Rahul Ravindran Reviews Adivi Sesh's Goodachari 2 : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి 2' (Goodachari 2). 2018లో రిలీజై బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢచారికి సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... 70 శాతం షూటింగ్ పూర్తైంది. తాజాగా ఈ మూవీపై ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

'శేష్ కెరీర్‌లో ది బెస్ట్'

అడివి శేష్ కెరీర్‌లోనే 'గూఢచారి 2' ది బెస్ట్‌గా నిలుస్తుందని అన్నారు రాహుల్ రవీంద్రన్. 'శేష్ తన సినిమాలు 90 శాతం షూటింగ్ పూర్తయ్యాక నాకు చూపిస్తాడు. గూఢచారి 2 సినిమా విషయానికొస్తే... 70 శాతం షూట్ పూర్తైన ఎడిట్ వెర్షన్ చూసి షాకయ్యా. ఇందులో విజువల్స్ ఆశ్చర్యపోయేలా ఉండనున్నాయి.

ఈ ఇండియన్ స్పై థ్రిల్లర్ తప్పకుండా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా ట్విస్టులు వేరే లెవల్‌లో ఉన్నాయి. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. అడివి శేష్ కెరీర్‌లోనే ఈ మూవీ మైలురాయిలా నిలిచిపోతుంది.' అని తెలిపారు.

Also Read : Epic Trailer Rashmika : ఎపిక్ మూవీ ఐస్ లేని అర్జున్ రెడ్డి - ఆనంద్‌లా మాట్లాడడం రాదు... ట్రైలర్ ఈవెంట్‌లో బెస్ట్ మూమెంట్స్