Vishwak Sen Funky Movie Collections: యువ కథానాయకుడు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఖాతాలో మరో పది కోట్ల గ్రాస్ సినిమా చేరింది. ఆయన హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన 'ఫంకీ' సినిమా ఫస్ట్ వీకెండ్ ఆల్మోస్ట్ పది కోట్ల దగ్గరకు చేరింది. మరి వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేది లుక్ వేస్తే...

ఇండియాలో సోమవారం 'ఫంకీ' నెట్ ఎంతంటే?
Funky Movie India Net Collection: ఇండియా వరకు చూస్తే... ఫస్ట్ వీకెండ్ 'ఫంకీ' సినిమా రూ. 5.75 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. శుక్ర, శని, ఆది వారాల్లో వరుసగా 2.2, 1.9, 1.5 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన సినిమా... వీకెండ్ తర్వాత కోటి రూపాయల్లోకి పడింది. సోమవారం 'ఫంకీ' నెట్ కలెక్షన్ 86 లక్షల రూపాయలు కలెక్ట్ చేసినట్టు ఎర్లీ రిపోర్ట్. దాంతో నాలుగు రోజుల ఇండియా నెట్ రూ. 6.61 కోట్లకు చేరుకుంది.

Also Read: Theatrical Releases This Week: తెలుగులో సుహాస్ & శివ కందుకూరికి... హిందీలో మృణాల్ & తాప్సీకి కాంపిటీషన్ లేదుగా... థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే సినిమాల లిస్ట్

మూడు రోజుల్లో 'ఫంకీ' వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే?
Funky three days worldwide gross collection: ఇండియాలో మూడు రోజుల్లో రూ. 5.75 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన 'ఫంకీ'... వరల్డ్ వైడ్ రూ. 9.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ లెక్కలు చూస్తే...

Also Read: OTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి అంతా వీటిదే

ఇండియాలో మూడు రోజుల 'ఫంకీ' గ్రాస్ కలెక్షన్ రూ. 6.8 కోట్లు. ఓవర్సీస్ నుంచి రూ. 3 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో టోటల్ 9.8 కోట్లకు చేరుకుంది. నాలుగో రోజు అయినటువంటి సోమవారం వచ్చిన కలెక్షన్లతో పది కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది. సోమవారం వరకు సినిమా కలెక్షన్స్ పర్వాలేదు. మంగళ, బుధ వారాల్లో ఈ సినిమా కలెక్షన్ ఎలా ఉంటుంది? అనేది చూడాలి.

అనుదీప్ దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన 'ఫంకీ' సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించింది. విశ్వక్ తల్లిగా ఈశ్వరీ రావు, కయాదు లోహర్ తండ్రిగా సీనియర్ నరేష్, ప్రతినాయకుడిగా సంపత్ రాజ్ నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీత దర్శకుడు.

Also Read: Parasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?