Gunde Ninda Gudi Gantalu 2025 March 17th Episode Telugu Serial

మరో అబద్ధం చెప్పి బిజినెస్ లో ఎదగాలని ప్లాన్ చేసుకుంటారు మనోజ్, రోహిణి. తాము పేదింటివాళ్లం తెలిస్తే బిజినెస్ డీల్ వెనక్కు వెళ్లిపోతుందని భావించి.. ఇంట్లో అందరి గురించి గొప్పగా చెబుతారు మనోజ్ రోహిణి. తాము చెప్పినట్టే నటించాలని అందర్నీ ఒప్పిస్తారు.

50 కార్లకి ఓనర్ బాలు..భార్య మీనా

పెద్ద రెస్టారెంట్ కి ఓనర్ రవి..భార్య శ్రుతి

బిజినెస్ డీల్ గురించి చెప్పి ఒప్పిస్తారు.. తప్పని పరిస్థితిలో సరే అంటారు సత్యం అండ్ ఫ్యామిలీ. అంతా రెడీ అవుతారు. రోహిణిని చూసి విద్య పొగిడేస్తుంది..నువ్వు ఇంత అందంగా ఉంటావని నాకు ఇప్పుడే అర్థమైంది, ఈ రోజు నువ్వు చాలా రిచ్ గా కనిపిస్తున్నావ్..మనోజ్ కి ఈ డీల్ ఓకే అితే కోటీశ్వరులం అవుతారం అంటుంది రోహిణి. ఈ రోజు సంతోషంగా ఉండడం కాదు..ఎప్పటికీ హ్యాపీగా ఉండాలంటే బాలు దగ్గర్నుంచి ఫోన్ కొట్టేయాలి అంటుంది విద్య. ఆ పనిలో ఉంటారిద్దరు. ఇంతలో మనోజ్ వచ్చి రోహిణి నువ్వు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తాడు.

ప్రభావతిని చూసి కామాక్షి పొగడ్తలవర్షం కురిపిస్తుంది.. నిన్ను ఇలా చూస్తే మళ్లీ పెళ్లిచేసుకుందాం అని అన్నయ్య అడుగుతారు అంటుంది. నువ్వు కూడా బావున్నావు కామాక్షి అంటుంది.

ఆ తర్వాత సత్యం వచ్చి..ప్రభావతిని చూసి కావాలనే ఆటపట్టిస్తాడు. ఏ సినిమాలో హీరోయిన్ మీరు, నాలాంటి ఏజ్ బార్ అయినవాళ్లతో పరాచికాలేంటి? అంటూ ఆటపట్టిస్తాడు.. ఆ ఇద్దర్నీ చూసి కామాక్షి ఓ సాంగేసుకుంటుంది. కామాక్షి ఎంట్రీ ఇచ్చి..వదినను చూడగానే నమ్మలేకపోయారా అంటుంది. ప్రభావతి పక్కకు వెళ్లిపోగానే... ఈ వయసులో అంత డెకరేషన్ అవసరమా , వయసుకు తగ్గట్టుగా ఉండాలి అంటాడు సత్యం.

శ్రుతి, రవి ఎంట్రీ ఇస్తారు.. అలానే చూస్తుండిపోతుంది ప్రభావతి. మీరు చాలా అందంగా ఉన్నారు ఆంటీ అంటుంది శ్రుతి. వాళ్లిద్దర్నీ మెచ్చుకున్న ప్రభావతి.. మీరిద్దరూ చాలా బావున్నారు, మిమ్మల్ని ఈ హోటల్ ఓనర్స్ అన్నా నమ్మేస్తారు అంటుంది.

రోహిణి నీ చేతిలో ఏదో మాయాజాలం ఉంది అందర్నీ కోటీశ్వరుల్ని చేసేశావ్ అంటుంది కామాక్షి. బాలు మీనా ఎక్కడున్నారని అడుగుతారంతా.. ఎలా రెడీ అయినా పూలమ్ముకునే ఫేస్, కారు నడుపుకునే ఫేస్ మారుతుందా ఏంటి అని తీసిపడేస్తుంది. వాడికి అందరి మధ్యలో రావాలంటే సిగ్గుపడుతున్నారేమో..వీళ్ల మధ్య బాలు మీనా చద్దన్నంలో ఉల్లిపాయలా ఉంటారు అంటుంది.

బాలు మీనా బాగా రెడీ అవుతారు.. బాలు సూటేసుకుని వస్తే, మీనా పట్టుచీర కట్టి రెడీ అవుతుంది. ఇద్దరూ కాసేపు ఒకర్నొకరు చూసుకుని మురిసిపోతారు. ఆ తర్వాత హోటల్ కి బయలుదేరుతారు. హోటల్ లో మీనా బాలుపై అక్కసు వెళ్లగక్కుతున్న ప్రభావతి..వాళ్లిద్దర్నీ చూసి అవాక్కవుతుంది. నిజంగా మీనా చాలా బావుంది అంటుంది రోహిణి. నిజంగా బాలు కార్ల కంపెనీ ఓనర్ లా ఉన్నాడు అంటాడు మనోజ్. కార్ల కంపెనీ ఓనర్ ఏంటి అని సత్యం అడుగుతాడు..కవర్ చేస్తుంది రోహిణి. మీ ఇద్దరు సూపర్ గా ఉన్నారు అంటాడు సత్యం. ఓ బస్ డ్రైవర్ కొడుకు అనుకోరు అంటాడు సత్యం.. నీ కొడుకు అని ఎవరూ అనకపోతే ఈ గెటప్ నాకొద్దు అంటాడు బాలు. ఊరికే అన్నా అంటాడు సత్యం.

మీది ఏ విలేజ్ అని గాలి తీసేస్తాడు బాలు.. ప్రభావతి ఉడుక్కుంటుంది. ఇంతకీ ఇది మీ పెళ్లిరోజు సెలబ్రేషనేనా? వేరే బోర్డులు కూడా కనిపిస్తున్నాయ్ అంటుంది కామాక్షి. అంతా కలసి పార్టీ స్టార్ట్ అవుతుందని చూస్తుంటారు. బాలు మీనా ఇద్దరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు..పోన్ కిందపడిపోతుంది. నాకివ్వు ఫోన్ ఫొటోస్ తీస్తానంటుంది రోహిణి. బాలు అవసరం లేదని చెప్పేస్తాడు. మీనా బాలు ఇద్దరూ సెల్ఫీలు తీసుకుంటారు.

పార్టీ అంతా అయిన తర్వాత ఫుల్లుగా తాగేసిన బాలు... నిజం మొత్తం బయటపెట్టేస్తాడు.. ఇది మార్చి 18 బుధవారం ఎపిసోడ్ లో హైలైట్ ....

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు 2026-2027 ! మేషం నుంచి మీనం 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం ఫలితాలు!