Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 3న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి ఏం జరగలేదే..

జాను, నందు సింహాద్రి చేసిన విషయం ఇంట్లో చెప్పడంతో మనం ఊరి వదిలి పెట్టినా వాడు మనల్ని వదిలి పెట్టడం లేదు అని శారద భయపడితే మనం సిటీకి వచ్చి కూడా వాడికి భయపడితే అర్థం లేదు.. ఒకటో రెండో వాడికి తెలిసి వాళ్ల ఇంటికి వచ్చుంటాం అందుకే ఇల్లు దొరకకుండా చేశాడు.. ప్లేస్ మార్చి ఇల్లు వెతుక్కుందాం అని జాను అంటుంది. ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉండండి అని రామలక్ష్మీ అంటే మీ ఆయన రాత్రి అలా గొడవ చేశాడు.. సింహాద్రి ఇలా చేశాడు ఎలా ఉంటాం అని శారద అంటుంది. ఇంతలో వెంకట్రావు వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి బామ్మకి ఫ్రూట్స్, కిన్నెర, గౌతమికి బాదం పాలు ఇలా అందరికీ అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. రాత్రి అలా ఇప్పుడు ఇలా ఏంటి అని బామ్మ అడిగితే రాత్రి ఏం జరగలేదు.. అన్నీ వదిలేయండి అని వెంకట్రావు అంటాడు. రామలక్ష్మీ బామ్మ వాళ్లతో రాత్రి జరిగిన విషయాలు ఆయన గుర్తుంచుకోరు అని చెప్తుంది. వెంకట్రావు తీరుకి అందరూ నోరెళ్లబెడతారు. ఇక నందు సింహాద్రికి తెలీకుండా దూరంగా ఇల్లు చూడమని జానుకి చెప్తుంది.

ఎప్పుడూ అమ్మే కాదు.. భార్య గురించి పట్టించుకో..

జాను వాళ్ల కోసం సూర్య వెతుకుతూ ఉంటాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియక చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ఇక మురళీ కొత్త నెంబరు నుంచి బాబిన్‌కి కాల్ చేసి అమ్మని చూస్తూ ఉండరా.. ఏం కావాలో అన్నీ తెచ్చి ఇవ్వరా అని అంటుంది. నందు ఫోన్ తీసుకొని బావగారి అమ్మగారిని బాగా చూసుకో అని సెటైర్లు వేస్తుంది. పెళ్లాం గురించి కూడా చూసుకోవచ్చు కదా అని నందు అంటే మురళీ నందుని దగ్గరకు తీసుకొని చూశాను అని అంటాడు. ఇంతలో జాను వచ్చి సింహాద్రి ఇచ్చిన చెక్ మురళీ అకౌంట్‌లో వేయమని అంటుంది. మురళీకి లెక్కలు రావు వద్దు అని నందు అంటుంది. జాను నందు మాట వినకుండా 45 లక్షల చెక్ ఇస్తుంది. వణుకుతూ మురళీ తీసుకుంటాడు. ఈ డబ్బు వెంటనే అకౌంట్‌లో వేయ్ అని జాను అంటుంది. వెంకట్రావుని తోడు తీసుకెళ్లమని నందు చెప్తుంది. బావని తగ్గించి మాట్లాడకు అని జాను అంటుంది.

సూర్య నుంచి తప్పించుకున్న మురళీ..

మురళీ, వెంకట్రావు ఇద్దరూ కలిసి బ్యాంక్‌లో డబ్బులు వేస్తారు. ఇద్దరూ ఓ షాప్ దగ్గర కూల్ డ్రింక్ తాగి వెళ్తుంటే సూర్య మురళీని చూస్తాడు. సూర్యని చూసి మురళీ పారిపోతే సూర్య వెంట పడతాడు. అడ్రస్ అడిగితే ఎందుకు సింహాద్రికి పట్టిస్తావా అని మురళీ అంటాడు. నేను జానుతో మాట్లాడాలి అని సూర్య అంటే జాను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది నువ్వు మళ్లీ తనని ఇబ్బంది పెట్టకు అని మురళీ అంటాడు. సూర్య ఎంత మాట్లాడాలని చూసి మురళీ వినకుండా వెంకట్రావుని తీసుకొని పారిపోతాడు. మరోవైపు జాను బ్రోకర్లకు కాల్ చేసి ఇంటిని చూడమని అడుగుతూ ఉంటుంది. ఇంతలో మురళీ, వెంకట్రావు వస్తారు. ఇద్దరూ తెగ ఆయాస పడిపోతూ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.