Forbes 30 Under 30 Asia 2026: సాధారణంగా వార్తలు చదివేటప్పుడు మనం చాలా అంకెలు చూస్తుంటాం. కానీ కొన్ని అంకెల వెనుక ఉన్న మెదడు తెలుగువారిదే అని తెలిస్తే చాలా అనందంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఇద్దరి కుర్రాళ్ల గురించి చూద్దాం. వాళ్లిద్ధరు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఆసియా 2026 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వందల మందిని వెనక్కి నెట్టి ఇద్దరు తెలుగు యువకులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఒకరు పిల్లలకు కామిక్స్‌ ద్వారా పైసా విలువ నేర్పుతుంటే, మరొకరు ఏకంగా ఒక హైటెక్‌ ల్యాబ్‌నే బస్సు ఎక్కించి పల్లెటూళ్లకు తీసుకెళ్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివ గణేష్‌ గడ్డం, మధులాస్ బాబు క్రోవిడి ఈ గుర్తింపును పొందారు. శివ గణేష్ ఆర్థిక అక్షరాస్యత కల్పించడంలో తన ముద్ర వేయగా, మధులాష్ బాబు సోషల్ ఇంపాక్ట్ విబాగంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

మే 29, 2026, ఫోర్బ్స్‌ సంస్థ అధికారికంగా ఈ జాబితాను ప్రకటించింది. ఆసియా ఖండంలోని 10 వేర్వేరు విభాగాాల్లో అత్యంత ప్రతిభావంతులైన 300 మంది యువ పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసే క్రమంలో ఈ ఇద్దరు తెలుగు ప్రతిభావంతులు చోటు దక్కించుకున్నారు.

టాప్ ట్రెండింగ్‌లో ఉన్న సైన్స్ వార్తలు మిస్ అవ్వొద్దు

1

భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

2

వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?

3

నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!

4

బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా?

5

6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!

శివ గణేష్‌ గడ్డం- కామిక్స్‌ కథలో కాసులు పాఠాలు

మన చిన్నప్పుడు కామిక్స్‌ అంటే కేవలం చందమామ కథలో లేదా సూపర్ హీరోల పోరాటాల్లో ఉండేవి. కానీ, శివ గణేష్‌ గడ్డం మాత్రం వాటిని ఆర్థిక పాఠాలు నేర్పే ఆయుధాలుగా మార్చశాడు.

నేటి డిజిటల్ యుగంలో డబ్బు నిర్వహణ అనేది చాలా సంక్లిష్టంగా మారింది. చిన్న వయసు నుంచే సేవింగ్స్‌, బడ్జెటింగ్‌, ఇన్వెస్టింగ్‌ వంటి విషయాలపై అవగాహన ఉండాలని శివ భావించారు. సంక్లిష్టమైన ఆర్థికాంశాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చేయడమే ఆయన లక్ష్యం.

ఆయన స్థాపించిన Zeni5 అనే స్టార్టప్ ద్వారా పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు కామిక్స్ రూపంలో ఆర్థిక పాఠాసుల అందిస్తున్నారు. ఇందులో కేవలం డబ్బు పొదుపు చేయడమే కాదు, ఇన్సూరెన్స్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ వంటి కీలక అంశాలను కూడా కవర్ చేస్తున్నారు. సంక్లిష్టమైన పదాలు లేకుండా, బొమ్మల ద్వారా అర్థమయ్యేలా చెప్పడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత.

లారీ డ్రైవర్ కుమారుడిగా మధులాష్ బాబు ప్రస్థానం

మధులాష్ బాబు కథ ఒక సినిమాను తలపిస్తుంది. పశ్చిమోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృష్టం అనే చిన్న గ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం నేడు ఫోర్బ్స్‌ వరకు చేరింది.

ఒక లారీ డ్రైవర్ కుమారుడిగా జన్మించిన మధులాష్‌, ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకున్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కళాశాల్లో బీటెక్‌ చేస్తున్నప్‌పుడు, అక్కడ సరిగా పని చేసే ల్యాబ్‌లు లేకపవడాన్ని గమనించారు. తనకు ఎదురైన కష్టాలు మరో విద్యార్థికి ఎదురుకాకూడదు అనే బలమైన సంకల్పంతో యన ఎడోద్వజ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు.

ఈ ఫౌండేషన్‌ తీసుకొచ్చిందే ఫ్యూచరిస్టిక్‌ ల్యాబ్ ఆన్ వీల్స్‌ ఇది భారత్‌ మొదటి ఏఐ ఆధారిత మొబైల్‌ ల్యాబొరేటరి. ఈ సౌరశక్తితో నడిచే బస్సులో రోబెటిక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, బ్లాక్ చైన్, ఇంటర్నెట్‌ ఆఫ్ థింగ్స్‌, సైబర్ సెక్యూరిటీ, త్రీడీ ప్రిటింగ్ వంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఇందులో ఒక మినీ ప్లానిటోరియం, డ్రోన్ ఆపరేషన్ కిట్లు కూడా ఉన్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బస్సు, ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని అరవై వేల మందికి పైగా విద్యార్థులకు సైన్స్ పాఠాలను చేరువ చేసింది.

వీరి ఆలోచనలు కేవలం కాగితాలకో పరిమితం కాలేదు. పెద్ద ఎత్తు మద్దతును కూడా పొందాయి. తిరుపతిలోని శ్రీ పద్మావ మహిళా విశ్వవిద్యాలయం ద్వారా స్టార్టప్‌ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద 25 లక్షల నిందలు ఎడోద్వజకు అందాయి. అదనంగా అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్శిటీ నుంచి 80 లక్షల పెట్టుబడి లభించింది. ఏడా పది విభాగాల్లో అత్యంత వినూత్నంగా ఆలోచించే 300 మందిని ఫోర్బ్స్‌ గుర్తిస్తుంది. ఆ గ్లోబల్‌ లిస్టులో చేరడం అంటే ప్రపంవ్యాప్తంగా గుర్తింపు పొందడమే.