Gunde Ninda Gudi Gantalu March 4th Episode: డోర్ బయట బాలు, చింటూ డోర్ తీస్తే రోహిణి దొరికేసినట్టే! సుగుణమ్మ రియాక్షన్ ఏంటి - గుండెనిండా గుడిగంటలు మార్చి 04 ఎపిసోడ్

1 month ago 6
ARTICLE AD

Gunde Ninda Gudi Gantalu 2025 March 4th Episode Telugu Serial

మౌనిక మొక్కు తీర్చలేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ప్రభావతి. మొక్కులు చెల్లించేందుకు తీసుకురావాల్సిన ఏవీ తీసుకురారు. రోహిణి నీకు చెప్పాను కదా అని ప్రభావతి అంటే నాకు అర్థంకాలేదు అంటుంది రోహిణి. ఆ తర్వాత మీనా మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. అయినప్పటికీ నోటికి పనిచెబుతుంది ప్రభావతి..సమాధానం చెప్పి నోరుమూయిస్తారు సత్యం, మీనా. మౌనిక కూడా మీనాను సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే భరించలేకపోతుంది ప్రభావతి. గుడిలో మొక్కులు తీర్చి కూర్చున్న తర్వాత కూడా మీనాను తిడుతుంది ప్రభావతి. ప్రభావతిపై సెటైర్స్ వేస్తాడు బాలు. మర్యాద ఇవ్వడం లేదని ఫైర్ అయిన ప్రభావతితో ఓ ఆట ఆడుకుంటుంది శ్రుతి. మిమ్మల్ని చూస్తుంటే గౌరవం , మర్యాద పెరిగిపోతోంది అత్తయ్యగారు అంటూ ఆడేసుకుంటుంది. మీనా వదినకు మాత్రమే ఇలా సాధ్యం అని మౌనిక పొగడడంతో.. మాకు అలవాటు లేదు మేం మలేషియాలో ఉన్నప్పుడు మా పనులేవీ మేం చేసుకోలేదు అంటుంది రోహిణి. అందరూ పనులు చేస్తుంటే నువ్వు ముఖానికి సున్నం కొట్టేదానివా అని సెటైర్ వేస్తాడు బాలు. ఆ తర్వాత వంట ఏర్పాట్లు చేస్తారు

ఆ ఏర్పాట్లు ఏవో చూడండి నాకు పని ఉంది బయటకు వెళతా అంటాడు మనోజ్. నువ్వు ఇక్కడ లేకపోతే బావోదు..నేను వెళ్లి విద్య దగ్గర వడ్డీ వసూలు చేసుకుని వస్తాను అని నచ్చచెప్పి గుడిలోనే మనోజ్ ని ఉంచేస్తుంది. అక్కడి నుంచి బయలుదేరుతుంది రోహిణి. కంగారుగా ఆటోలో వెళుతుండగా చూస్తాడు రాజేష్. రోహిణి ఏంటి కంగారుగా వెళుతోంది ఈ విషయం బాలుకి చెప్పాలి అనుకుంటూ కాల్ చేస్తాడు. చింటూ దత్తత విషయంలో సుగుణమ్మ మిమ్మల్ని చాలా మాటలు అన్నాదని చెప్పావుకదా.. ఆమె ఊరెళ్లలేదు ఇప్పుడే రోడ్ నంబర్ 7లోకి చింటూని తీసుకెళ్లింది. అదే రూట్ లోకి రోహిణి వెళ్లిందని చెబుతాడు. అవునా..ఇదేదో తేల్చుకోవాల్సిన విషయమే అనుకుంటాడు బాలు

అంతా పనుల్లో ఉంటారు..మౌనిక తో కూర్చుని మాట్లాడుతాడు తండ్రి సత్యం. అమ్మా ఎలా ఉన్నావ్? నువ్వు తల్లివి కాబోతున్నావ్ అనగానే మీ ఆయన ముఖంలో సంతోషం లేదేంటి? ఏం జరిగింది? నువ్వు అక్కడ బావున్నావా? మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? అక్కడ కష్టం ఉన్నా బయటకు చెప్పడం లేదా? నువ్వు భరిస్తూ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు..నేను ఏమనుకుంటానో అని ఆలోచించవద్దు..నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటాడు సత్యం. తండ్రి మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటుంది మౌనిక. ఏం జరిగిందమ్మా అని కంగారుపడతాడు సత్యం. మౌనిక కవర్ చేస్తుంది..ఏం లేదు నాన్నా...నాకు పెళ్లైనప్పటినుంచి మీతో స్పెండ్ చేసే టైమ్ మా ఆయన ఇవ్వలేదు, ఈ రోజు ఇంత తీరిగ్గా సమయం దొరికింది..నీ మాటలు విని ఏడుపొచ్చింది అంటుంది. ఇంతలో ప్రభావతి వచ్చి ఏం చెబుతున్నారు దానికి.. దానికేం కోటీశ్వరుల కోడలు కదా బాగానే ఉంటుంది అంటుంది. అవును..మా అత్తింటి కిటికీలోంచి తొంగిచూసినట్టు బాగా చెప్పావ్ అంటుంది మౌనిక.

విద్య ఇంటికి వెళ్లిన రోహిణి కొడుకుతో ఆడుకుంటుంది. రోహిణిని చూసి సెటైర్స్ వేస్తుంది తల్లి సుగుణమ్మ. అమ్మ అత్తైంది..చుట్టపు చూపుగా వచ్చిన ఆమె ఎంతసేపు ఉంటుందా అని చూస్తున్నా అంటుంది. వాడి తల్లిని నేను అని రోహిణి అనగానే.. ఆ విషయం బయటచెప్పు అంటుంది. అమ్మా నేను నీతో ఎందుకు ఉండలేను? మీనా ఆంటీ చాలా మంచిది..ఎందుకు అమ్మమ్మతో తిట్టించావ్ ...నేను నీతోనే ఉండేవాడిని కదా.. వాళ్లు దత్తత తీసుకుంటే నాకు ఇద్దరు అమ్మలు ఉండేవారు కదా అంటాడు చింటూ. రోహిణి బాధపడుతుంది. నేను ఆఫీస్ కి వెళుతున్నా అని బయలుదేరుతుంది విద్య. నీకు జీతం వచ్చి ఉంటుంది కదా ఇవ్వు మళ్లీ ఇచ్చేస్తా అంటుంది. ఈ బ్యాండ్ కూడా నాకేనా అంటూనే సరే ఇస్తాలే అంటుంది. ఆ తర్వాత ఆఫీస్ కి వెళతానని బయటకు రాగానే..బాలు కారుకి ఎదురొస్తుంది. నువ్వేంటి ఇక్కడ, చింటూ వాళ్లని చూశావా అడగ్గానే తప్పించుకుని వెళ్లిపోతుంది విద్య. బాలుకి అనుమానం వస్తుంది

గుడికి వచ్చిన మటన్ కొట్టు మాణిక్యం(రోహిణి మేనమామగా యాక్ట్ చేసినవాడు) గుడికి వచ్చి అబద్ధాలు చెప్పకుండా ఉండాలని ప్రతిజ్ఞ చేస్తాడు. వాడు సాష్టాంగ నమస్కారం చేస్తుండగా ఆ పక్కనుంచి వెళుతుంది ప్రభావతి. చూడదు..

మరోవైపు బాలు... చింటూని, పార్లలమ్మని వెతుక్కుంటూ వెళతాడు. రోహిణి కొడుక్కి అన్నం తినిపిస్తుంటుంది డోర్ కొడతాడు బాలు. నేను తీస్తానని వెళతాడు చింటూ... ఇంతలో రోహిణికి కాల్ చేసిన విద్య..బాలు మనింటివైపే వస్తూ కనిపించాడు అంటుంది. మరి చింటూ డోర్ తీశాడా?

Read Entire Article