Godavari Serial Today May 28th: 'గోదావరి' సీరియల్: జానుని తిట్టిన శాంతి.. అత్తపై జాను రివర్స్! సూర్య డెస్టినీ గోల ఏంటో!
1 week ago 2
ARTICLE AD
మీ అక్క కోసమే తాగాడు..
మురళీ ఫుల్లుగా మందు తాగేసి పడిపోతాడు. సూర్య బలవంతంగా మురళీని లేపుతాడు. ఎంత ప్రేమిస్తే అంత బాధ పడాలి అని మురళీ అంటాడు. ఇంతలో జాను వస్తుంది. జాను సూర్యని చూసి మా బావని ఇంత తాగిస్తావా అని సూర్య మీద కేకలు వేస్తుంది. మీ అక్క కోసమే తాగాడు అని సూర్య అంటాడు. అవును జాను నేనే తాగాను అని మురళీ అంటాడు.
నందుని బాగా చూసుకుంటాడా..
బాధ పడుతున్నావా అమ్మా..
శంకర్, తన భార్య బామ్మ దగ్గరకు వెళ్తారు. బాధ పడుతున్నావా అమ్మా అని శంకర్ అంటే సంపాదించినది అంతా పెద్ద కూతురికే ఇచ్చేస్తే మిగతా ముగ్గురు కూతుళ్ల పరిస్థితి ఏంట్రా అదే నా బాధ అని బామ్మ అంటుంది. మరోనాలుగేళ్లు ఎక్కువ కష్టపడతా అంతే కదమ్మా అని శంకర్ అంటాడు. అలా ఎలా అంటావురా అని బామ్మ బాధ పడుతుంది. బాధతో కన్నీరు పెట్టుకుంటుంది. ఏం కాదులే అని శంకర్ అంటాడు.
నా కొడుకు ఇలా అవ్వడానికి మీరే కారణం..
జాను, సూర్య మురళీని తీసుకొని ఇంటికి వెళ్తారు. శాంతి చూసి నా కొడుకు ఇలా తయారవ్వడానికి కారణం మీరే.. నా కొడుకుని నాశనం చేశారు అని శాంతి జానుని తిడుతుంది. మీ అక్క వల్లే  నా కొడుకు ఇలా అయిపోయాడు అని అంటుంది. మీకు పెళ్లి అయింది కదా మీకు పెళ్లి నచ్చితేనే చేశాను కదా అత్త.. మీరు చేసుకోను అంటే మీకు బలవంతంగా చేశారా.. అక్కకి ఇష్టం లేదు కదా చెప్తే అర్థం చేసుకోవా.. బావ నీకు ఎంతో మాకు అంతే బావ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది.
మా బావ ఇలా చేస్తాడని అనుకోలేదు..
మా బావ ఇలా తాడుతాడు అని అనుకోలేదని జాను సూర్యతో అంటుంది. జాను ఒక్కదానివే ఎలా వెళ్తావ్ నేను డ్రాప్ చేస్తా అని సూర్య అంటాడు. నీకు బైక్ లేదుగా అని జాను అంటే నీ బైక్ మీద నేను డ్రాప్ చేస్తా అంటాడు. ఇక తర్వాత జానుని సూర్య డ్రాప్ చేసి స్కూటీ నేను తీసుకెళ్లి నీకు రేపు ఇస్తా అని అంటాడు. జాను సరే అంటుంది.
రిజిస్టేషన్ ఎప్పుడురా..
శంకర్ సింహాద్రికి కాల్ చేసి తోట రిజిస్టేషన్ త్వరగా చేయించేయరా.. పెళ్లి పనులు మొదలు పెట్టాలని అంటాడు. ముందు నువ్వు పెళ్లి పనులు చేసుకోరా.. నేను రిజిస్ట్రేషన్ పనులు చూసుకుంటా అంటాడు.
మనల్ని డెస్టినీ కలుపుతుంది..
సూర్య జానుతో మన ఇద్దరినీ డెస్టినీ కలుపుతుంది. మీ అక్కని చేసుకునే వాడు నా ఫ్రెండ్ అని అంటాడు. డెస్టినీ డెస్టినీ ఎప్పుడూ అదే కదా అని అంటాడు. జాను ఇంటికి వెళ్లి తండ్రితో బావ పరిస్థితి బాలేదు నాన్న అని జరిగింది అంతా చెప్తుంది. శంకర్ షాక్ అయిపోతాడు. వాడికి లేని పోని ఆశలు కలిపింది మనమే అని శంకర్ బాధ పడతాడు. మురళీ బావ చాలా మంచోడు అక్కని బాగా చూసుకుంటాడు కానీ అక్క తన సంతోషం వేరే చోట కోరుకుంది అని జాను అంటుంది. పెళ్లి ఘనంగా చేయమన్నారు అని జాను అంటే అంత డబ్బు మన దగ్గర ఉందా అని జాను అడిగితే సింహాద్రి దగ్గర డబ్బు ఉందమ్మా అది ఎంతో కనుక్కుంటా అని శంకర్ అంటాడు. అక్క పెళ్లి అయిపోతే మళ్లీ దుబాయి వెళ్లిపోతా అని శంకర్ జానుతో చెప్తాడు.
అమ్మకి తెలీకుండా వెళ్లిపోవాలి..
సూర్య తన తల్లికి తెలీకుండా బయటకు వెళ్లిపోవాలి అని అనుకుంటాడు. మురళీ కూడా తాగినందుకు తల్లి తిడుతుందని తెలీకుండా బయటకు వెళ్లిపోవాలి అనుకుంటాడు. ఇద్దరికీ ఇద్దరు తల్లులు ఎదురు పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Read Entire Article