Green SM Electric Limo Taxi Service Launched:  గ్లోబల్ ఈవీ టాక్సీ మార్కెట్ లో మోస్ట్ పాపులర్ వియత్నామీస్ బ్రాండ్ గ్రీన్ ఎస్ఎమ్ (Green SM) ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తన లగ్జరీ 'గ్రీన్ ఎస్ఎమ్ లిమో' టాక్సీ సర్వీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని ముఖ్య ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో మిగిలిన సిటీలకు విస్తరించనున్నారు. వియత్నాం, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత గ్రీన్ ఎస్ఎమ్ బ్రాండ్ కు ఇండియా ఐదో అంతర్జాతీయ మార్కెట్ కావడం విశేషం. కస్టమర్లకు సేఫ్, రిలయబుల్, హై క్వాలిటీ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంతో పాటు లోకల్ డ్రైవర్లకు ఉపాధి కల్పించడమే తమ మెయిన్ గోల్ అని కంపెనీ ప్రకటించింది.

Read Also: India First Flex Fuel WagonR: మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ..

ఏడు సీట్ల విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

ఈ గ్రీన్ ఎస్ఎమ్ లిమో సర్వీస్ కోసం విన్ ఫాస్ట్ లిమో గ్రీన్ (VinFast Limo Green) అనే ఏడు సీట్ల ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను వాడుతున్నారు. ప్రయాణికుల కంఫర్ట్ కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఈ కార్లలో లగ్జరీ అమినిటీస్ ఉన్నాయి. ప్రతి వెహికల్ లో ప్యాసింజర్ల కోసం డ్రింకింగ్ వాటర్, వెట్ టిష్యూలు, ఇతర బేసిక్ అవసరమైన వస్తువులను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా వాహనాల క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు.

Read Also: First Flex Fuel Motorcycles: హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ

ఏఐ టెక్నాలజీతో హై సెక్యూరిటీ..

కస్టమర్ల సేఫ్టీ కోసం గ్రీన్ ఎస్ఎమ్ వెహికల్స్ లో 'సెక్యూర్-టు-సేఫ్' అనే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ను ఇన్‌స్టాల్ చేశారు. ఇందులో కారు లోపల, బయట నిఘా ఉంచే కెమెరాలు, ఏఐ (AI) ఫీచర్లు, ఎమర్జెన్సీ సపోర్ట్ బటన్లు ఉంటాయి. ఇవి డ్రైవర్ తో పాటు ప్యాసింజర్లకు కూడా యాక్సెస్ లో ఉంటాయి. రోడ్డు సేఫ్టీ, ఎలక్ట్రిక్ వెహికల్ ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లను మాత్రమే సర్వీస్ లోకి తీసుకున్నారు. తమ బిజినెస్ మోడల్ అంతా 'రైడ్ 5 స్టార్' స్టాండర్డ్స్ పైనే రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.

యాప్ ద్వారా ఈజీ బుకింగ్..

గ్రీన్ ఎస్ఎమ్ యాప్ ద్వారా కస్టమర్లు ఈజీగా రైడ్ బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో అవైలబుల్ గా ఉంది. హాట్‌లైన్ నంబర్ ద్వారా లేదా రోడ్డుపై నేరుగా వాహనాన్ని ఆపి కూడా ప్రయాణించవచ్చు. లాంచ్ సందర్భంగా జూన్ 5 నుంచి జూన్ 11 వరకు స్పెషల్ ప్రొమోషనల్ డిస్కౌంట్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు. యాప్ ద్వారా బుక్ చేసుకునే కస్టమర్లకు రూ. 250 వరకు సేవింగ్స్ లభిస్తాయి. సస్టైనబుల్ మొబిలిటీని ప్రమోట్ చేయడానికి ఐదుగురు లోకల్ పార్ట్‌నర్లతో 'గ్రీన్ అలయన్స్ ఫ్రంటియర్' ప్లాట్‌ఫామ్‌ను కూడా కంపెనీ స్టార్ట్ చేసింది.