Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. శంకర్‌నారాయణకు తన ప్రాణ స్నేహితుడు సింహాద్రి మోసం చేసి కోట్ల విలువ చేసే తన తోట.. 20 ఏళ్లుగా కూడ బెట్టుకున్న నగదు మొత్తం కాజేశాడని తెలిసి కుప్పకూలిపోతాడు. పెద్ద కూతురి పెళ్లి హడావుడి ఓ వైపు అయితే ప్రాణ స్నేహితుడు చేసిన మోసం మరోవైపు శంకర్ గుండెలను పిండేస్తుంది. ఈ రోజు(జూన్‌ 5న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమైంది నాన్న.. ఎందుకు ఇలా ఉన్నావ్..

శంకర్ రాత్రి అయినా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్లాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో శంకర్ వచ్చి ఏం మాట్లాడకుండా అలా కూలబడిపోతాడు. అందరూ ఏమైందని కంగారు పడతారు. ఏమైందని అడుగుతారు. శంకర్ మాత్రం ఏం మాట్లాడకుండా.. సింహాద్రి చేసిన మోసం తలచుకొని బాధగా ఉంటాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ కుటుంబంలో అందర్ని చంపేస్తా అన్న సింహాద్రి మాటలు గుర్తు చేసుకొని బాధ పడతాడు. నాన్న ఈ టైంలో ఎక్కడికి వెళ్లారు.. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే ఎక్కడికి వెళ్లారు అని జాను అడుగుతుంది.

ఇంతలోనే టెన్షన్ ఎందుకు నాన్న..

అలకనంద పెళ్లి సక్రమంగా జరగాలి అని దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్లాను అంటాడు. ఈ టైంలో వెళ్లడం ఏంటి అని అందరూ అడుగుతారు. నా పెళ్లి అని ఇంతకు ముందు వరకు సంతోషంగా ఉన్నారు ఇంతలోనే ఏమైంది నాన్న ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని నందు అడుగుతుంది.

నందు పెళ్లి దగ్గరుండి నేను చేయిస్తా..

మామయ్య మీరు నందు పెళ్లి గురించి దిగులు పెట్టుకోవద్దు.. పెళ్లి ఏర్పాట్లు అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటా అన్నాను కదా.. రేపు నందు పెళ్లి సక్రమంగా నేను జరిపిస్తా అని మురళీ అంటాడు. మండపం దగ్గరకు తీసుకెళ్లడం నుంచి పెళ్లి జరిగే వరకు మేం చూసుకుంటాం మీరు సంతోషంగా ఉండండి అని సూర్య చెప్తాడు.

ఏరా వెళ్లిపోతావా..

మురళీ శంకర్‌తో మామయ్య మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి.. నేను ఇంటికి వెళ్లి ఉదయమే వచ్చేస్తా అని అంటాడు. ఏరా వెళ్లిపోతావా అని శంకర్ అడుగుతాడు. మురళీ శంకర్ దగ్గరకు వచ్చి ఏమైంది మామయ్య అని అంటాడు. వెళ్లిపోవాలి అని తెలిసినప్పుడు ఏదో ఒక టైంలో వెళ్లిపోవాలి కదరా అని శంకర్ అంటాడు. అదేంటి మామయ్య అలా మాట్లాడుతున్నావ్ అని మురళీ అంటే.. ఏం లేదు లేరా.. నాకు ఓ మాటివ్వురా.. ఈ ఇంటిని.. ఈ కుటుంబాన్ని చూసుకుంటా అని మాటివ్వరా అంటాడు. మురళీ మామ చేతితో చేయి పెట్టి మాటిస్తున్నా మామయ్య ఈ ఇంటిని కుటుంబాన్ని చూసుకుంటా అంటాడు. శంకర్ మురళీ భుజం తట్టి జాగ్రత్తరా అని అంటాడు. మురళీ అనుమానంగా మామయ్యని చూస్తూ వెళ్లిపోతాడు.

నాన్న చూసుకోవడానికి నేను ఉన్నా కదా..

శంకర్‌ని అందరూ గదిలోకి తీసుకెళ్తారు. శంకర్ బాధ పడుతూ ఉంటే జాను వెళ్లి ఏమైంది నాన్న అంతా నేను చూసుకుంటా కదా ఎందుకు బాధ పడుతున్నారు అంటుంది. నేను రేపు వెళ్లిపోతే ఈ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలమ్మా.. అమ్మకి వంట గది తప్ప ఇంకేం తెలీదు.. మీ నానమ్మకి దేవుడు పూజలు ఏం తెలీవు.. మీ అక్కకి అమెరికా వెళ్తేనే సంతోషం అని అనుకుంటుంది. గౌతమికి ఏదీ స్థిరత్వం లేదు.. కిన్నెరకు ఏం తెలీదు అంతా నువ్వే చూసుకోవాలి అమ్మా అంటాడు. నాన్న మీరు దుబాయి వెళ్తే వీళ్లెవరూ నా మాట వినరు.. ఈ మాటలు మళ్లీ చెప్పండి రికార్డ్ చేసుకుంటా అని జాను మొత్తం రికార్డు చేసుకుంటుంది. శంకర్ కంగారు పడుతుంటే నాన్న అన్నీ నేను చూసుకుంటా మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది.

నా కూతుళ్ల భవిష్యత్ ఏమైపోతుందో..

శంకర్ సింహాద్రి చేసిన మోసం గుర్తు చేసుకొని తోట నాకు దక్కకపోతే నా కుటుంబం రోడ్డున పడిపోతుంది. నా నలుగురి కూతుళ్ల భవిష్యత్ నాశనం అయిపోతుందని బాధ పడతాడు. అలకనంద పెళ్లి తంతు గుర్తు చేసుకొని ఏడుస్తాడు. ఏడుస్తూ అలా పడుకుంటాడు. ఉదయం మురళీ, సూర్య పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. మురళీ పెళ్లి కారు డెకరేషన్ చేస్తూ నేను నందు పెళ్లి చేసుకొని ఒక కారులో వెళ్లాలి అనుకున్నా కానీ ఇలా నందు వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్లే కారుని నేను రెడీ చేస్తున్నా.. మరి కాసేపట్లో నందుతో నేను కన్న కలలు అన్నీ ముగిసిపోతున్నాయి అని ఏడుస్తాడు.

నాన్న ఇంకా లేవలేదే..

జాను తల్లి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. నాన్న ఇంకా లేవలేదు అని శారద అనడంతో ఇంకా లేవకపోవడం ఏంటి.. అసలే పెళ్లి హడావుడి అని కిన్నెరను పంపి తండ్రిని లేపమని చెప్తారు. కిన్నెర తండ్రిని లేపుతుంది. శంకర్ లేవకపోవడంతో కంగారుగా తల్లిని పిలుస్తుంది. శారద వెళ్లి చూస్తుంది. శారద లేపినా సరే శంకర్ లేవకపోవడంతో శారద జాను.. నందు, గౌతమి, మురళీ అందర్ని పిలుస్తుంది.

మీ నాన్న ఇక లేరు..

జాను కూడా తండ్రిని లేపి ఎంతకీ లేవకపోవడంతో నాడి పట్టుకొని చూస్తుంది. నాడి దొరకపోవడంతో తండ్రి చనిపోయాడు అని అర్థమై అలా కూర్చొండిపోతుంది. జాను ఏమైందే అని తల్లి ఎంత అడిగినా ఏం చెప్పదు.. ఇంతలో మురళీ వచ్చి మామయ్య మామయ్య అని లేపి గుండె మీద తల పెట్టి గుండె కొట్టుకోవడం లేదని తెలిసి మామయ్య అని షాక్ అయిపోతాడు. సూర్య నాడి పట్టుకొని చూసి అంకుల్ చనిపోయారు అని చెప్తాడు. అందరూ చాలా చాలా ఏడుస్తారు. జాను షాక్‌ అయి అలా కూర్చొండి పోతే మిగతా అందరూ చాలా గట్టిగా ఏడుస్తారు. తర్వాత శంకర్ బాడీని బయటకు తీసుకెళ్లి అందరూ స్నానం చేయించి శవం దగ్గర కూర్చొని ఏడుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? లాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.