Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(ఆగస్టు 4న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ అమ్మ గారికి ఎదురు తిరగండి..

జాను తన ఇంట్లో అందరితో ఎలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి నా వల్ల తల వంచుకునే పరిస్థితి రాదు అని స్ట్రాంగ్‌గా చెప్తుంది. అక్కా అంతా బాగుంది కానీ నువ్వు సూర్యని లవ్ చేస్తున్నట్లా కాదా అని కిన్నెర అడుగుతుంది. నీకు ఎందుకే తిను అని నందు అంటుంది. జాను సూర్య గురించి ఆలోచిస్తుంది.. సూర్య కూడా జాను వాళ్ల ఇంట్లో అందరూ అన్న మాటలు తలచుకొని బాధ పడుతూ ఉంటాడు. సూర్య దగ్గరకు తుఫాను వచ్చి మీ ప్రేమ ఎక్కడి వరకు వచ్చింది.. అని అడుగుతాడు. అమ్మ వెళ్లి జాను వాళ్ల ఇంట్లో గొడవ చేసింది అని సూర్య అంటాడు. దానికి తుఫాను ధైర్యం అప్పు తెచ్చుకొని.. మీ అమ్మ గారు వచ్చే సరికి రెండు పెగ్గులు వేసి జాను వాళ్లని తిడతావా.. నీకు నాకు కటీఫ్ ఈ జన్మకి నీతో మాట్లాడను.. ఈ ఇంట్లో ఉండను అని చెప్పి బెదిరించు అని తుఫాను సలహా ఇస్తాడు.

ALSO READ: Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?

ఇది కరెక్ట్ కాదమ్మా..

సూర్య భువనని ఆపి నువ్వు చేసింది కరెక్ట్ కాదమ్మా.. జాను వాళ్లతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటాడు. అయితే ఇప్పుడు వెళ్లి వాళ్ల కాళ్ల మీద పడాలా.. నీకు వాళ్ల బాధ కనిపిస్తుంది కానీ నా బాధ కనిపించదా.. అసలు మొదటి నుంచి ఆ జానుతో తిరగొద్దు అని చెప్తున్నా.. వాళ్లు మన స్థాయికి సరిపోరు అని కూడా చెప్పా అయినా విన్నావా.. వాళ్లని ఊరి నుంచి పంపించేసే పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పి వెళ్లిపోతుంది.

కళ్లకి గంతలతో రొమాన్స్!

నందు నిద్రలో భవనతో గొడవ పడుతున్నట్లు.. కలవరించి నిద్రలో మురళీని ఒక్కటి తంతుంది. దాంతో మురళీ కింద పడిపోతాడు. నందు లేచి ఏమైంది బావ అంటే ఆ భువనని తలచుకొని నన్ను తన్నేశావ్ నందు నా నడుం విరిగిపోయింది అని అంటాడు. నందు సారీ చెప్తుంది. ఇక నందు నీరు తాగుతూ మీద పోసుకుంటుంది. చీర మార్చుకోవడానికి వాళ్ల అమ్మ గదికి వెళ్తా అంటే మురళీ వద్దు అని గదిలో మార్చుకోమని చెప్తాడు. దాంతో నందు తన దగ్గర ఉన్న చున్నీలు అన్నీ తీసుకొచ్చి మురళీ కళ్లు.. కాళ్లు.. చేతులు అన్నీ కట్టేస్తుంది. నందు చీర మార్చుకున్న తర్వాత మురళీ కట్లు విప్పే టైంకి ఇద్దరూ కలిసి బెడ్ మీద పడిపోతారు. ఒకర్ని ఒకరు రొమాంటిక్‌గా చూసుకుంటారు.

ALSO READ: Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

మీ అమ్మతో ముందు మాట్లాడు..

జాను కిన్నెరని డ్రాప్ చేయడానికి వస్తుంది. సూర్య అక్కడికి వచ్చి జానుతో మాట్లాడితే మీ అమ్మతో మాట్లాడావా అని అడుగుతుంది. అమ్మ మూడ్ బాలేదు అని సూర్య అంటే అమ్మాయి పడిపోయింది ఇక ఏంటి అని అనుకుంటున్నావా.. ముందు మీ అమ్మతో మాట్లాడు తర్వాత నాతో మాట్లాడు అని జాను అంటుంది. జాను వెళ్లిపోతుంటే సూర్య చేయి పట్టుకొని ఆపుతాడు. ఇంతలో అక్కడికి సింహాద్రి వస్తాడు.

ఏయ్ సింహాద్రి నువ్వేం చేయలేవ్..

ఏమ్మా జాను మా భువనని మీ ఇంటికి పంపించి తిట్టించినా నీకు బుద్ధి రాలేదా సిగ్గు లేదా అని సింహాద్రి అడుగుతాడు. సింహాద్రి నేను ఎందుకు సిగ్గు పడాలి.. నేను పరాయి వాళ్ల తోట ఆక్రమించుకోలేదు.. పరాయి సొమ్ముకి ఆశపడలేదు.. దొంగలా ఇతరుల సొమ్ము తీసుకోలేదు కదా అని అంటుంది. ఏయ్ అని సింహాద్రి అంటే ఏయ్ నడిరోడ్డు మీద నీ పరువు తీస్తా జాగ్రత్త.. నీకు చేత కాక నీ తల్లిని మీ ఇంటికి పంపినప్పుడే నాకు అర్థమైంది.. తోట విషయంలో మమల్ని ఎదుర్కొనే ధైర్యం లేక మీ అమ్మని పంపాడు సూర్య అని జాను అంటుంది. నేను తలచుకుంటే మీరు ఈ ఊరిలో లేకుండా చేయగలను అని సింహాద్రి అంటే ఏం చేసుకుంటావో చేసుకో.. వెళ్లి మీ చెల్లికి చెప్పు శంకర్‌నారాయణ రెండో కూతురు జాను ఏం చేసుకుంటావో చూసుకో అని చెప్పింది అని చెప్పు అని జాను అంటుంది. నీకు ఫ్యామిలీ ఉంది ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు అని మర్చిపోకు అని సింహాద్రి అంటే నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని జాను చెప్తుంది. సూర్యకి స్కూటీ తీయమని చెప్పి పొగరుగా స్కూటీ ఎక్కి రెండు చేతులు మీద వేసి కూర్చొంటుంది. జాను కాస్త దూరం వెళ్లి సూర్యని వెళ్లిపోమని చెప్పి తను స్కూటీ తీసుకొని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.