం చేకూరింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరి వివాహ బంధం ముగిసింది.

Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డ్ - ఓవర్సీస్‌లో ప్రీ సేల్ కలెక్షన్స్ ఎంతంటే?