Gunde Ninda Gudi Gantalu: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "గుండెనిండా గుడిగంటలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 8న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలుని దూరం పెట్టిన మీనా

ప్రభావతి రోహిణిని పిలిచి వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి.. వ్రతం కోసం ఏం ఏం రెడీ చేసుకోవాలో చెప్తుంది. ఈ వ్రతం అయినా సరిగ్గా చేస్తే నువ్వు చేసిన మోసం తప్పులు కాస్తో కూస్తో క్షమించబడతాయి. అమ్మవారి కటాక్షం మీ మీద ఉంటుంది. అన్నీ చెప్పినట్లు చేయ్ అని ప్రభావతి అంటే రోహిణి సరే అంటుంది. మీనా స్నానం చేసి చీర కట్టుకొని వెనక్కి తిరిగి తల తుడుచుకుంటూ ఉంటే బాలు మీనాని హగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ రోజు వ్రతం దూరం దూరం ఏమీ కుదరవు అని అంటుంది. రాత్రికి కూడా ఏం లేదా అని బాలు అడుగుతాడు. ఇక మీనా బాలుని బయటకు పంపేస్తుంది. బాలు బయటకు వెళ్లే టైంకి శ్రుతి కూడా మనోజ్‌ని పంపేస్తుంది.

చూడటానికి చాలా బాగుంది..

ప్రభావతి ముగ్గురు కోడళ్లు వ్రతం చేయడానికి రెడీ అవుతారు. మౌనిక రెడీ అయి కిందకి వస్తే అందరూ చూస్తూ ఉండిపోతారు. మొదటి సారి నువ్వు ఇంట్లో ఇలా తిరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది.. చూడటానికి చాలా బాగుంది అని మీనా అంటుంది. మౌనికని చూసి ప్రభావతి మురిసిపోతే రూపాయి కూడా ఇవ్వకుండా పంపారు కదా ఇలాగే చూస్తారు అని శ్రుతి అంటే మీ ముగ్గురు కూడా రూపాయి తేకుండా వచ్చేశారుగా అని ప్రభావతి అంటుంది. ఇక మౌనిక ప్రగ్నెంట్ కాబట్టి అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. పుట్టబోయే బిడ్డని ఇలా చూసుకుంటాం అలా చూసుకుంటాం అని సందడి చేస్తారు.

నీకు బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయ్..

ప్రభావతి రోహిణిని పూజ ఏర్పాట్లు చూసుకోమని చెప్పి తిట్టి పంపేస్తుంది. తర్వాత మౌనికతో నీ దగ్గర ఎంత బంగారం ఉంది.. ఎన్ని నగలు ఉన్నాయి.. ఎన్ని చీరలు ఉన్నాయి అని లెక్కలు అడుగుతుంది. బాలు తల్లి మీద సెటైర్లు వేస్తాడు. మౌనికతో నీకు కొడుకు పుడితే నా కూతురికి ఇస్తావా అని అడిగితే ముందు కూతుర్ని కను అన్నయ్యా అని మౌనిక సెటైర్ వేస్తుంది. మీనా పని చేస్తూ ఉంటే బాలు అక్కడికి వెళ్తాడు. మీనా నడుం కనిపించడంతో బాలు పట్టుకోవాలని వెళ్తాడు. ఇంతలో మీనా చూసి బాలుకి ఒక్కటిస్తుంది. తర్వాత మీనా పడిపోబోతే బాలు పట్టుకొని వ్రతం ముట్టుకోవద్దు అన్నావ్ కానీ చూశావా ఎలా అయిందో అని బాలు అంటాడు. ఇక బాలు మీనాల రొమాన్స్ చూసి రోహిణి అందరూ బాగున్నారు నేనే ఇలా అయిపోయా అని మనోజ్ దగ్గరకు వెళ్తుంది.

నీతో వ్రతం చేయను..

మనోజ్ రోహిణిని పట్టించుకోడు. ఇద్దరం వ్రతం చేయాలి మనోజ్ అని రోహిణి అంటే నీతో పూజ అంటేనే నాకు చిరాకు అని మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రోహిణి, మౌనిక వంటలు చేస్తుంటే పక్కనే రోహిణి చూస్తూ ఉంటుంది. ఇంతోల ప్రభావతి వచ్చి మలేషియా మంత్రగత్తె అలాగే ఉంది నా కూతురితో పని చేయిస్తుంది అని రోహిణిని తిడుతుంది. ఇప్పుడే ఇంట్లో ఒక దరిద్రురాలు ఉంది అంటే మరొకటి తయారైంది అని అంటుంది. ఒక్క నిమిషం ఆగండి శ్రుతిని పిలుస్తా మీకు సమాధానం చెప్తుంది అని మీనా అంటే దానికి పని చెప్పమని చెప్పా అంతే అని ప్రభావతి అంటుంది. ఈ ఇంట్లో నీలా నా పరిస్థితి మారక ముందే ఏదో ఒకటి చేస్తా మీనా అని రోహిణి మీనాని హర్ట్ చేసి వెళ్లిపోతుంది. ఇక మీనా, శ్రుతి, మౌనిక సరదాగా మాట్లాడుకుంటారు. రోహిణి వదినను అమ్మ నెత్తిన పెట్టుకునేది కదా ఇప్పుడేంటి ఇలా తిడుతుంది అని మౌనిక అడిగితే శ్రుతి మొత్తం చెప్పేస్తుంది. అదంతా విని రోహిణి రగిలిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.