Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 11న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక్కడి నుంచి వెళ్లను..

జానుతో సూర్య మాట్లాడుతుంటే నిత్య కావాలనే సూర్యతో చనువుగా మాట్లాడుతుంది. దాంతో జాను ఫోన్ కట్ చేస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అని సూర్య అరుస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా బావ నిన్ను దక్కించుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్లను ఈ సిటీలోనే ఉంటాను అని నిత్య అంటుంది.

ఇల్లు ఖాళీ చేయండి ఇప్పుడే..

జాను ఇంట్లో అందరూ ఆరు బయట కూర్చొని ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు. కిన్నెర కథ చెప్పమని సూర్యని అడిగితే ఏడు చేపల కథ చెప్తే బామ్మ ఫుల్ ఫైర్ అయిపోతుంది. నా చిన్నప్పటి నుంచి ఆ కథే వింటున్నా ఈ పిల్లకి అదే చెప్తావా అని అరుస్తుంది. బామ్మ కేకలు మురళీ మెషిన్ కుట్టే సౌండ్ అప్పుడే వచ్చిన సంజయ్‌కి వినిపించి అక్కడి వెళ్లి ఏయ్ అని అరుస్తాడు. అందరూ ఏమైందా అని చూస్తారు. ఇల్లు అద్దెకి ఇస్తే ఇంట్లో ఉండాలి ఇంటి బయట మెషన్లు పెట్టి కుట్టడం కాదు.. ఇప్పుడే ఇల్లు ఖాళీ చేయండి అని సంజయ్ అరుస్తాడు.

మీ ప్రాబ్లమ్ ఏంటి..

జాను సంజయ్ దగ్గరకు వెళ్లి మీ ప్రాబ్లమ్ ఏంటి అని అడుగుతుంది. ఏంటి మళ్లీ చెప్పు అని సంజయ్ అంటే మేం ఇక్కడ ఖాళీగా లేం రెంట్‌ ఇస్తున్నాం అని జాను అంటే నువ్వు ఇచ్చే రెంట్ నా గంట ఖర్చులకు సరిపోదు.. నా ఇంట్లో ఉంటున్నావ్ నా ఇంట్లో ఉండాలి అంటే సౌండ్ చేయకూడదు అని అంటాడు. మేం ఇక్కడ డ్యాన్స్ చేయడం లేదు పనులు చేసుకుంటున్నాం అని జాను అంటే నాకు సౌండ్ రాకూడదు టాపిక్ ఓవర్.. నువ్వు చెప్పింది నేను వినడం కాదు.. నేను చెప్పిందే మీరు వినాలి అని వెళ్లిపోతాడు. సంజయ్ మీద తాతయ్య వాళ్లకి కంప్లైంట్ ఇస్తా అని జాను అంటే ఇక్కడ గొడవలు పెంచకు మళ్లీ ఇల్లు ఖాళీ చేయమంటారు అని మురళీ, శారద చెప్తారు.

సంజయ్‌ని పెళ్లి చేసుకోమని చెప్పండి..

శివుడు, పార్వతి, తన భర్తలకు పారు చిన్న కూతురు వడ్డిస్తుంది. సంజయ్‌కి పెళ్లికి ఒప్పించండి అని పారు భర్తతో చెప్తుంది. అది జరిగే పని కాదు వదిలేయండి అని అల్లుడు చెప్తాడు. ఇంతలో సంజయ్ తినడానికి వస్తాడు. ఏమైంది అలా ఉన్నారు అంటే ఏం చెప్తే ఎవరు వింటారు అని పారు అంటుంది. నా పెళ్లి గురించేనా అని సంజయ్ అంటే వైజాగ్‌లో ఉన్న మీ అత్త ఫోన్ చేసింది.. నా పెంపకం సరిగ్గా లేదు అంట.. వాళ్ల దగ్గర ఉంటే నువ్వు సరిగా ఉండేవాడివి అంట అని పారు అంటుంది. నా పెళ్లి టాపిక్ తీయకండి అని చెప్పి సంజు వెళ్లిపోతాడు.

క్షమించండి అమ్మమ్మతాతయ్య..

సంజయ్ రాత్రి పారు, శివుడు పడుకున్న తర్వాత వాళ్ల గదికి వెళ్లి కాళ్లకి దండం పెట్టి మీరే నా ప్రపంచం నేను మిమల్ని చాలా బాధ పెడుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి వెళ్లిపోతాడు. సంజు వెళ్లగానే శివుడు, పార్వతి లేస్తారు. పారు భర్తతో ఏంటి ఇది అంత ప్రేమిస్తున్నాడు కదా అది నిద్రలో చెప్పడం ఎందుకు అని అంటే మనం ఈ రోజు ఇది చూడటం లేదు వాడు మనకి ఈ రోజు చెప్పడం లేదు కదా ఆ సంఘటన జరిగినప్పుడు నుంచి ఇలా అయిపోయాడు కదా., వాడు దేన్ని ఎక్కువ ప్రేమించినా ఇష్టపడినా వాళ్లు దూరం అయిపోతున్నారు అని బాధ పడుతూ ఇలా కోపం నటిస్తున్నాడు.. అమ్మానాన్నలకు దూరం అయ్యాడు.. ఫ్రెండ్స్ లేరు వాడికి వాడే ఒంటరిగా బతుకుతున్నాడు అని శివుడు అంటాడు. సంజు వెళ్లాడా లేదా అని చూస్తే సంజు బయట పని మనిషితో తాతయ్య, అమ్మమ్మలకు ఇలా చూసుకో అలా చూసుకో అని జాగ్రత్తలు చెప్తాడు.

సంజయ్‌కి పెళ్లి చూపులు..

సంజయ్‌కి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఇంతలో జాను ఇంటికి వెళ్తే బామ్మ జానుని ఉండమని చెప్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని సంజయ్ బాబాయ్ అడిగితే రాత్రి మీ మనవడు మా ఇంటికి వచ్చి గోల చేశాడు బామ్మ అని జాను చెప్తుంది. సంజయ్‌ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి..తనని మందలించండి అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.