Gallbladder Stones Surgery : గాల్ బ్లాడర్‌ (పిత్తాశయం)లో రాళ్లు ఏర్పడటం చాలామందిలో కనిపించే సమస్య. కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే స్కానింగ్‌ సమయంలో గాల్‌స్టోన్స్‌ బయటపడుతుంటాయి. మరికొందరిలో మాత్రం కడుపునొప్పి, బ్లోటింగ్‌, జీర్ణ సమస్యలు, జ్వరం, జాండీస్‌ వంటి ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉంటే కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో.. నిపుణులు ఇస్తోన్న సూచనలు ఏంటో చూసేద్దాం.

గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయని తెలిసిన వెంటనే సర్జరీ తప్పనిసరిగా చేయించుకోవాలా? మందులతో వాటిని కరిగించవచ్చా? సర్జరీలో రాళ్లను మాత్రమే తొలగిస్తారా? ఆ తర్వాత జీర్ణ సమస్యలు వస్తాయా? ఇలాంటి ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. వీటిపై హైదరాబాద్లోని అగస్థ్య హాస్పిటల్స్లో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

Also Read : కిడ్నీ స్టోన్స్ ఉంటే డైట్లో చేయాల్సిన మార్పులు ఇవే.. తినకూడని, తినాల్సిన ఫుడ్స్ లిస్ట్

గాల్ బ్లాడర్ స్టోన్స్..

గాల్ బ్లాడర్‌ అంటే కాలేయం కింద ఉండే చిన్న సంచిలాంటి అవయవం. కాలేయం తయారు చేసే బైల్‌ (పిత్తరసం) ఇందులో నిల్వ ఉంటుంది. ఈ పిత్తరసంలో ఉండే కొన్ని పదార్థాలు గట్టిపడి రాళ్లుగా మారినప్పుడు వాటిని గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా గాల్‌స్టోన్స్ అంటారు. కొంతమందిలో ఇవి ఎలాంటి సమస్యలు కలిగించకపోవచ్చు. అయితే రాళ్లు బైల్‌ ప్రవాహానికి అడ్డంకిగా మారినప్పుడు నొప్పి, వాపు లేదా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అపోహ : గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే అందరూ సర్జరీ చేయించుకోవాలా?

డాక్టర్ రాహుల్ ప్రకారం ఇది నిజం కాదు. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే సర్జరీ అవసరం లేదని డాక్టర్ రాహుల్ తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు లేకుండా యాదృచ్ఛికంగా స్టోన్స్ గుర్తించిన కొంతమంది పేషెంట్లకు వెంటనే ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చని తెలిపారు.

Also Read : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి

అయితే స్టోన్స్ కారణంగా కడుపునొప్పి, బ్లోటింగ్‌, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే జ్వరంతో పాటు జాండీస్‌ వంటి లక్షణాలు కనిపిస్తే పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఇలాంటి సందర్భాల్లో సర్జరీ అవసరం కావచ్చు.

అపోహ : మందులతో గాల్ బ్లాడర్ స్టోన్స్ పూర్తిగా కరిగిపోతాయి.

గాల్ బ్లాడర్‌లో ఏర్పడిన స్టోన్స్‌ను సాధారణంగా మందులతో పూర్తిగా క్యూర్ చేయలేమని డాక్టర్ రాహుల్ తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని రకాల చిన్న కొలెస్ట్రాల్‌ స్టోన్స్‌కు మందులతో చికిత్స చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అది ప్రతి పేషెంట్‌కు వర్తించదు. అందుకే స్టోన్స్ ఉన్నాయని తెలిసిన వెంటనే సొంతంగా మందులు వాడటం సరైన పద్ధతి కాదు. స్టోన్‌ పరిమాణం, సంఖ్య, స్థానం, లక్షణాలు వంటి అంశాలను బట్టి వైద్యుడు చికిత్సను నిర్ణయిస్తారని తెలిపారు.

Also Read : రాత్రుళ్లు ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మీ కాలేయం చెడిపోయిందని తెలిపే సంకేతాలివే

అపోహా : సర్జరీలో స్టోన్స్ మాత్రమే తొలగిస్తారు

వాస్తవానికి చాలామంది సర్జరీ అంటే గాల్ బ్లాడర్‌లో ఉన్న రాళ్లను మాత్రమే తీసేస్తారని అనుకుంటారు. కానీ సాధారణంగా గాల్‌స్టోన్‌ సమస్యకు చేసే సర్జరీలో స్టోన్స్‌తో పాటు మొత్తం గాల్ బ్లాడర్‌ను తొలగిస్తారని డాక్టర్ రాహుల్ వెల్లడించారు. దీనికి కారణం రాళ్లు ఏర్పడటానికి కారణమైన గాల్ బ్లాడర్‌ అలాగే ఉంటే భవిష్యత్తులో మళ్లీ స్టోన్స్‌ ఏర్పడే అవకాశం ఉండటమే.

అపోహ : గాల్ బ్లాడర్ తొలగించిన తర్వాత జీర్ణ సమస్యలు తప్పవు

ఇది కూడా పూర్తిగా నిజం కాదని వైద్యులు చెప్తున్నారు. గాల్ బ్లాడర్‌ను తొలగించిన తర్వాత చాలామంది పేషెంట్లకు ఎలాంటి ముఖ్యమైన జీర్ణ సమస్యలు రావని డాక్టర్ రాహుల్ తెలిపారు. గాల్ బ్లాడర్‌ బైల్‌ను తయారు చేయదు.. దాన్ని నిల్వ చేసి అవసరమైన సమయంలో విడుదల చేస్తుంది. బైల్‌ను కాలేయం తయారు చేస్తుంది. కాబట్టి గాల్ బ్లాడర్‌ను తొలగించిన తర్వాత కూడా కాలేయం బైల్‌ను తయారు చేస్తూనే ఉంటుంది.

Also Read : కళ్లు, చేతులు, పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బతింటుందని అర్థం.. వైద్యుల సూచనలివే

అయితే కొంతమందిలో సర్జరీ తర్వాత కొంతకాలం ఆహారం విషయంలో మార్పులు అవసరం కావచ్చు. వ్యక్తిని బట్టి తాత్కాలికంగా అజీర్తి, విరేచనాలు లేదా ఇతర జీర్ణ సంబంధిత ఇబ్బందులు కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

గాల్‌స్టోన్స్‌ ఉంటే నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు ఇవే

గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నవారు కొన్ని లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. కడుపులో, ముఖ్యంగా కుడివైపు పైభాగంలో నొప్పిగా ఉన్నప్పుడు, నొప్పి పదేపదే రావడం, బ్లోటింగ్‌, అజీర్తి వంటి సమస్యలు, వాంతులు లేదా వికారం, జ్వరంతో పాటు కడుపునొప్పి, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం, మూత్రం ముదురు రంగులోకి మారడం జరిగితే కచ్చితంగా వైద్యసహాయం తీసుకోవాలి అంటున్నారు.

Also Read : లివర్ని డీటాక్స్ చేసే ఫుడ్స్ ఇవే.. రెగ్యూలర్గా తీసుకుంటే మీ కాలేయం సేఫ్

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.