పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2024లో గూగుల్ లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ లో పవన్ కళ్యాణ్ పేరు ఉండడం విశేషం. ఈ లిస్టులో ఆయన రెండవ స్థానంలో ఉండగా, టాలీవుడ్ నుంచి ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక హీరో పవర్ స్టార్ కావడం మరో సంచలనం.

2024లో గూగుల్ సెర్చ్ డేటా ప్రకారం జనాలు ఎక్కువగా వెతికిన ప్రపంచవ్యాప్త సెలబ్రిటీల పేర్లను తాజాగా గూగుల్ రిలీజ్ చేసింది. అందులో కమెడియన్, పాడ కాస్టర్ కాట్ విలియమ్స్ ను ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసారు. దీంతో ఈ లిస్టులో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండడం మెగా అభిమానుల్లో జోష్ నింపేసింది. ఓవైపు రాజకీయాలు, మరోవైపు నటుడిగా బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఈ ఏడాది మరింతగా పెరిగింది.

నిజానికి పవన్ కళ్యాణ్ తెరపై కన్పించి చాలా కాలమే అవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆయన నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అంతేకాకుండా 2024లో సినిమాలు, రాజకీయాల వల్ల ఎంతోమంది ప్రముఖులు వార్తల్లో నిలిచారు. అయినప్పటికీ వాళ్ళందరినీ పక్కకు నెట్టి పవన్ ఈ లిస్ట్ లో ఉండడం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. 2024లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ లో కేవలం ముగ్గురు ఇండియన్ స్టార్స్ మాత్రమే స్థానాన్ని దక్కించుకున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలో ఉండడం మామూలు విషయం కాదు. ఇక మరో ఇద్దరి విషయానికి వస్తే... హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీలు.

ఇండియన్ నటి హీనా ఖాన్ ఈ లిస్టులో 5వ స్థానంలో ఉన్నారు. ఆమె స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ తో తన పోరాటం గురించి ధైర్యంగా వెల్లడించి వార్తల్లో నిలిచింది. ఇక నిమ్రత్ కౌర్ ఈ లిస్టులో 8వ స్థానంలో నిలిచింది.

2024లో ప్రపంచవ్యాప్తంగా Googleలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సెలబ్రిటీల లిస్ట్
1. కాట్ విలియమ్స్
2. పవన్ కళ్యాణ్
3. ఆడమ్ బ్రాడీ
4. ఎల్లా పూర్నెల్
5. హీనా ఖాన్
6. కీరన్ కల్కిన్ టెరెన్స్
7. హోవార్డ్
8. నిమ్రత్ కౌర్
9. సుట్టన్ ఫోస్టర్
10. బ్రిగ్గిట్ బోజో

Also Read: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!

గూగుల్ డేటా ప్రకారం 2024లో ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యధికంగా సర్చ్ చేసిన సినిమాల లిస్ట్ లో ఇన్సైడ్ అవుట్ 2, డెడ్ పూల్ అండ్ వోల్వరిన్, సాల్ట్ బర్న్, బీటీల్ జ్యూస్, డ్యూన్ పార్ట్ 2 వంటి సినిమాలు ఉన్నాయి. ఇండియాలో స్త్రీ 2, కల్కి 2898 ఏడీ, లపాతా లేడీస్ అత్యధికంగా సర్చ్ చేసిన సినిమాలుగా నిలిచాయి. అలాగే 2024 లో 'హీరామండి' వెబ్ సిరీస్ భారతదేశంలో అత్యధికంగా సర్చ్ చేసిన వెబ్ సిరీస్ గా అగ్రస్థానంలో ఉంది.

Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?