August Last Week Friday OTT Movies Web Series Complete List : ఆగస్ట్ లాస్ట్ వీక్ శుక్రవారం ఓటీటీల్లో టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ మూవీస్ సందడి చేస్తున్నాయి. ఒకే రోజు దాదాపు 12 సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి ఏయే మూవీస్, ఏయే ఓటీటీల్లో ఉన్నాయో ఓసారి చూస్తే...

న్యూటన్స్ థర్డ్ లా - టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా (Newtons 3rd Law). రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్‌తో పాటు జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, త్రినాథ్ వర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శుక్రవారం (ఆగస్ట్ 28) నుంచి ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో (Etvwin) స్ట్రీమింగ్ అవుతోంది.

రోజా రీఎంట్రీ మూవీ - సీనియర్ హీరోయిన్ రోజా చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తమిళ మూవీ అన్బే డయానా (Anbe Diana). పారి ఎలవళగన్ స్వీయ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించారు. అలాగే, రమ్య రంగనాథన్, రోజా సెల్వమణి, చేతన్ కదంబి, సెల్ మురుగన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్' (Sonyliv)లో శుక్రవారం నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

ఆలియాభట్ ఆల్ఫా - బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha). స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆలియాతో పాటు శర్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix)లో శుక్రవారం (ఆగస్ట్ 28) నుంచి అందుబాటులోకి వచ్చింది.

బబితా సింగ్ రిపోర్టింగ్ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బబితా సింగ్ రిపోర్టింగ్ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. నిమిషా విజయన్‌తో పాటు బరున్ సోబ్తీ, ఆన్షుమాన్ పుష్కర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : Irumudi Nakshatra Movie OTT : రెండు ఓటీటీల్లో ఇరుముడి పాప థ్రిల్లర్ మూవీ - టాప్ ట్రెండింగ్‌లో మనెమ్మ సినిమా... తెలుగులోనూ స్ట్రీమింగ్

మూవీస్ / వెబ్ సిరీస్ కంప్లీట్ లిస్ట్

ఓటీటీ ప్లాట్ ఫామ్

మూవీస్ / వెబ్ సిరీస్

నెట్ ఫ్లిక్స్ (Netflix)

గేమింగ్ (మూవీ), ది విష్పర్ మ్యాన్ (సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ), ఆల్ఫా (స్పై యాక్షన్ థ్రిల్లర్), గ్రేవ్ యార్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 3), ఆల్ ది ట్రూత్ ఇన్ మై లైస్ (మూవీ).

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

రొమాన్స్ : ద లాస్ట్ సన్ రైజ్ (హాలీవుడ్ మూవీ), బబితా సింగ్ రిపోర్టింగ్ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)

జియో హాట్ స్టార్ (Jio Hotstar)

పార్ట్ టైమర్స్ (యూత్ వెబ్ సిరీస్), ఐ నోబడీ (క్రైమ్ థ్రిల్లర్ మూవీ).

సోనీ లివ్ (Sonliv)

అన్బే డయానా (రొమాంటిక్ కామెడీ మూవీ).

ఈటీవీ విన్ (ETVwin)

న్యూటన్స్ థర్డ్ లా (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్)

జీ5 (ZEE5)

బందర్ (క్రైమ్ థ్రిల్లర్ మూవీ)

సన్ నెక్స్ట్ (SunNXT)

అంకం అట్టహాసం (క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)

యాపిల్ టీవీ (Apple TV)

డార్క్ మేటర్ సీజన్ 2 (వెబ్ సిరీస్)

ఆహా (Aha)

ఆకలిరాజ్యం (వెబ్ సిరీస్)

Also Read : Romantic Drama OTT : రెండు ఓటీటీల్లో టాలీవుడ్ హీరో రొమాంటిక్ మూవీ - ముగ్గురమ్మాయిలతో రిలేషన్... స్టోరీలో బిగ్ ట్విస్ట్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.