Adivi Sesh's Goodachari 2 Release Date Locked :  టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న అవెయిటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢచారి 2 (Goodachari 2). ఈ మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రిలీజ్ ఎప్పుడంటే?

గూఢచారి 2 మూవీని 2027, ఫిబ్రవరి 5న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 2018లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢచారి (Goodachari)కి సీక్వెల్‌గా ఇది రానుంది. ఫస్ట్ పార్ట్‌కు శశి కిరణ్ దర్శకత్వం వహించగా... అడివి శేష్ జోడీగా శోభిత దూళిపాల నటించారు. రెండో పార్ట్‌కు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించగా... అడివి శేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు.

శేష్‌తో పాటు వామికా గబ్బీ, ఇమ్రాన్ హష్మీ, బనితా సంధు, మధు షాలిని తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించగా... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read : Bold Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న బోల్డ్ హారర్ థ్రిల్లర్ - 18 ప్లస్ వారికి మాత్రమే... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?