Gunde Ninda Gudi Gantalu 2025 February 27 Episode Telugu Serial

బాలు ఫోన్ కనిపించడం లేదని వెతుకుంటారు బాలు మీనా..ఇంతలో మౌనిక రావడంతో ఇంట్లో అంతా సంతోషంగా ఉంటారు. సంజయ్ మాత్రం ఎప్పటిలా మాటలతో చెలరేగిపోతుంటాడు. బాలు ఏమీ మాట్లాడకుండా మీనా కంట్రోల్ చేస్తుంది. బావున్నారా అల్లుడుగారు అని సత్యం అనగానే బాలేకపోతే వెనక్కు పంపించేస్తారా ఏంటి అంటాడు. అల్లుడు చిన్నవాడే అయినా మాటలు చాలా పదునుగా ఉన్నాయ్ అంటుంది సుశీలమ్మ. నాలుగు రోజులు ఉండేలా వచ్చావా అని సుశీలమ్మ అంటుంది. ఆయన ఉంటే నాకేం అభ్యంతరం లేదంటుంది మౌనిక. నాలుగు గంటలు కూడా ఇక్కడ ఉండలేను అంటాడు సంజయ్. మరి బొమ్మల కొలువు సంగతేంటి అనగానే బొమ్మలతో ఆడుకునే అవసరం నాకు లేదంటాడు సంజయ్. ఇంతలో బాలుని తీసుకొచ్చి పలకరించమని చెబుతుంది మీనా. చాలా ఇబ్బందిగా మాట్లాడుతుంటాడు బాలు. కారు కండీషన్లోనే ఉందా? కారు డీజిలా పెట్రోలా అని ఏదేదో మాట్లాడుతుంటాడు. మౌనికపై కోప్పడతాడు సంజయ్.

ఏదైనా మాట్లాడమంటే పెట్రోలు , కారు అంటూ మాట్లాడతారేంటి అంటుంది మీనా. ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటూ రూమ్ లో కి వెళ్లి ప్రాక్టీస్ చేస్తాడు బాలు. గతంలో నేను నిన్ను తన్నాను..నువ్వు నన్ను కట్టిపడేశావ్..అంటూనే ఇక్కడ కూడా తన్నడమే ఉంది అనుకుంటాడు. ఇవేమీ వర్కౌట్ అయ్యేలా లేదు..పైగా నీ మొహానికి సూట్ కాదనుకుంటాడు. నువ్వు ఎంత అనుకున్నా వాడిదగ్గర తగ్గి ఉండలేవు..కాకపోతే వాడిని కొట్టకుండా పంపించు అంటాడు

పిల్లంతా ఆడుకుంటారు..తనతో ఎవరూ ఆడడం లేదంటూ ఓ పిల్ల అందరకీ ప్రభావతిలా శాపనార్థాలు పెడుతుంది. ఇంతలో రోహిణి దాచేసి ఓ మూలన పెట్టిన బాలు ఫోన్ ఆ పిల్లకు దొరుకుతుంది.. అందులో వీడియో తీస్తూ తిరుగుతూ ఉంటుంది. గమనించిన రోహిణి వెళుతుంటే ఆపేస్తారు ప్రభావతి, మనోజ్. ఇక్కడి నుంచి లేవకూడదు అని చెప్పినా వెళుతుంది. కూర్చోమ్మా నీకే ముందు పిల్లలు పుట్టాలి, నీకే ఆస్తి రావాలి కూర్చోమ్మా కూర్చో అని సెటైర్ వేస్తుంది సుశీలమ్మ. ఆ ఫోన్ నేను తీసుకుంటాలే అని వెళుతుంది విద్య

అంతా హోమం దగ్గర కూర్చుంటారు..అక్కడ కూడా సెటైర్స్ వేస్తుంటాడు బాలు. మీనా , ప్రభావతి కంట్రోల్ చేస్తుంటారు. అగ్నిలో ఆజ్యం పోయడం అంటే మా వదిన ప్రభావతికి వెన్నతో పెట్టిన విద్య అని సెటైర్ వేస్తుంది మీనాక్షి. అగ్నిలో సమిధలు వేయండి అని పూజారి చెప్పడంతో మా ఇంటి అల్లుడు ఆయనే ఫస్ట్ వేయాలి అంటాడు బాలు. బాలు ఫోన్ తీసుకెళ్లి ఆడుకుంటున్న పిల్ల దగ్గరకు వెళ్లి విద్య ఫోన్ అడుగుతుంది. నువ్వు ఫోన్ దొంగవా ఇవ్వను అనేసి వెళ్లిపోతుంది. హోమం పూర్తవుతుంది..

బాలు వెళ్లి జ్యూస్ ఇస్తాడు..ఇందులో ఏం కలిపావ్ అని అవమానిస్తాడు సంజయ్. గతంలో ఏదో జరిగిపోయింది, నేను మారిపోయాను, నా వైపు నుంచి జరిగిన తప్పులన్నింటికీ సారీ అని జ్యూస్ ఇస్తాడు. మౌనిక రాగానే...మీ అన్నయ్య టూమచ్ మర్యాద చేస్తున్నాడు అంటాడు. నిజంగానే మర్యాద ఇస్తున్నాడు అంటుంది మౌనిక.

పిల్ల మాత్రం బాలు ఫోన్ వదలకుండా పట్టుకుని తిరుగుతూ వీడియోలు తీస్తుంటుంది. రోహిణి, విద్య అడిగినా ఇవ్వదు. నేను దొంగలకు ఫోన్ ఇవ్వను అనేస్తుంది. భోజనం దగ్గర కూర్చుని సంజయ్ కి తెగ మర్యాదలు చేస్తుంటాడు బాలు. విసుక్కుంటాడు సంజయ్

భోజనం చేసిన తర్వాత ఆ చిన్నారి బయటకు వెళుతుంది..ఆ వెనుకే వెళ్లిన రోహిణి... ఓ అంకుల్ ఐస్ క్రీమ్ ఇచ్చి ఫోన్ తీసుకున్నాడు అని చెబుతుంది.

ప్రభావతి స్టూడెంట్స్ వస్తారు..మీకోసం సౌండ్ బాక్సులు తీసుకొచ్చాను పాట పాడాల్సిందే అంటాడు. అంతా భయపడతారు. పెళ్లి చూపుల్లో నా పాట నచ్చే కదా పెళ్లి చేసుకున్నావ్ అని సత్యాన్ని అడిగితే..పెళ్లి తర్వాత పాడకూడదు అనే కండిషన్ తో పెళ్లి చేసుకున్నాం అంటుంది సుశీలమ్మ. ప్రభావతి పాటందుకోగానే అంతా భయపడిపోతారు. సత్యం మాత్రం వన్స్ మోర్ అని చప్పట్లు కొడతాడు. ఇంతలో బాలు వెళ్లి అదేంటి నాన్నా అలా అంటావ్ అనగానే.. చెవిలోంచి దూదులు తీస్తాడు. నీ తెలివి మాకు లేకపోయింది అంటాడు బాలు. శ్రుతి, రోహిణిని పాడమని బతిమలాడుతుంది ప్రభావతి..మీనాను పాడమని తల్లి అనగానే సెటైర్స్ వేస్తుంది ప్రభావతి. మీనా పాడుతుంది...అంతా మెచ్చుకుంటారు

సంజయ్ దగ్గరకు వెళ్లి మర్యాదలు చేస్తాడు మీనా. ప్రసాదం తినాల్సిందే అని అంతా చెప్పడంతో తినాల్సిందే అంటుంది సుశీలమ్మ. ఇంతలో మౌనిక వాంతి చేసుకుంటుంది..ప్రభావతి మీనాపై నిందలేయడం మొదలుపెడుతుంది. సత్యం నువ్వు తాతవి కాబోతున్నావ్ అంటుంది సుశీలమ్మ. సంజయ్ షాక్ అవుతాడు. బావా నువ్వు సూపర్ బావా అంటూ సంజయ్ ని తెప్పేస్తాడుబాలు. అందరం కలసి సెల్ఫీ దిగుదాం అంటారు. బాలు ఫొటో తీస్తుంటే..ఆ పాప వచ్చి రోహిణికి తనే ఫోన్ తీసుకున్నాడు అంటుంది. షాక్ అవుతుంది రోహిణి. ఆ తర్వాత మౌనిక వెళ్లిపోతుంటే.. నీకు కొడుకు పుట్టాలి, నేను కూతుర్ని కంటాను..ఇద్దరికీ పెళ్లి చెద్దాం అంటాడు బాలు

ఇంట్లో వేడుక బాగా జరిగిందని మీనాతో చెప్పి సంతోషిస్తాడు బాలు. బొమ్మలకొలువు కన్నా మౌనిక నెలతప్పింది అనే మాటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది అంటుంది. తనెంత అదృష్టం చేసుకుంది అంటుంది మీనా. మౌనిక నాకు ఇప్పటికీ పసిపాపలానే అనిపిస్తుంది అంటాడు బాలు. సంజూతో మీరు మంచిగా ఉండండి వీలైనప్పుడల్లా అక్కడకు వెళదాం అంటుంది మీనా. నువ్వు పాట భలే పాడావ్ తెలుసా అని మెచ్చుకుంటాడు.