Habits to Boost Success : ఒత్తిడి తగ్గి పనితీరు పెరగాలా? సక్సెస్ కావాలంటే ఈ 5 మిలటరీ రూల్స్ ఫాలో అవ్వండి
14 hours ago 1
ARTICLE AD
Military Rules Worth Following in Life  : ఈ రోజుల్లో చాలామంది సక్సెస్ కావాలని కోరుకుంటారు. కానీ విజయాన్ని పొందాలంటే ఉండాల్సిన క్రమశిక్షణ, సహనం, సరైన అలవాట్లు మాత్రం అలవరచుకోలేకపోతున్నారు. ఓ రకంగా ఇది సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా కావొచ్చు. ఎందుకంటే వారు ఏకాగ్రతతో పనిమీద ఫోకస్ చేయాలన్నా ఈజీగా డైవర్ట్ అయిపోయేలా చేస్తుంది సోషల్ మీడియా. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే మీ జీవితాన్ని మార్చగలిగే 5 మిలటరీ రూల్స్ ఇక్కడున్నాయి.
ఈ మిలటరీ రూల్స్​ని ప్రపంచంలోని సైన్యాలు.. దశాబ్దాలుగా అనుసరిస్తున్నాయి. కొన్ని సాధారణ నియమాలే అయినా.. అవి వ్యక్తిగత జీవితంలోనూ అద్భుతమైన మార్పులు తీసుకురాగలవని చెప్తున్నారు నిపుణులు. అలాంటి రూల్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్​లు వైరల్ అవుతున్నాయి. ఇవి సక్సెస్​తో పాటు.. మానసిక ప్రశాంతతను అందిచడంలో హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు. సెలబ్రెటీలు, నిపుణులు సైతం వీటిని అప్రూవ్ చేస్తున్నారు. అవేంటంటే..
సమయానికి ముందే చేరుకోవడం
మిలిటరీలో ఒక పాపులర్ రూల్ ఉంది. అదే "Early is on time, On time is late, Late is unacceptable." అంటే సమయానికి రావడం కాదు.. కాస్త ముందుగానే సిద్ధంగా ఉండాలి. ఆఫీస్ మీటింగ్ అయినా, ఇంటర్వ్యూ అయినా, పరీక్ష అయినా ముందుగానే అక్కడికి చేరుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీపై ఇతరులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
ప్రిపేర్డ్​గా ఉండాలి..
"Proper preparation prevents poor performance" అనే మరో మిలిటరీ రూల్ కూడా ఉంది. ఎగ్జామ్, జాబ్ ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ లేదా బిజినెస్ మీటింగ్.. ఇలా ఏదైనా సరే ముందుగా ప్రిపర్డ్​గా ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే లక్ కంటే ప్రిపరేషనే మీ విజయాన్ని ఎక్కువగా నిర్ణయిస్తుంది.
వేగం ముఖ్యం కాదు..
"Slow is smooth, Smooth is fast." ఈ మాట వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇందులో గొప్ప అర్థం ఉందని చెప్తారు. చాలా మంది పనిని త్వరగా పూర్తి చేయాలనే తొందరలో తప్పులు చేస్తుంటారు. కాబట్టి ఆ తప్పులను సరిదిద్దేందుకు మళ్లీ సమయం వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి మొదటి నుంచే జాగ్రత్తగా, పద్ధతిగా పని చేస్తే చివరికి సమయం ఆదా అవుతుంది.
పరిస్థితులకు అనుగుణంగా మారడం
జీవితంలో ప్రతిదీ మనం అనుకున్నట్లు జరగదు. అలాంటి సందర్భాల్లో "Improvise, Adapt, Overcome" అనే మిలిటరీ సూత్రం బాగా ఉపయోగపడుతుంది. సమస్యలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా కొత్త మార్గాలు వెతకడం, పరిస్థితులకు అనుగుణంగా మారడం, పరిష్కారాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. నేటి పోటీ ప్రపంచంలో ఈ నైపుణ్యం ఉన్నవారే ఎక్కువగా ముందుకు వెళ్తున్నారు.
సానుకూల మార్పులు..
మిలిటరీలో నాయకత్వానికి సంబంధించిన ఒక గొప్ప భావన ఉంది. Leave every situation better than you found it. అంటే మీరు పనిచేసే ఆఫీస్, మీ టీమ్, మీ కుటుంబం లేదా సమాజం.. ఎక్కడైనా మీరు ఉండడం వల్ల చిన్నపాటి సానుకూల మార్పు అయినా తీసుకురావాలి. నిజమైన నాయకత్వం పదవిలో కాదు.. ఇతరులకు ఉపయోగపడే మార్పు తీసుకురావడంలో ఉంటుంది.
Read Entire Article