Vijay Sethupathi's Gandhi Talks Movie OTT Streaming : కోలీవుడ్ స్టార్స్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సైలెంట్ ఎమోషనల్ డ్రామా గాంధీ టాక్స్. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆ ఓటీటీలో... స్ట్రీమింగ్ కానీ

'గాంధీ టాక్స్' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతానికి రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మూవీ చూడాలనుకునే వారు రెంట్ పే చేసి చూడొచ్చు. త్వరలోనే ఫ్రీగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి కిశోర్ పాండురంగ్ దర్శకత్వం వహించగా... విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిలతో పాటు అదితీ రావ్ హైదరి, మహేశ్ మంజ్రేకర్, సిద్దార్థ్ జాదవ్, జరీనా వహాబ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... జీ స్టూడియోస్, క్యూరియస్ మూవీ మిల్ సంయుక్తంగా నిర్మించాయి. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్, మ్యూజిక్‌, ఎమోషన్స్‌తోనే మూవీ మొత్తం నడిపించారు.

Also Read : మీనా, వినీత్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - ఆ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్