Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. అందరూ శంకర్ ఫొటో దగ్గర ఏడుస్తుంటే నా తమ్ముడిని చంపేశాడు అని శాంతి సింహాద్రిని చూసి అనడంతో సింహాద్రి చాలా భయపడతాడు.. తన తమ్ముడు చనిపోవడానికి కారణం సింహాద్రినే అని శాంతికి తెలిసిందా.. లేదా ఇంకెవరి వల్ల అయినా శంకర్ చనిపోయాడు అని చెప్పింది.. శాంతి ఏం చెప్పింది.. చావు ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఈ రోజు(జూన్‌ 8న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నా తమ్ముడు దీని వల్లే చనిపోయాడు..

శాంతి అందరితో నా తమ్ముడు చనిపోలేదు చంపేశారు అని అంటుంది. దాంతో సింహాద్రి తన గురించి తెలిసిపోయిందేమో అని చాలా టెన్షన్ పడతాడు. అయితే శాంతి తన తమ్ముడు కుటుంబాన్ని చూపించి వీళ్లే వీళ్లంతా నా తమ్ముడిని చంపేశారు.. మరీ ముఖ్యంగా ఈ అలకనంద నా తమ్ముడిని చంపేసింది.. దీని ఆశలు కొంటెమ్మ కోర్కెలు తీర్చలేక చచ్చిపోయాడు అని అంటుంది.

అమ్మ పిచ్చి పిచ్చిగా వాగకు..

శాంతి అలా మాట్లాడుతుంటే మురళీ తల్లితో అమ్మా పిచ్చి పిచ్చిగా వాగకు.. సైలెంట్‌గా ఉండు అని అంటాడు. వాగడం కాదురా.. వాస్తవం.. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని కొండంత ఆశతో ఇచ్చి ఇక్కడికి వచ్చాడురా.. కానీ ఇది ఆకాశానికి నిచ్చెన వేసి.. అమెరికా సంబంధం.. అమెరికా సంబంధం అని నా తమ్ముడికి అంత స్థాయి స్థోమత ఉందా అని చూడకుండా ఇది నా తమ్ముడిని చంపుకుతినిందిరా అని అంటుంది. అమ్మ నోరు మూసుకో అందరూ అంత బాధలో ఉంటే ఇప్పుడు ఇలాంటి మాటలు అవసరమా.. అని మురళీ అంటాడు.

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: శత్రువులకు చేతులు జోడించి దండం పెట్టి వేడుకున్న రామరాజు! ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోతుందా!

అత్యాశతో నా తమ్ముడిని చంపేసింది..

దీని అత్యాశతో నా తమ్ముడిని చంపేసింది అన్న బాధతో మాట్లాడుతున్నానురా.. అమెరికా సంబంధానికి తూగే స్థాయి లేకపోయినా కూతురి ఇష్టం కోసం వాడు ఓకే అన్నాడురా.. ఇప్పుడు వరకు సంపాదించినదంతా దీని కోసమే ఖర్చు పెట్టాడురా.. చివరకు ఆ తోటలో సగం కూడా దీనికి కట్నం కింద రాయడానికి ఒప్పుకున్నాడురా.. అంతా దీనికి ఇచ్చేస్తే మిగతా ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంట్రా.. మిగతా జీవితం ఎలా బతకాలి అనే దిగులు తోనే నా తమ్ముడు కుమిలి కుమిలి గుండె ఆగి చచ్చాడురా.. ఇదంతా దీని వల్లే.. దీని వల్లే అసలు ఇది నష్టజాతకురాలు అని శాంతి అరుస్తుంది.

అత్తా.. నువ్వు మనిషివేనా..

శాంతి అలా అనగానే అత్త అని జాను పెద్దగా అరుస్తుంది. ఒక వైపు కన్న తండ్రిని పోగొట్టుకొని.. మరోవైపు పెళ్లి ఆగిపోయి వినిపించని బాధని కనిపించని కన్నీరు మోస్తుంటే సాటి ఆడదానివై ఓదార్చుకుండా ఇలాంటి టైంలో చంపుకొని తింటున్నావు అంటే నువ్వు మనిషివేనా అని జాను అంటుంది. నేను మాట్లాడినదాంట్లో తప్పేముందే.. ప్రతి మాట నిజమే కదా అని శాంతి అంటుంది.

నీ కొడుకుని కాదన్నాను అనే కదా..

నిజం కాదు అక్కసు.. నీ కొడుకుని నేను పెళ్లి చేసుకోను అన్నాను అని అక్కసు.. ఆ కడుపు మంటతోనే నాన్న పోయారు అన్న బాధలో ఉన్నామని కూడా చూడకుండా మమల్ని ఇంకా ఇంకా ఏడిపించడానికి వచ్చావ్.. అసలు మా నాన్న పోవడానికి కారణమే నువ్వు.. నీ శాపనార్థాల వల్లే మా నాన్న చనిపోయారు.. నీ వల్లే అని నందు అంటుంది. దానికి శాంతి ఏం కూశావే అని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. వదినా అని శారద అరుస్తుంది. ఆయన పోయిన బాధలో మేం ఉంటే ఏంటి వదినా నువ్వు మమల్ని చంపుకొని తింటున్నావ్ అని అంటుంది. వయసులో పెద్ద దానివి మా నాన్నకి అక్కవి అన్న కారణంతో నువ్వు ఎన్ని అంటున్నా ఊరుకున్నా.. ఇంకొక్క మాట అంటే నువ్వు ఎవరో కూడా మర్చిపోతా అని జాను అంటుంది. ఏంటే కొడతావా అని శాంతి అడుగుతుంది.

నాన్న నా వల్లే చనిపోయారా..

బామ్మ శాంతిని తిట్టి మురళీకి చెప్పి తీసుకెళ్లిపోమని అంటుంది. ఇక శారద ఏడుస్తుంటే నందు, జాను, గౌతమి, కిన్నెర అక్కడికి వెళ్లి తల్లి ఒడిలో తల పెట్టి ఏడుస్తారు. నందు జానుతో జాను నాన్న నా వల్ల చనిపోయారా అని ఏడుస్తుంది. అలా ఏం కాదు అక్క నాన్నకి అంత వరకే రాసుంది అని జాను ఏడుస్తుంది.

శంకర్ జానుకి ఇచ్చిన బాధ్యత..

జాను రాత్రి ఒంటరిగా గోదావరి నది దగ్గరకు వెళ్లి తండ్రిని గుర్తు చేసుకొని నాన్న అని పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది. ఇంతలో శంకర్ జాను అని పిలుస్తాడు. జాను లేచి చూసి తండ్రిని హగ్ చేసుకుంటుంది. నాకు మాటిచ్చి ఏడ్వొచ్చా అని శంకర్ అంటే నువ్వు మాతోనే ఉంటాను అని చెప్పి ఇలా మమల్ని వదిలేసి వెళ్లిపోవచ్చా.. తోటలో ఇళ్లు కట్టుకొని మాతో ఉంటాను.. మా పిల్లలతో ఆడుకుంటా అన్నావ్ ఇలా మమల్ని మోసం చేసి వెళ్లొచ్చా అని జాను ఏడుస్తుంది.

మిమల్ని వదిలేసి నేను వెళ్లనురా..

పిచ్చి తల్లి మిమల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానురా.. మీ ఆలోచనలో మీ నవ్వుల్లో.. నేను ఉంటాను.. ఈ గోదారి ఉన్నంత కాలం నేను ఉంటా.. ప్రస్తుతం ఈ నాన్న స్థానం నీదే.. మన కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి.. నీ కళ్లలో ప్రతీ క్షణం ధైర్యం కనిపించాలి.. మన వాళ్ల కోసం నువ్వు ఉన్నావు అనే ధైర్యం కనిపించాలి,,. అంతే కానీ నీ కళ్లలో భయం కనపడకూడదు.. అమ్మా, బామ్మల్ని నువ్వే చూసుకోవాలి.. నీ అక్క, చెల్లెల్ని నువ్వే చూసుకోవాలి.. నా బాధ్యతలు అన్నీ నువ్వే తీసుకోవాలి.. నువ్వు బాధ పడను అని ఎవరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటా అని నాన్నకి మాటివ్వు అని అంటాడు. జాను తండ్రి చేతిలో చేయి వేసి మాటిస్తుంది.

పడినా పడిపోకుండా నిలబడు..

జాను మాటివ్వగానే శంకర్ గోదావరిలోకి వెళ్లి మాయమైపోతే అది చూసిన జాను నాన్న మమల్ని వదిలేసి వెళ్లిపోవద్దు అని పెద్దగా ఏడుస్తుంది. నాన్న నాన్న అని జాను గోదావరి లోకి వెళ్లిపోతుంటే అప్పుడే సూర్య వచ్చి జానుని పట్టుకుంటాడు. ఎంతకీ జాను వినకుండా నాన్న నాన్న అని గోదావరి లోకి వెళ్లిపోతుంటే సూర్య జానుని కొట్టి ఆపుతాడు. మీ నాన్న లేరు జాను అర్థం చేసుకో.. నువ్వు ఈ నిజాన్ని అంగీకరించాలి.. నీ కన్నీటిని ఈ గోదారిలో వదిలేయ్ అని జానుకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. జాను తడబడుతూ నడిచి కూలబడిపోతే సూర్య వెళ్లి నీ అడుగు తడబడకూడదు జాను.. నీ మనసులో ఎంత బాధ ఉన్నా.. గుండెలో ధైర్యం అలాగే ఉండాలి.. నువ్వు నిలబడాలి.. పడినా కూడా పడిపోకుండా నిలబడాలి.. నీ ధైర్యమే నీ ఇంట్లో వాళ్లకి కొత్త ఊపిరి.. అందుకే నువ్వు ఎంత స్ట్రాంగ్‌గా నిలబడితే నీ కుటుంబం అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదే నువ్వు భయపడితే జీవితాలు ఏమైపోతాయో అని వాళ్లు భయపడతారు.. చూడు జాను ఏ కుటుంబంలో అయినా ఇంటి పెద్ద దిక్కు లేనప్పుడు ఓ ఆడపిల్ల ఆ బాధ్యత భుజాన వేసుకొని బలంగా నిలబడి పోరాడుతుంది. అది మా అమ్మ విషయంలో చూశాను.. నువ్వు పోరాడగలవు.. భయంతో తడబడటం నీకు ఇదే మొదటి సారి చివరి సారి కావాలి. నీ కుటుంబానికి నువ్వు ఓ గొడుగు అవ్వడానికి ధైర్యంగా అడుగువేయ్ అని ధైర్యం చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? లాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.