Godavari Serial Today Episode | జాహ్నవి ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తారు. జాను తండ్రి కోసం నేతి పూరీ తీసుకొస్తుంది. ఇక శంకర్ తన నలుగురు పిల్లలకు తనే తినిపిస్తాడు. ఇక అలకనంద తనకు ఎన్నారై సంబంధం చూడమని తండ్రికి చెప్పాలి అని నా ఫ్రెండ్ ఎన్నారై సంబంధం చేసుకుంది తనని కూడా రమ్మంటుందని చెప్తుంది. తనకి కూడా ఎన్నారై సంబంధం చూడమని చెప్పబోయే టైంకి శారద ఆపేస్తుంది.

శంకర్ గౌతమితో నువ్వు కలెక్టర్ అవుతావు కదమ్మా అని అంటే గౌతమి హా అంటుంది. ఇంతలో బామ్మ దాని ముఖం అవుతుంది.. ఒకసారి కలెక్టర్ అంటుంది.. మరోసారి కండక్టర్ అంటుంది.. కాసేపు చదివి.. ఇక నా వల్ల ఈ చదువులు కావు అని పెళ్లి చేయమని అంటుందని చెప్తుంది. దాంతో అందరూ నవ్వేస్తారు. కూతుళ్ల నవ్వులు చూసిన శంకర్ మనసులో నా పిల్లులు కుటుంబం ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటాడు. మరోవైపు సూర్య తల్లితో కలిసి చెస్ ఆడుతాడు. భువన జాహ్నవిని గుర్తు చేసుకొని ఆ పొగరు బోతు జాహ్నవి నాకు నచ్చలేదురా.. అది నన్ను చాలా అవమానించింది,, ఎప్పుడో ఒకసారి అది నాకు దొరుకుతుంది దాని పొగరు అణిచేస్తా అని అంటుంది. సూర్య మనసులో అమ్మ గోదావరి పిల్ల మీద పగ పట్టేసింది అనుకుంటాడు. తల్లితో అమ్మ తనకు తన తండ్రి అంటే ఇష్టం అనుకుంటా అందుకే ఆయనతో తీసుకుంది అని చెప్తాడు. ఇక మనసులో గోదారి పిల్ల ఇప్పుడేం చేస్తుందో అని అనుకుంటాడు.

AlSO READ: నిండు మనసులు: ఇందిర అరెస్ట్! రెచ్చిపోయిన గణకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సిద్ధూ!

జాహ్నవి గౌతమి, కిన్నెరలతో చేతులు నొక్కించుకుంటుంది. మా వల్ల కాదే అక్క అని ఇద్దరూ అంటే మీ కోసం నేను పోరాడి అంత పని చేస్తే మీరు నాకు ఈ మాత్రం చేయలేరా అంటుంది. దానికి కిన్నెర, గౌతమిలు నువ్వు నాన్నని ఇంప్రెస్ చేయాలని ఇలా చేశావ్ అని అంటారు. ఇంటి కోసం నేను గొడ్డులా కష్టపడుతుంటే మీకు అర్థం కావడం లేదా అని జాను అంటే అవును అక్కా అని కిన్నెర అంటుంది. చూశావా చిన్నదానికి అర్థమైంది నీకు అర్థం కాలేదా అని జాను అంటే చెల్లి చెప్పింది నాకు అర్థమైంది నీకే అర్థం కాలేదు అని గౌతమి నవ్వుతుంది. దాంతో జాను ఆలోచించి ఏంటే నన్నే గొడ్డు అని అంటావా అని చిన్నదాన్ని అడుగుతుంది. కిన్నెర, గౌతమి నవ్వుతారు. జాను ఉడికిపోతుంది. మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా మా అక్క నా త్యాగం అర్థం చేసుకుంటుందని జాను అంటుంది.

ముగ్గురు నందు దగ్గరకు వెళ్లే సరికి నందు తన ఎన్నారై ఫ్రెండ్‌తో మాట్లాడుతుంది. ఎలాగోలా మా నాన్నకి ఎన్నారై సంబంధానికి ఒప్పిస్తా ఎంచక్కా అమెరికా వచ్చేస్తా అని నందు అంటే అవునా అని మిగతా ముగ్గురు చెల్లెళ్లు పెద్దగా నవ్వుతారు. అక్క నీ ఫ్రెండ్ వాళ్ల నాన్న బాగా డబ్బున్నోడు కాబట్టి మీ ఫ్రెండ్ అక్కడే చదువుకొని అమెరికాలో సెటిల్ అయింది కానీ మన పరిస్థితి అది కాదు.. ఆశపడటానికి హద్దు ఉండాలి అక్క అని జాను చెప్తుంది. బంగారం లాంటి మురళీ ఉండగా ఇంకేంటి అని గౌతమి, కిన్నెర అంటారు. మురళీబావని చేసుకొని ఇక్కడే ఉండిపోవాలా అని నందు అంటే ఎన్నారై సంబంధం చేసుకునే స్థాయి మనకి లేదు.. బంగారం లాంటి మురళీ బావే నీ భర్త అది ఫిక్స్ అయిపో అని అంటారు.

శంకర్‌ పుస్తకం చదువుతూ ఉంటే శారద భర్త భుజం మీద వాలిపోతుంది. శంకర్ భార్యతో మురళీకి నందుకి పెళ్లి చేసేద్దాం.. తర్వాత నేను మళ్లీ దుబాయి వెళ్లి మూడేళ్లు కష్టపడి జానుకి పెళ్లి చేస్తా.. తర్వాత గౌతమిని కలెక్టర్ చదివించాలి.. కిన్నెరకు మంచి హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించాలి.. ఇక నేను నా ఫ్రెండ్ సింహాద్రికి డబ్బు ఇస్తూ మన ఊరిలో ఒక తోట కొన్నాను.. ఆ తోటే మన పిల్లల భవిష్యత్‌కి పూల బాట అవుతుందని అంటాడు. శారద పడుకోవడం చూసి పనులు చేసి చేసి అలసిపోయిందని అనుకుంటాడు. తర్వాత తన ఫ్రెండ్ సింహాద్రికి కాల్ చేసి నేను పంపిన డబ్బు మొత్తం తోటకి కట్టేశావ్ కదా అని అడుగుతాడు. ఎప్పుడో కట్టేశానురా.. రిజిస్టేషన్‌ పెండింగ్ ఉంది.. అని అంటాడు. రేపు ఉదయం నా కుటుంబంతో కలిసి తోట చూస్తానురా అని అంటే దానికి సింహాద్రి అది నీ తోటరా దానికి పర్మిషన్ ఎందుకు అందరం కలిసి వెళ్లి చూద్దాం అని అంటాడు.

AlSO READ: కార్తీకదీపం సీరియల్: తాత కుర్చీని టార్గెట్ చేస్తున్న జ్యోత్స్న! దీప కార్తీక్‌ని వదులుకోవాల్సి వస్తుందా!

శంకర్ కూతుళ్లని చూడటానికి వస్తాడు. ఇంతలో జాను కిన్నెరకు పాలు తాగించడం.. నందు డిజైన్స్‌కి సాయం చేయడం., గౌతమికి లెక్కల్లో సాయం చేయడం చూసి మనసులో అమ్మా జాను ఎవరికి ఏం కావాలో నీకు తెలుసు.. వాటిని ఎలా తీర్చాలో కూడా నీకు బాగా తెలుసమ్మా అని అనుకుంటాడు. మరోవైపు మురళీ కృష్ణ షాప్ దగ్గర నందు ఫొటోలు తుడుస్తూ ఉంటాడు. జాను వెళ్లి మాస్టర్ మురళీ కృష్ణ మా అక్క ఫొటోలు దుమ్ము పట్టకుండా చాలా కష్టపడుతున్నావ్ అంటుంది. బావ నువ్వు ఎక్కడికో వెళ్లిపోతున్నావ్ అని అంటే నా నందు కోసం నేను ఏమైనా చేస్తా అని మురళీ అంటాడు. మా అక్క కోసం ఇంత చేస్తున్నావ్ కదా మా అక్క నీకు దక్కక పోతే ఏం చేస్తావ్ అని అంటుంది. ఏంటి జాను ఆ మాటలు అని మురళీ అంటాడు. మా అక్క నిన్ను వద్దు అంటే దేవదాసు అయిపోతావ్ ఏమో బావ.,. ఎందుకైనా మంచిది ఒక కుక్క పిల్లని పెంచుకో మంచిది అని అంటుంది. దాంతో మురళీ కర్ర పట్టుకొని ఏదీ ఆ మాట నన్ను చూసి చెప్పు అని జానుకి నాలుగు తగిలించి.. చెవి మెలేస్తాడు. ఇంతలో సూర్య, తుఫాను అటుగా వస్తారు. తుఫాను సూర్య మీ గోదారి పిల్లను ఎవరో ఏడిపిస్తున్నారు బాబు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.