Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(ఆగస్టు 31న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి ఆపేసిన భువన..

భువనకు సింహాద్రి, కల్యాణ చేసిన దారుణాలు తెలిసిపోతాయి. ఫ్యామీలీ మొత్తం ఇంతే అని భువన పెళ్లి ఆపేస్తుంది. చెల్లమ్మా నా సంగతి నీకు ఇంకా తెలీదు అని సింహాద్రి భువనకు వార్నింగ్ ఇస్తే.. నువ్వు సింహాద్రి అయితే ఇక్కడ భువన.. భువనేశ్వరి దేవీ.. ఎవరికీ భయపడదు అని సూర్యని తీసుకొని వెళ్లిపోతుంది.

ఊరి వదిలి వెళ్లిపోండి..

తోటమాలి శారదకి కాల్ చేసి ఆ సింహాద్రి మంచోడు కాదు.. డబ్బు కోసం ఎన్ని ప్రాణాలు అయినా తీస్తాడు. నా మాట విని ఊరు వదిలేసి వెళ్లిపోండి అని చెప్తాడు. శారద గట్టిగా ఏడిస్తే అందరూ వచ్చి ఏమైందని అడిగితే సింహాద్రి మనల్ని చంపేస్తాడు.. ఊరు వదిలి వెళ్లిపోమని చెప్పారని ఏడుస్తుంది. భయం వద్దు అని జాను సర్ది చెప్తుంది. మురళీ, నందు వాళ్లు మాత్రం వద్దు వెళ్లిపోదాం అని అంటారు. జాను వద్దు అని అంటే శారద వెళ్లిపోదాం అని దండం పెడుతుంది. దాంతో జాను తల్లిని హగ్ ఏడ్చి వెళ్లిపోదాం అని అంటుంది. సిటీకి షిఫ్ట్ అయిపోదాం అని అంటుంది. వెంటనే అందరూ ఏడుస్తూ ఇంట్లో తమ సామాను మొత్తం తీసుకొని తల్లిని చూసి ఎమోషనల్ అయి అన్నీ తీసుకొని గుమ్మం దాటుతారు. బామ్మ శంకర్ ఫొటో పట్టుకొని ఏడుస్తూ కూలబడిపోతుంది. అందరూ ఏడుస్తూ ఇంటిని చూస్తూ కారు ఎక్కి వెళ్లిపోతారు.

నిత్య ఆత్మహత్య..

నిత్య పెళ్లి ఆగిపోయినందుకు ఉరి వేసుకుంటుంది. సింహాద్రి చూసి ఆపుతాడు. నాకు బావే కావాలి బావ లేకపోతే నేను బతకలేను అని ఏడుస్తుంది. మీ నాన్న అంత చేతకాని వాడు కాదమ్మా.. మీ బావ ఎక్కడున్నా పట్టుకొని వచ్చి పెళ్లి చేస్తా అని తల మీద చేయి వేసి ఒట్టు వేస్తాడు. నేను నమ్మను అని నిత్య అంటే మీ నాన్న అంటే ఏం అనుకున్నావ్ అమ్మా అందర్ని లైన్‌లో పెడతా.. మీ నాన్న నీ కోసం ఏమైనా చేస్తాడు.. ఎవరినైనా చంపుతాడు అని చెప్తుంది. జాను వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు అని కల్యాణ్ చెప్పడంతో సింహాద్రి జానుకి కాల్ చేస్తాడు. ఏంటి జాను నాకు భయపడి ఊరు వదిలి వెళ్లి పోతున్నావా అని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. మీరు ఎక్కడికి వెళ్లినా నీ నీడలా వస్తా అని అంటే ఎవడ్రా నీకు భయపడేది,, మా కష్టాలు మాకు ఉన్నాయ్ అందుకే వెళ్తున్నాం అని జాను అంటే ఫోన్ పెట్టేయమని అందరూ అంటారు. మళ్లీ మళ్లీ కాల్ చేస్తే జాను లిఫ్ట్ చేయదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.