GlobeTrotter కోసం 6817 కి.మీల జ‌ర్నీ

3 weeks ago 2
ARTICLE AD

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు- రాజ‌మౌళి రేర్ కాంబినేష‌న్ లో భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ #GlobeTrotter ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ప్ర‌చారంలో వేగం పుంజుకుంది. ఇంత‌కుముందు ఈ మూవీ నుంచి రెండు లుక్ లు విడుద‌ల‌య్యాయి. ఇందులో ప్ర‌ధాన విల‌న్ పాత్ర కుంభ (పృథ్వీరాజ్ సుకుమార‌న్),  మందాకిని (ప్రియాంక చోప్రా) లుక్ విడుద‌ల చేయ‌గా సర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగించాయి. 

పృథ్వీరాజ్ అంగ వైక‌ల్యం ఉన్న క్రూరుడైన విల‌న్ గా ఇందులో క‌నిపిస్తారు. చీర‌క‌ట్టిన మందాకిని తుపాకి ప‌ట్టి ఫైట్ కి సిద్ధ‌మైంది అంటే అది యాక్ష‌న్ ప్యాక్డ్ పాత్ర అని అర్థ‌మైంది. ఇక ప్ర‌జ‌ల దృష్టి అంతా ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 7గంట‌ల నుంచి రామోజీ ఫిలింసిటీలో జ‌ర‌గ‌నున్న గ్లోబ్ ట్రాట‌ర్ టైటిల్ లాంచ్ ఈవెంట్ పైనే నిలిచి ఉంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి ఎలాంటి స‌ర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడో  చూడాల‌న్న ఉత్కంఠ అలానే ఉంది.

అయితే ఈ వేడుక కోసం ఒక అభిమాని ఏకంగా 12 గంట‌లు ప్ర‌యాణించి ఆస్ట్రేలియా నుంచి రామోజీ ఫిలింసిటీకి వ‌చ్చాడు. దాదాపు 6817 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి ఈవెంట్ కోసం వ‌చ్చాన‌ని అత‌డు చెప్పడం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీనికి ప్ర‌తిస్పందించిన రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ ఒక తెలుగు వాడు అయినందున ఈ అభిమానం.. చాలా ఉద్విగ్న‌త క‌ల‌గజేస్తోంది.. ఆకాశం కూడా స‌రిహ‌ద్దు కాదు! అని రాసారు. ఆస్ట్రేలియా పెర్త్ వీధుల నుంచి ఆర్ఎఫ్‌సి ప్ర‌యాణానికి సంబంధించిన టికెట్, పాస్ పోర్ట్ స‌హా చాలా వివ‌రాల‌ను అత‌డు సోష‌ల్ మీడియాలో షేర్ చేసాడు. 

అత‌డి అప‌రిమిత‌మైన ప్రేమ అభిమానాల‌కు నెటిజ‌నులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక ఈ వేడుక కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు రామోజీ ఫిలింసిటీకి త‌ర‌లి వ‌స్తున్నారు. మ‌హేష్‌- రాజ‌మౌళి మూవీ క్రేజ్ ఏ రేంజులో ఉందో ఇది చెబుతోంది.

Read Entire Article