GST 2025 Impact On TVS Two Wheelers: జీఎస్‌టీ 2025 సంస్కరణల కారణంగా టూవీలర్‌ మార్కెట్లో ఒక కొత్త జోష్‌ కొనసాగుతోంది. TVS Motor Company, తన స్కూటర్లు & బైకుల ధరలు తగ్గించింది. పండుగ సమయంలో వచ్చిన ఈ తగ్గింపులు యూత్‌ నుంచి ఫ్యామిలీ బైకర్స్‌ వరకు అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి.

TVS Jupiter ధరలు మరింత కట్
పాపులర్‌ స్కూటర్‌ TVS జూపిటర్‌ 110 వేరియంట్‌ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఇంతకుముందు ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 78,881 ఉండగా, ఇప్పుడు రూ. 72,400 కి లభిస్తోంది. అంటే కస్టమర్‌కు రూ. 6,481 వరకు లాభం. Jupiter 125 కూడా రూ. 82,395 నుంచి రూ. 75,600 కి పడిపోయింది. ఈ తగ్గింపు నిజంగా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌కి పెద్ద రిలీఫ్‌.

ఎన్‌టార్క్ యువతకు గుడ్‌న్యూస్‌
యువతలో బాగా పాపులర్‌ అయిన TVS Ntorq స్కూటర్‌ కూడా చవగ్గా మారింది. Ntorq 125 వేరియంట్‌ ధర రూ. 80,900 కి దిగొచ్చింది. ఇంతకుముందు కంటే రూ. 7,242 తగ్గింది. ఇక, TVS Ntorq 150 మోడల్‌ ధర రూ. 1,09,400 గా ఉంది & ఇది కూడా దాదాపు రూ. 9,600 తగ్గింపుతో లభిస్తోంది. స్పోర్టీ లుక్‌, అగ్రెసివ్‌ స్టైల్‌తో ఉండే ఎన్‌టార్క్‌ ఇప్పుడు రేటు తగ్గుదలతో మరింత ఆకర్షణీయంగా మారింది.

Raider, Starcity, Radeon - ప్యాకేజ్ డీల్స్‌
టీనేజర్స్‌లో హిట్‌ అయిన TVS రైడర్‌ ధర ఇప్పుడు రూ. 80,900 మాత్రమే. ఇది చాలా మందికి పర్ఫెక్ట్‌ ఆప్షన్‌. అలాగే... TVS Starcity రూ. 72,200కి; TVS Radeon & TVS Sport రెండూ రూ. 55,100కి లభిస్తున్నాయి. ఈ బైకులు మైలేజ్‌, కంఫర్ట్‌ రెండింటినీ కోరుకునే వారికి మంచి డీల్‌.

XL 100 & Zest కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ
గ్రామీణ ప్రాంతాల్లో, హెవీ డ్యూటీ పనులకు ఎక్కువగా వాడే TVS XL 100 కూడా ఇప్పుడు రూ. 43,400 కి అందుబాటులో ఉంది. ఇది దాదాపు రూ. 4,354 తగ్గింపుతో లభిస్తోంది. స్టైలిష్‌ లేడీస్‌ స్కూటర్‌గా పేరుగాంచిన TVS Zest ధర రూ. 70,600 కి పడిపోయింది.

GST రిఫార్మ్స్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వం, 350cc కంటే తక్కువ ఇంజిన్‌ కెపాసిటీ గల బైకులు, స్కూటర్లపై GSTని తగ్గించింది. దీనివలన అన్ని బ్రాండ్లు ధరలు తగ్గించాల్సి వచ్చింది. TVS మాత్రం ఫాస్ట్‌గా ఈ అప్‌డేట్‌ను తీసుకువచ్చి, కస్టమర్లకు లాభాన్ని అందించింది. ఈ తగ్గింపులు బేస్‌ వేరియంట్స్‌కు వర్తిస్తాయి, వేరియంట్లు మారేకొద్దీ ధరలు కూడా మారతాయి.

ఫెస్టివ్ సీజన్‌లో బిగ్ బెనిఫిట్
దసరా, దీపావళి ముందు వచ్చిన ఈ ధర తగ్గింపులు బైక్, స్కూటర్ కొనుగోళ్ల క్రేజ్‌ను పెచాయి. జూపిటర్‌ నుంచి ఎన్‌టార్క్‌, రైడర్‌ వరకు అన్ని మోడల్స్‌ బడ్జెట్‌లోకి రావడంతో, TVS షోరూమ్స్‌ ఈ సీజన్‌లో బిజీగా మారాయి.