Godavari Serial Today Episode | ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 14న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నేను ఈ కాలంలో పుట్టుంటేనా..

సంజయ్ పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడంతో పారు,శివుడు చాలా బాధ పడతారు. ఇక జాను వాళ్ల ఇంట్లో అందరూ సంజు పెళ్లికూతురిని డేటింగ్‌కి పిలిచాడు అని చెప్పుకొని నవ్వుకుంటారు. బామ్మ శారదతో ఆ కాలంలో పుట్టి కాపురం చేసుకున్నాకానీ ఈ కాలంలో పుట్టుంటేనా అని బామ్మ అంటుంది. అసలు డేటింగ్ అంటే ఏంటి అని శారద అడగితే నందు చెప్తుంది. శారద నోరెళ్ల బెట్టి అలా ఎలా అడుగుతాడే అని అంటుంది. ఆ సంజయ్‌కి ఒళ్లంతా పొగరే.. అలాంటి వాడికి బుద్ధి చెప్పే అవకాశం నాకు వస్తేనా అని జాను అంటే అలాంటి వాడికి నువ్వే కరెక్ట్ అని మురళీ అంటాడు. ఇక మురళీ నిద్ర వస్తుందని నందులో పద వెళ్లి పడుకుందాం అంటే నందు కోపంగా చూస్తుంది. కిన్నెర, గౌతమి ఎక్కడ పడుకుంటారు అని నందు అడిగితే అవన్నీ నీకు ఎందుకు మీరు వెళ్లండి అని బామ్మ అంటుంది. నందు కోపంగా చూసి వెళ్లిపోతుంది.

అమ్మానాన్న తినలేదురా..

సంజయ్ తినడానికి వచ్చి రమణిని భోజనం పెట్టమని అడుగుతాడు. రమణి వడ్డించి సంజయ్ తినే టైంకి అమ్మానాన్న తినలేదురా అని అంటుంది. దాంతో సంజు తినకుండా చేయి కడగేసి పారు, శివుడి దగ్గరకు వెళ్తాడు. అమ్మమ్మ తాతయ్య అని పిలిస్తే ఇద్దరూ మాట్లాడరు. పెళ్లి సంబంధం అవ్వలేదు అనే తినరా అంటే కావాలనే చెడొట్టావ్ కదా అని శివుడు అడుగుతాడు. భోజనం చేయండి లేదంటే ఆరోగ్యం పాడవుతుందని సంజు చెప్తే పెళ్లి చేసుకోకపోతే జీవితమే నాశనం అయిపోతుంది అని శివుడు అంటాడు. నా పెళ్లికి మీ భోజనానికి లింక్ పెడతారేంటి తినండి అని సంజు అంటే మేం తినమంటే తినమని శివుడు పారు అంటారు. అయితే నేను తినను అని సంజు వెళ్లిపోతాడు.

ఏంటి బాబు నీకు సపరేట్ రూం కావాలా..

నందు మురళీని సీరియస్‌గా చూస్తుంది. ఏంటి నందు అలా చూస్తున్నావ్ అని మురళీ ఏంటే ఏంటి బాబు నీకు సపరేట్ రూం కావాలా.. ఆ ముసలితో కలిసి భలే స్కెచ్ వేశావ్ అంటుంది. మనం మొగుడు పెళ్లాలం నందు ఒక గదిలో ఉండటానికి స్కెచ్ వేయాలా అని అంటాడు. ఇక్కడ కూడా మనకి స్పెషల్‌గా గది సాధించావ్ అని అంటుంది. నీ మీద నాకు ప్రేమ ఉంది కానీ ఈ గది ప్లాన్ నాది కాదు సరే నేను బయటకు వెళ్లి పడుకుంటా అని మురళీ అంటాడు. బయటకు వెళ్లి ఇంట్లో వాళ్లతో నన్ను తిట్టిస్తావా అని నందు అంటే మరేం చేయాలి అని మురళీ అంటే వచ్చి నా ఒడిలో పడుకో అని నందు అంటే మురళీ సీరియస్‌గా వెళ్లి పడుకుంటాడు. తర్వాత ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడిపోతారు. తర్వాత నందు పడుకుంటే మురళీ అలా చూస్తూ మురిసిపోతాడు.

ఎక్కడో ఆ అమ్మాయి ఉంటుంది..

జాను నిద్ర పోకుండా బాల్కానీలో ఉన్న కృష్ణుడి బొమ్మ చూస్తూ తండ్రి మాటలు గుర్తు చేసుకొని కిన్నెర ఆపరేషన్ ఏ ఆటంకం లేకుండా జరగాలి అనుకుంటుంది. జానుని మేడ మీద నుంచి సంజు చూస్తాడు. మరోవైపు శివుడు పారు ఏం తినలేదు అని పాలు తీసుకెళ్లి ఇచ్చి తాగమని బతిమాలుతాడు. సంజుని పెళ్లే చేసుకోమన్నాం కదా ఎందుకు చేసుకోవడం లేదు అని పారు అంటే దానికి శివుడు మనం వాడికి పెళ్లి పెళ్లి అని తలతింటున్నాం కానీ వాడు ఇంకా ఆ గాయం నుంచి బయటకు రావడం లేదు.. వాడి మనసుకి తగిలిన గాయం పోయేలా ఎవరో ఒకర్ని ఆ దేవుడు పంపిస్తాడు. ఆ అమ్మాయి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అని శివుడు అంటారు.

ఇది నా ప్లేస్..

జాను దగ్గరకు సంజయ్ వెళ్లి ఇక్కడేంటి అని అడుగుతాడు. నిల్చొన్నా అని జాను అంటే నాకు కళ్లు కనిపిస్తున్నాయి నిల్చొన్నా అని నువ్వు చెప్పాలా.. ఇక్కడెందుకు ఉన్నావ్,, ఇది నా ప్లేస్ నేను మాత్రమే ఇక్కడ ఉండాలి అని అంటాడు. ఇక్కడ నిల్చొంటే ప్లేస్ అరిగిపోతుందా అని జాను అంటే ప్రతీ దానికి ఓ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సంజు అంటే ఈ విషయం సాఫ్ట్‌గా కూడా చెప్పొచ్చు.. నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలా మాట్లాడుతున్నారు అని జాను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.