Gunde Ninda Gudi Gantalu 2025 April 21st Episode Telugu Serial - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 21 ఎపిసోడ్

కరెంట్ షాక్ కొట్టడంతో ఇంట్లో అందరూ ప్రమాదంలో పడతారు..మీనా వాళ్లని కర్రతో బాది అందర్నీ కాపాడుతుంది. ఆ సంఘటన తర్వాత చేయి నొప్పి ఇంకా తగ్గలేదని బాధపడుతుంది ప్రభావతి. ఇదంతా నీవల్లే అని మనోజ్ పై కోప్పడుతుంది. షోరూమ్ కి వెళ్లాలి టైమ్ అయింది అందుకే మెయిన్ స్విచ్ఛాన్ చేశాను అంటాడు. వాడు మంచిపొజిషన్లో ఉండాలనే కదా నువ్వు కోరుకున్నావ్ అంటుంది కామాక్షి. వాడు మాత్రం నేను రేపో మాపో పోతాను అంటున్నాడు అంటుంది. ఇదంతా షాప్ దగ్గర దొరికిన కోడిగుడ్ల ప్రభావమే అని, పూజ చేసి తీరాల్సిందే అంటాడు మనోజ్. అదృష్టంతో బయటపడ్డాం అని ప్రభావతి అనగానే..బాలు వచ్చి మీనాకు దక్కాల్సిన క్రెడిట్ అదృష్టం అకౌంట్లో వేసుకుంటారా అని ఫైర్ అవుతాడు. సరే అంతా మీనా గొప్పే..సరేనా అంటుంది రోహిణి. థ్యాంక్స్ అనేది వెళ్లిపోతాడు బాలు. ఆ తర్వాత మళ్లీ స్వామీజీ చెప్పిన పరిహారం చేద్దాం అని ఒప్పిస్తాడు మనోజ్. కామాక్షి భయపెట్టేయడంతో ప్రభావతి ఒప్పుకోవాల్సి వస్తుంది

మీనా స్టార్ట్ చేసిన డెకరేషన్ బిజినెస్ కు ఫస్ట్ ఆర్డర్ వస్తుంది. వెంటనే హాల్ కి వెళ్లి పనికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుంది. పనిపై మీ నిబద్ధత చూస్తుంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారని ప్రశంసిస్తాడు. అడ్వాన్స్ గా 10వేల రూపాయలు ఇస్తాడు. మీనా ఆనందంగా ఇంటికి బయలుదేరుతుంది. స్వీట్స్ తీసుకెళుతుంది. ముందుగా సత్యం వద్దకువెళ్లి..నాకు తండ్రిలేని లోటు తెలియకుండా ప్రతి సంబర్భంలోనూ అండగా నిలిచారంటుంది మీనా. ఆయనకు షుగర్ ఉందికదా..స్వీట్స్ ఇస్తావా ఏంటి అని అడ్డేస్తుంది ప్రభావతి. ఒక్క స్వీట్ తింటే ఏంకాదులే అని సంతోషంగా తీసుకుంటాడు సత్యం. తనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చిందని మీనా చెప్పినా.. ఏదో ప్రపంచ రికార్డ్ కొట్టినట్టు మాట్లాడుతున్నావ్ అని అవమానిస్తుంది ప్రభావతి. గాడిదకు ఏం తెలుసు..గంధం వాసన అని సెటైర్ వేస్తాడు సత్యం. ఇంతలో రోహిణి వచ్చి..విషయం తెలుసుకుని కంగ్రాట్స్ చెబుతుంది. మనోజ్ వెటకారంగా మాట్లాడుతాడు. మీ అమ్మకు చదవులేదు..నీకైనా మెచ్చుకోవడం రావాలికదా అని సెటైర్ వేస్తాడు సత్యం. ఇంతలో శ్రుతి, రవి వచ్చి మీనాను అభినందిస్తారు. మా రెస్టారెంట్ కి వచ్చే ఆర్డర్లు కూడా మీకే ఇస్తానని ప్రోత్సహిస్తాడు రవి.

ఈ సందడి మధ్య ఇంటికి వచ్చిన బాలు.. స్వీట్స్ పంచడం చూసి ఏంటి తల్లికాబోతున్నావా అని కంగ్రాట్స్ చెబుతాడు. కొత్త బిజినెస్ ఆర్డర్ వచ్చిందని చెప్పడంతో సంతోషిస్తాడు. అడ్వాన్స్ ఇచ్చిన 10వేల రూపాయలు చూపించడంతో ప్రభావతి కుళ్లుకుంటుంది. ఈ రోజు మటన్ బిర్యానీ చేయాలంటూ డబ్బులిస్తాడు బాలు.

ఓ మంచి మటన్ షాప్ కి తీసుకెళ్లమని మీనా తన స్నేహితురాలిని అడుగుతుంది. ఆమె..మటన్ కొట్టు మాణిక్యం షాప్ కి తీసుకెళుతుంది. మీనాను చూసి అవాక్కైన మాణిక్యం..ముఖానికి టవల్ కట్టుకుని, మాట్లాడకుండా సైగలు చేస్తుంటాడు.మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది..ఓసారి ముఖం చూపించండి అంటుంది మీనా. మాణిక్యం వెంటనే మటన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇంట్లో బిర్యానీ చేసేందుకు మీనా-బాలు ట్రై చేస్తుంటే..ఇంట్లో వ్రతం చేస్తున్నాం బిర్యానీ చేయడానికి వీల్లేదు అంటుంది ప్రభావతి. బయట వండుకుంటాం అని బాలు అన్నా అంగీకరించదు ప్రభావతి. వాసన వస్తుందని చెబుతుంది. ముక్కుల్లో దూది పెట్టుకోండి అనేసి బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నేను హెల్ప్ చేస్తాను వదినా అని రవి సపోర్ట్ చేస్తాడు. మీనా, శ్రుతి, రవి, బాలు..నలుగురు ఎంజాయ్ చేస్తూ బిర్యానీ చేసుకుంటారు. మనోజ్ కి నోరూరిపోతుంది. రోహిణి రియాక్ట్ అవుతూ..నా పేరు చెప్పనందుకు థ్యాంక్స్ లేదంటే ఈ రోజు నేను కూడా ఉపవాసం ఉండాల్సి వచ్చేది..హాయిగా బిర్యానీ తింటాను అంటుంది. నువ్వు ఉపవాసం పేరుతో నా నోటికి అడ్డం వేశావని ప్రభావతి ఫైర్ అవుతుంది. అందరూ కలసి బిర్యానీ తింటారు..ప్రభావతి,మనోజ్ మాత్రం ఉపవాసం పేరుతో పస్తులుంటారు.

విద్య ఇంటికి వెళ్లిన మేకమామ...ఈ రోజు మీ ఇంట్లో బిర్యానీ కదా అని రోహిణితో అంటాడు. నీకెలా తెలుసు అని అడగ్గానే మీనా మా మటన్ షాప్ కి వచ్చిందంటాడు. నిన్ను చూసిందా అని అడిగితే లేదంటాడు మేకమామ. నేను అబద్ధాలు చెప్పను కానీ మీవల్ల చెప్పాల్సి వస్తోందంటాడు.