గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 30 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 30 Episode

ఆదర్శ దంపతుల పోటీలో బాలు మీనా గెలవడం చూసి రోహిణి, మనోజ్, ప్రభావతి కుళ్లుకుంటారు. వాళ్ల అక్కసు చూసి బాలు దండకం మొదలుపెడతాడు. ఇంతలో సత్యం వస్తాడు. లక్ష గెలిస్తే బెస్ట్ కపుల్ అయిపోతారా? వారానికోసారి గొడవపడే వీళ్లు మంచి భార్య భర్త ఎలా అవుతారు? అని ప్రభావతి, మనోజ్ అంటారు. ఇద్దరి మధ్యా గొడవలు రాలేదంటే ఏదో దాస్తున్నారని అక్కడ జడ్జిలు చెప్పారని అంటాడు బాలు. నిజమా అని ప్రభావతి రోహిణిని అడుగుతుంది.. సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది రోహిణి.

ఆ తర్వాత కూడా ప్రభావతి వచ్చి బాలుని కోపంగా చూస్తుంది. మట్టికి మెదడుకి తేడా ఉంటుంది కదా..దానికి ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుందిలే..నువ్వు పెంచిన పెద్దకొడుకు లక్షలు మింగడమే తప్ప ఏనాడైనా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడా? అని సత్యం అడుగుతాడు. ఆ రోజు కూడా వస్తుంది..విమానంలో తిప్పుతాడు మనల్ని అంటుంది ప్రభావతి. డబ్బు నాకు ఇస్తాను అన్నాడు చాలు.. ఆ మాటే చాలు..ప్రేమ చాలు..నాకు అవసరం లేదంటాడు సత్యం. ఈ లక్ష రూపాయలు మేం ఏం చేసుకుంటాం మావయ్యా అని మీనా-బాలు అంటే.. మీకోసం రూమ్ కట్టుకోవాలి అనుకుంటున్నారు కదా అందుకోసం ఉపయోగించండి. అదే న్యాయం..లక్షలోంచి ఒక్కరూపాయి కూడా ఇంటికోసం ఖర్చు చేయొద్దు అంటాడు సత్యం. రా మీనా.. పైకి వెళ్లి చూసుకుందాం అంటాడు బాలు. ఇంకా రూమ్ కట్టలేదు కదా అని మీనా అనగానే.. ఎంతవరకూ కట్టగలమో చూద్దాం అంటాడు బాలు. హా వెళ్లండి..గృహప్రవేశానికి దున్నపోతుని తీసుకురావాలేమో ఆలోచించుకోండి అని సెటైర్ వేస్తుంది ప్రభావతి. ఎందుకు..మన మనోజ్ గాడు ఉన్నాడుగా అని సెటైర్ వేసి వెళ్లిపోతారు బాలు మీనా. ఆ తర్వాత బాలుపై అక్కసు వెళ్లగక్కుతుంది ప్రభావతి..క్లాస్ వేస్తాడు సత్యం..

పోటీల్లో వాళ్లు అడిగిన ప్రశ్నలకు నేను తెలివిగా సమాధానం చెప్పాను కానీ వాళ్ల బుర్రకు ఎక్కలేదంటాడు మనోజ్. మొహం చూడు..నీకు అన్ని తెలివితేటలే ఉంటే నిందలు పడాల్సిన అవసరం నీకేంటి? మాటలు పడాల్సిన అవసరం నాకేంటి? అయినా నువ్వు అన్నింటిలోనూ లేటే కదా.. నొప్పులు వచ్చిన రెండు రోజులకు పుట్టావ్..నడక , మాట అన్నీ లేటే అని ఫైర్ అవుతుంది. పాలడబ్బా మొహం వేసుకుని నా ముందు నిల్చున్నావేంటి అని ఫైర్ అవుతుంది. ఇంతకీ పోటీలో మార్కులు వేసినవాళ్లు ఏమన్నారని అడుగుతుంది... నా అంత జీనియస్ ని చూడలేదన్నారు అంటాడు. అది కాదు..భార్య భర్త గురించి ఏం చెప్పారు? భార్య-భర్త మధ్య గొడవలు రావడం లేదంటే ఇద్దరి మధ్యా ఏవో రహస్యాలున్నాయి? నువ్వు ఏమైనా దాచుతున్నావా అని మనోజ్ ని అడుగుతుంది ప్రభావతి.

రూమ్ లో దీనంగా కూర్చుని ఉంటుంది రోహిణ...ఇంతలో మనోజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. మనం లక్ష రూపాయలు గెలిచి ఉండాల్సింది అని బాధపడుతుంది. అంతా బాలు మీనాను పొగుడుతున్నారు..అవన్నీ మనకు రావాల్సింది కదా అంటుంది. మనమే బెస్ట్ కపుల్..మనకు తెలుసుకదా.. అయినా బాలు మీనా గెలవడం ఏంటి? అనుకుంటారు. అత్తయ్య మనసులో మనం మంచి భార్య భర్తగా ఉన్నాం...ఈ రోజు నుంచి ఆ ప్లేస్ ని వాళ్లు కొట్టేస్తారేమో అనిపిస్తోంది అంటుంది రోహిణి. వీళ్లకు బ్రెయిన్ లేదు.. ఆ జడ్జిలకు బ్రెయిన్ లేదు..మనమే బెస్ట్ కపుల్ అంటాడు మనోజ్. నువ్వు నాకు దొరకడం అదృష్టం అంటాడు మనోజ్. నేను ఓ అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉన్నానని తెలిసినా ఒప్పుకున్నావ్.. నా తప్పులు క్షమించావు..ఇంతకన్నా ఏం కావాలి అంటాడు మనోజ్. నా లైఫ్ లో జరిగే ప్రతి మంచి విషయంలోనూ నువ్వు ఉన్నావ్ అని పొగిడేస్తాడు. నేను మంచి భర్తనేనా అని అడిగితే.. నువ్వు నాకు మంచి లైఫ్ ఇచ్చావ్, మంచి ఫ్యామిలీ ఇచ్చావ్ అంటూ పొగుడుతుంది. అయితే మనిద్దరి మధ్యా గొడవలు రాలేదంటే.. ఏదైనా దాచుతున్నామా? అని అడుగుతాడు. నీకు అలా అనిపిస్తోందా అని రోహిణి అడుగి మాట దాటేస్తుంది.

శ్రుతి రవి మధ్య డిస్కషన్ జరుగుతుంది.. ఇద్దరం ముందుగా మాట్లాడుకోలేదు అందుకే ఓడిపోయాం అనుకుంటారు. నేను మాట్లాడేది అర్థంకాలేదు నిన్న నేను అర్థం చేసుకోవాలా అని ఫైర్ అవుతుంది. కాలం మారుతున్నా మనుషులు ఎందుకు మారడం లేదు. పిల్లల గురించి ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా స్టేజ్ పై అలా మాట్లాడావు ఎందుకు అని అడుగుతుంది. అది మనిద్దరి నిర్ణయం అందరి ముందూ ఎందుకు చెప్పాలి అంటాడు. సేరేలే నాకు అసలు పిల్లలు వద్దు అంటాడు..అంతా నీ ఇష్టమేనా..నాకు కావాలి పిల్లలు అని పట్టుబడుతుంది శ్రుతి.. షాక్ అవుతాడు రవి

హాల్లో ముచ్చట్లు పెట్టుకుంటారు బాలు మీనా...

రేపటి ఎపిసోడ్ లో దొరికిపోయింది రోహిణి.. కొడుకు పుట్టినరోజుకోసం బట్టలు కొనేందుకు వెళ్లి..ప్రభావతి-కామాక్షికి ఎదురుపడింది.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి