Indian Duo Gayatri-Treesa Clinches Historic Badminton Bronze: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ తెలుగు తేజం, ప్ర‌ముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె అద‌రగొట్టింది. మహిళల డబుల్స్ విభాగంలో త్రీసా జాలీ తో క‌లిసి, గాయత్రి కాంస్య ప‌త‌కం ద‌క్కించుకుంది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ 1, డిఫెండింగ్ ఛాంపియన్లైన చైనా జోడీ లియు షెంగ్ షు, టాన్ నింగ్ లతో తలపడి 21-18, 13-21, 8-21 తేడాతో గాయ‌త్రీ జంట‌ పోరాడి ఓటమి పాలయ్యింది. ఒక గంటా 11 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ, ఈ అన్‌సీడెడ్ భారత ద్వయం కాంస్య పతకాన్ని ముద్దాడింది. గతంలో 2011 లో లండన్ వేదికగా జరిగిన టోర్నీలో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప కాంస్యం గెలిచిన తర్వాత, దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ డబుల్స్ లో ఇండియాకు పతకం అందించిన రెండో జోడీగా వీరిద్ద‌రూ చ‌రిత్ర సృష్టించారు.

🎥 Treesa Jolly and Gayatri Gopichand’s historic BWF World Championships run ended in the semi-finals, but their bronze medal marks India’s first women’s doubles World Championships medal since 2011.#BWF2026 #SportsNews #Delhi #TheStatesman pic.twitter.com/EGhuDnaRsn

— The Statesman (@TheStatesmanLtd) August 22, 2026

తొలి గేమ్ లో ఆధిప‌త్యం..
హెడ్ టు హెడ్ రికార్డులో కేవలం ఒక్క గెలుపు మాత్రమే ఉన్నప్పటికీ, మ్యాచ్ ప్రారంభంలోనే త్రీసా, గాయత్రి జోడీ 7-2 తో అద్భుతమైన ఆధిక్యం ద‌క్కించుకుంది. చైనా జోడీ వరుస పాయింట్లతో ఇంటర్వెల్ సమయానికి 11-7 తో లీడ్ తీసుకున్నా, భారత ప్లేయర్లు ఏమాత్రం జోరు త‌గ్గించ‌లేదు. 31 షాట్ల మారథాన్ ర్యాలీ తర్వాత స్కోరును 12-12 తో చేసి, సమంగా నిలిచారు. ఆ తర్వాత త్రీసా అద్భుతమైన జంప్ స్మాష్ లు, క్రాస్ కోర్ట్ రిటర్న్స్ తో స‌త్తా చాటింది. హోమ్ క్రౌడ్ అందించిన సపోర్ట్ తో స్కోరు 18-18 గా ఉన్నప్పుడు వరుస పాయింట్లు సాధించి 21-18 తో తొలి గేమ్‌ను భారత జంట ద‌క్కించుకుంది.

#WATCH | Delhi: On the bronze medal win by his daughter Gayatri Gopichand and Treesa Jolly at the BWF World Badminton Championships 2026, Pullela Gopichand (father of winners) says, "I'm very happy with the girls', I think they fought really hard... Very happy with the way they… pic.twitter.com/SvwRQDNt68

— ANI (@ANI) August 22, 2026

పోరాడి ఓడిన గాయ‌త్రీ జంట‌..
రెండో గేమ్‌లో ఇరు జోడీలు హోరాహోరీగా స‌త్తా చాటారు. 49 షాట్ల సుదీర్ఘ ర్యాలీతో అభిమానులను ఆక‌ట్టుకున్నారు. స్కోరు 10-10 వద్ద సమమైన సమయంలో చైనా జోడీ తమ అనుభవాన్ని రంగ‌రించింది. భారత షట్లర్ల అన్‌ఫోర్స్డ్ ఎర్రర్స్, నెట్ మిస్టేక్స్ ను అనుకూలంగా మార్చుకుంటూ చైనా ప్లేయర్లు వేగంగా పాయింట్లు సాధించి 21-13 తో గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్ ను డిసైడర్ కు మ‌ళ్లించారు.

కీల‌క స‌మ‌యంలో..
మూడో గేమ్‌లో 56 షాట్ల తీవ్రమైన ర్యాలీతో మ్యాచ్ 2-2 తో స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత చైనా జోడీ మ్యాచ్ వేగాన్ని ఒక్కసారిగా ఇంక్రీస్ చేసింది. భారత డిఫెన్స్ లో ఏర్పడిన లోపాలను టార్గెట్ చేస్తూ వరుసగా ఎటాకింగ్ షాట్లతో దుమ్ము ర‌పింది. ఇంటర్వెల్ సమయానికి 11-5 తో ఆధిక్యం సాధించిన చైనా, ఆ తర్వాత పూర్తి డామినేషన్ చూపించి 21-8 తో మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఓడిపోయినప్పటికీ భారత యువ ప్లేయర్లు సాధించిన ఈ కాంస్య పతకం దేశ బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా నిలిచింద‌న‌డంలో సందేహం లేదు.